Chaitu, Sam : విడాకులతో ఆ ఇద్దరు ఓటీటీల్లో స్థిరపడిపోయారా..

సినిమాలతో పాటు వెబ్‌ సిరీస్‌లకు ఓకే చెప్తోంది సమంత. గతంలో చేసిన ఫ్యామిలీ మ్యాన్ 2 సక్సెస్ కావడంతో.. సిటాడిల్‌కి ఓకే చెప్పింది. ధూతతో పాటు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ ప్రాజెక్ట్ ఇప్పటి రిలీజ్ కాలేదు. దీంతో సమంత వెబ్ సిరీస్‌కి మోక్షం ఎప్పుడు అన్న చర్చ ఇప్పుడు తెరపైకి వచ్చింది. టాలీవుడ్‌లో సమంత, నాగచైతన్య విడాకుల తర్వాత ఎవరి దారిలో వారు బిజీ అయ్యారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 13, 2023 | 02:33 PMLast Updated on: Dec 13, 2023 | 2:33 PM

Are Those Two Settled In Ott After Divorce

సినిమాలతో పాటు వెబ్‌ సిరీస్‌లకు ఓకే చెప్తోంది సమంత. గతంలో చేసిన ఫ్యామిలీ మ్యాన్ 2 సక్సెస్ కావడంతో.. సిటాడిల్‌కి ఓకే చెప్పింది. ధూతతో పాటు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ ప్రాజెక్ట్ ఇప్పటి రిలీజ్ కాలేదు. దీంతో సమంత వెబ్ సిరీస్‌కి మోక్షం ఎప్పుడు అన్న చర్చ ఇప్పుడు తెరపైకి వచ్చింది. టాలీవుడ్‌లో సమంత, నాగచైతన్య విడాకుల తర్వాత ఎవరి దారిలో వారు బిజీ అయ్యారు. ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు వెబ్ సిరీస్‌లకు ఒకే చెప్పారు. కాకతాళీయమో లేక ముందే ప్లాన్ చేస్తున్నారో తెలియదు కానీ.. చైతూ ధూత వెబ్ సిరీస్‌కి ఒకే చెప్తే.. సమంత సిటాడెట్ ప్రాజెక్ట్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

రెండు సిరీస్‌లు ఒకేసారి షూటింగ్ పూర్తి చేసుకున్నాయి. అయితే నాగచైతన్య థూత రీసెంట్‌గా రిలీజై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. భారీ రెస్పాన్స్‌తో ట్రెండింగ్ లో దూసుకుపోతోంది. దీంతో సమంత సిటాడెట్ ఎప్పుడు వస్తుందనే చర్చ మొదలైంది. హాలీవుడ్‌ సిటాడెల్‌కి సూపర్‌ హిట్ టాక్ రావడంతో.. హిందీ వెబ్‌ సిరీస్‌కి డిమాండ్ పెరిగింది. దానికి తగ్గటే ఈ ప్రాజెక్ట్ షూటింగ్‌ని ఎప్పుడో పూర్తి చేసింది సమంత. కానీ రిలీజ్ విషయంలో ఎలాంటి చప్పుడు చేయడం లేదు అమెజాన్‌ ప్రైమ్‌. దీంతో ఈ సిరీస్ నిలిచిపోయిందా.. లేక ఇంకా సమయం తీసుకుంటారా అన్నది సస్పెన్స్‌గా మారింది. ప్రస్తుతానికి సమంత సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. ఆమె ప్రమోషన్స్ కోసం రావాలి కాబట్టి.. సిటాడెల్‌ సిరీస్‌ని వాయిదా వేస్తున్నారేమో అనే చర్చ జరుగుతోంది. మొత్తానికి దూత ఎదురుచూపులకు చైతూ ఫుల్‌స్టాప్‌ పెట్టాడు. మరి సమంత సిటాడెల్‌ వెయిటింగ్‌కి ఎప్పుడు క్లియరెన్స్ దొరకుతుందో చూడాలి.