Project K Movie: ప్రాజెక్టు K టీం కావాలని చేసిన తప్పులు.. కొత్త ట్విస్ట్.. !
ప్రాజెక్ట్ కే గ్లింప్స్ పేలింది. వైరైలైంది. ఫ్యాన్స్ లో సందడి పెరిగింది. అంతా బానే ఉంది. కాని డైరెక్టర్ నాగ్ అశ్విన్ అండ్ కో చేసిన తప్పు మీదే ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఆ తప్పులో ఒకటి ఈ మూవీ ఒకభాగమా? రెండు భాగాలా తేల్చకపోవటం.

Are you making a mistake by not telling how many parts of Prabhas's Project K movie is being made
నిజానికి ఈ సినిమా నిర్మాత అశ్వినీ దత్, ఇది రెండు భాగాలుగా వచ్చే మూవీ అని ఓ ఇంటర్వూలో ఎప్పుడో తేల్చాడు. కాని గ్లింప్స్ లో ఎక్కడా ఛాప్టర్ వన్ అనో మొదటి భాగం అనో, ఇలా ఏ హింట్ ఇవ్వలేదు. అదేదో సీక్వెల్ లేనట్టు గ్లింప్స్ ని వదిలారు.
దీనికి తోడు రిలీజ్ ఇయర్ తప్ప రిలీజ్ డేట్ తేల్చలేదు. అంటే రెండు భాగాలైతే, జనవరి 12న మొదటి భాగం, ఏడాది తర్వాత రెండో భాగమని, అదే టూ పార్ట్స్ గా స్ల్పిట్ చేయటం కుదరకపోతే, మొత్తం ఒకే మూవీగా మార్చి, సమ్మర్ కి రిలీజ్ చేస్తారట. అందుకే అటు ఫస్ట్ పార్ట్ అనో, లేదంటే రిలీజ్ డేట్ ఇదనో తేల్చలేదు. ఇది ఫిల్మ్ టీం కావాలని చేసిన మిస్టేక్,అలా కూడా ఈమూవీకి ప్రచారం దక్కుతోంది.