దేవర, కల్కీకి జరిగిన అవమానాలకు మించి.. మానవత్వమే లేదా..?
పాన్ ఇండియా లెవల్లో తెలుగు హీరోలు దాడి చేస్తున్నారంటే, అక్కడి లోకల్స్ నుంచి ఎంతో కొంత వ్యతిరేకత కామన్. వాళ్ళ ఫ్యాన్స్ నుంచి కూడా నెగెటీవ్ కామెంట్స్ అంతకంటే కామన్. కల్కీ, సలార్, దేవర, పుష్ప2 అన్నీ ఇలాంటి కామెంట్స్ ఫేస్ చేసినవే..
పాన్ ఇండియా లెవల్లో తెలుగు హీరోలు దాడి చేస్తున్నారంటే, అక్కడి లోకల్స్ నుంచి ఎంతో కొంత వ్యతిరేకత కామన్. వాళ్ళ ఫ్యాన్స్ నుంచి కూడా నెగెటీవ్ కామెంట్స్ అంతకంటే కామన్. కల్కీ, సలార్, దేవర, పుష్ప2 అన్నీ ఇలాంటి కామెంట్స్ ఫేస్ చేసినవే.. కాని వాటన్నీంటికంటే కూడా కొండంత అవమానాల బరువుని మోస్తున్నాడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. మొన్నటి వరకు భారతీయుడు 2 ఫ్లాపైంది కాబట్టి, శంకర్ ఎకౌంట్ లో గేమ్ చేంజర్ మరో డిజాస్టర్ అన్నారు. ఇప్పుడు పుష్ప2 ఎపిసోడ్ తో బెనిఫిట్ షోలు, టిక్కెట్ రేట్ల పెంపు ఆగిపోయాయి. సో రేపొద్దున వసూళ్లు తగ్గితే, ఇదో సాకుగా చెబుతారా అంటూ, అలా కూడా ఎటాక్ చేస్తున్నారు. మెగా హీరోల మీద యాంటీ ఫ్యాన్స్ ఎటాక్ కొత్త కాదు, కాని ఇన్ హ్యూమన్ గా మరీ ఇంత ఘోరమైన యాంటీ ప్రచారం మాత్రం ఇదే మొదలు… అదెందుకో? అలా ఎలా అవుతుందో చూసేయండి.
దేవర, కల్కీ, ఇలా పాన్ ఇండియా లెవల్లో దుమ్ముదులిపిన ప్రతీ మూవీకి, కామెంట్లు, ట్రోలింగ్స్ కనిపించాయి. ఇక మీదట కూడా కనిపిస్తాయి… వాటిని తట్టుకుంటూ ఎన్టీఆర్, ప్రభాస్ అండ్ కో దూసుకెళ్లారు. ఇప్పుడు రామ్ చరణ్ వంతొచ్చింది. కాని తన విషయంలో కామెంట్లు, ట్రోలింగ్స్ మానవత్వాన్నే మరిచేలా ఉన్నాయంటున్నారు. అసలు సినిమా రాలేదు, రిజల్ట్ ఎవరికీ తెలియదు…
కాని ఇంతలోనే ఇది ఫ్లాప్ అనంటున్నారు. చరణ్ కెరీర్ లో మొదటి బిగ్గెస్ట్ డిజాస్టర్ అంటున్నారు. అంత కసిగా కామెంట్లు చేయటానికి ఇంకేదో కారణముందా?
మామూలుగానే గేమ్ ఛేంజర్ మీద కొన్ని అనుమానాలున్నాయి. ఎందుకంటే అది డైరెక్టర్ శంకర్ సినిమా కాబట్టి. సీన్లో దిల్ రాజు ఉన్నా, త్రిబుల్ ఆర్ తో చరణ్ గ్లోబల్ స్టార్ అయినా, శంకర్ డైరెక్షన్ మీదే జనాలకు, మార్కెట్ లో పండితులకు సవా లక్ష అనుమానాలున్నాయి. కారణం శంకర్ ఆస్తాన రైటర్ అయిన సుజాత మరణం తర్వాత, తనకి సరైన కథలు లేక తికమకపడ్డాడన్నారు
ఐ, నబ్న్, రోబో2.0 ఇలా వరుసగా ఫ్లాపులు ఫేస్ చేశాడు. ఇక భారతీయుడు 2 అయితే శంకర్ కెరీర్ లోనే
అత్యంత చత్త సినిమాగా మచ్చ గా మారింది. దాని దెబ్బకే ఆతర్వాత రాబోతున్న గేమ్ ఛేంజర్ రిజల్ట్ రివర్స్ అవుతుందేమో అని, వాయిదా వేస్తూ వచ్చారు. సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నారు.. ఇదంతా సినీజనాలకే కాదు, సినిమాలు ఫాలో అయ్యే ఆడియన్స్ కి ఐడియా ఉంది..
ఎటొచ్చి, నెగెటీవ్ టాక్ ని పాజిటివ్ వేవ్ గా మార్చాలనుకుంటున్న గేమ్ ఛేంజర్ టీం కి, అతి ఘోరమైన కామెంట్లు మాత్రం షాక్ ఇస్తున్నాయి. గేమ్ ఛేంజర్ మీద ఎన్ని అనుమానాలు ఉన్నా, సినిమా రిలీజ్ అయ్యే వరకు రిజల్ట్ ఎవరూ ఊహించలేరు. కొన్ని సార్లు బ్లాక్ బస్టర్ అనుకున్న మూవీలు రిలీజయ్యాక ప్లాప్ అయ్యాయి. ఫ్లాప్ అవుతాయనుకున్న మూవీలు బ్లాక్ బస్టర్లయ్యాయి. కాబట్టి ఆఖరి నిమిషంలో ఏదైనా జరగొచ్చు
అలాంటిది పుష్ప2 ఇన్స్ డెంట్ తర్వాత గేమ్ ఛేంజర్ ని ఓరేంజ్ లో సోషల్ మీడియాలో ఆడుకుంటుంటే, ఇది యాంటీ మెగా ఫ్యాన్స్ పని కాదు… అల్లు ఆర్మీ పనంటూ ఓ వైపు కామెంట్లు పెరిగాయి. ఏది క్లియర్ గా ఇదే నిజం అని చెప్పే పరిస్థితులుండవు… సోషల్ మీడియాల సగానికి పైనా పోస్ట్ లకు అడ్రస్ లుండవు… అందుకే ఆ ధైర్యంతోనే గేమ్ ఛేంజర్ మీద కామెంట్స్, ట్రోలింగ్స్ మామూలు స్థాయి కంటే ఎక్కువే వస్తుండటంతో ఎవరేం చేయలేకపోతున్నారనే మాటలు వినిపిస్తున్నాయి. ఐతే ఎన్నైనా కామెంట్లు, ట్రోలింగ్స్ చేసినా, యాంటీ ఫ్యాన్స్ పని అనుకోవచ్చు కాని, కామెంట్లు, ట్రోలింగ్స్ ని మించేలా గేమ్ ఛేంజర్ ని డ్యామేజ్ చేసే కార్యక్రమాలు జరుగుతున్నాయనంటున్నారు. చరణ్ కెరీర్ మొత్తంలో ఇంతఘోరంగా ఎన్నడూ ట్రోలింగ్స్ కి గురైన సందర్భాలు లేవనేస్తున్నారు.