లూసిఫర్ 2లో ఆ క్యారెక్టర్స్ వైయస్ జగన్, షర్మిలవేనా..? ఇక్కడి నుంచే తీసుకున్నారా..?

సినిమాల్లోని కథలు, క్యారెక్టర్లు ఎక్కడి నుంచో రావు.. రియల్ లైఫ్ నుంచి పూర్తి పొంది రాస్తూ ఉంటారు దర్శకులు, రచయితలు. అందుకే అప్పుడప్పుడు కొన్ని సినిమాలలోని పాత్రలు చూసినప్పుడు ఇది అలా ఉంది..

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 28, 2025 | 04:20 PMLast Updated on: Mar 28, 2025 | 4:20 PM

Are Those Characters In Lucifer 2 Ys Jagan And Sharmila Did They Take Them From Here

సినిమాల్లోని కథలు, క్యారెక్టర్లు ఎక్కడి నుంచో రావు.. రియల్ లైఫ్ నుంచి పూర్తి పొంది రాస్తూ ఉంటారు దర్శకులు, రచయితలు. అందుకే అప్పుడప్పుడు కొన్ని సినిమాలలోని పాత్రలు చూసినప్పుడు ఇది అలా ఉంది.. ఇలా ఉంది అని పోల్చుకుంటూ ఉంటారు. తాజాగా మోహన్ లాల్ హీరోగా పృథ్వీరాజ్ సుకుమారన్ తెరకెక్కించిన లూసిఫర్ 2 విడుదలైంది. ఈ సినిమాకు తెలుగులో యావరేజ్ టాక్ వచ్చింది కానీ.. మలయాళంలో మాత్రం రికార్డు కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. ఇక ఈ సినిమా చూసిన వాళ్ళందరికీ అందులో రెండు పాత్రలు మాత్రం బాగా కనెక్ట్ అయిపోయాయి. ఎందుకంటే అవి మన రాష్ట్రంలో ఉన్న ఇద్దరు ఫేమస్ పొలిటికల్ లీడర్ క్యారెక్టర్స్ తో పోలి ఉండడమే దీనికి కారణం. లూసిఫర్ లో మంజు వారియర్, టోవీనో థామస్ పాత్రలు అత్యంత కీలకo. ఫస్ట్ పార్ట్ లోనే ఈ క్యారెక్టర్స్ కు కావాల్సినంత ఇంపార్టెన్స్ ఇచ్చాడు దర్శకుడు పృథ్వీరాజ్. ఇంకా చెప్పాలంటే టోవీనో క్యారెక్టర్ కాస్త తక్కువగా ఉంటుంది కానీ మంజు వారియర్ మాత్రం సినిమాను లీడ్ చేస్తుంది.

సెకండ్ పార్ట్ లో కూడా ఈ ఇద్దరికీ అద్భుతమైన పాత్రలు దక్కాయి. అక్క తమ్ముడు పాత్రలలో అద్భుతంగా నటించారు మంజు, టోవీనో. అయితే ఈ ఇద్దరి క్యారెక్టర్స్ చూస్తున్నంత సేపు మన దగ్గర వైయస్ జగన్మోహన్ రెడ్డి, వైయస్ షర్మిల క్యారెక్టర్స్ గుర్తుకొస్తూ ఉంటాయి. ఈ ఇద్దరు అన్న చెల్లెల్ల మధ్య కూడా ఎప్పుడూ ఆదిపత్య పోరు నడుస్తూ ఉంటుంది. సినిమాలో ఇద్దరు క్యారెక్టర్స్ చూస్తున్నంత సేపు బయట వీళ్లే గుర్తుకు వస్తారు. సినిమా మొదట్లోనే ఇందులోని పాత్రలు రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ నుంచి స్ఫూర్తి పొందినవి అని ఒక డిస్క్లైమర్ కూడా వేశాడు దర్శకుడు పృథ్వీరాజ్. ఈ లెక్కన సినిమాలో చాలావరకు పాత్రలు బయట ఆయన చూసినవే.. అలా చూసి రాసుకున్నవే అని అర్థమవుతుంది. పైగా మలయాళ సినిమాలలో ఎక్కువగా తెలుగు రాష్ట్రాల్లో జరిగిన సంఘటనలు కూడా ఉంటాయి. ఆ మధ్య పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా నటించిన జనగణమన సినిమాలో మన దిశ ఘటన ఉంటుంది.

మనకంటే ముందు ఈ విషయంపై వాళ్ళే సినిమా తీశారు. ఇప్పుడు లూసిఫర్ సీక్వెల్ లో కూడా జగన్, షర్మిల పాత్రలో ఆధారంగానే మంజు వారియర్, టోవీనో థామస్ క్యారెక్టరైజేషన్ రాసుకొని ఉంటారు అంటున్నారు విశ్లేషకులు. అది నిజమా అబద్దమా అనేది పక్కన పెడితే.. తెలుగు ప్రేక్షకుల వరకు ఈ రెండు క్యారెక్టర్స్ బలంగా కనెక్ట్ అవ్వడం మాత్రం ఖాయం. పైగా సినిమాలో టోవినో థామస్ తండ్రి ముఖ్యమంత్రి.. ఆయన అనుకోకుండా చనిపోవడంతో ఎక్కడో ఉన్న ఆయన కొడుకు వచ్చి సడన్ గా ముఖ్యమంత్రి పీఠం ఎక్కుతాడు. ఇంట్లో అక్క కూడా తమ్ముడుకే సపోర్ట్ చేస్తూ ఉంటుంది. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత పార్టీలో గొడవలు రావడంతో ఆల్రెడీ ఉన్న పార్టీకి నాన్న పేరు తగిలించు మరో కొత్త పార్టీ మొదలు పెడతాడు టోవినో థామస్.

ఇది కూడా మన ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే వైయస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ అని ప్రత్యేకమైన పార్టీ పెట్టి విజయం సాధించాడు జగన్మోహన్ రెడ్డి. ఆ పార్టీ పెట్టినప్పుడు వైయస్ షర్మిల కూడా అన్నయ్యతో పాటే నడిచింది. ఆ తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో చెరొక పార్టీ వైపు వెళ్లిపోయారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో షర్మిల ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా జగన్ కొనసాగుతున్నాడు. ఇన్ని పోలికలు ఉన్నాయి కాబట్టే లూసిఫర్ 2 సినిమాలోని ఆ రెండు క్యారెక్టర్స్ కచ్చితంగా జగన్, షర్మిల నుంచి స్ఫూర్తి పొంది పృథ్వీరాజ్ రాసుకొని ఉంటాడు అంటున్నారు విశ్లేషకులు. మరి ఇందులో నిజం ఎంత ఉందో దర్శక నిర్మాతలకే తెలియాలి.