వైష్ణవి చైతన్య కెరీర్ తో ఆడుకుంటున్నారా.. ఎవరు బ్యాడ్ చేయాలని చూస్తున్నారు..?

ఇండస్ట్రీలో ఎవరికైనా ఎప్పుడు ఎలా టర్న్ తీసుకుంటుందో చెప్పడం కష్టం. కావాలంటే వైష్ణవి చైతన్యను తీసుకోండి. యూట్యూబ్ వీడియోలు, కవర్ సాంగ్స్ చేసుకునే అమ్మాయి ఇప్పుడు హీరోయిన్ అయిపోయింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 10, 2025 | 06:08 PMLast Updated on: Apr 10, 2025 | 6:08 PM

Are You Playing With Vaishnavi Chaitanyas Career Who Is Trying To Make Her Bad

ఇండస్ట్రీలో ఎవరికైనా ఎప్పుడు ఎలా టర్న్ తీసుకుంటుందో చెప్పడం కష్టం. కావాలంటే వైష్ణవి చైతన్యను తీసుకోండి. యూట్యూబ్ వీడియోలు, కవర్ సాంగ్స్ చేసుకునే అమ్మాయి ఇప్పుడు హీరోయిన్ అయిపోయింది. మొదటి సినిమాతోనే సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అందుకొని బెస్ట్ యాక్టర్ అవార్డు కూడా అందుకుంది వైష్ణవి చైతన్య. అసలు ఈమె హీరోయిన్ మెటీరియల్ కాదు అన్నవాళ్ళతో కూడా అద్భుతంగా చేస్తుంది అమ్మాయి అని ప్రశంసలు అందుకుంటుంది. చాలా రోజుల తర్వాత ఇండస్ట్రీలో ఒక తెలుగు అమ్మాయికి మంచి ఆఫర్స్ వస్తున్నాయి. కాకపోతే ఎప్పటిలాగే స్టార్ హీరోలు ఈమె వైపు అసలు చూడడం లేదు. కేవలం మీడియం రేంజ్ హీరోలు మాత్రమే వైష్ణవితో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. బేబీ తర్వాత ఈమె నటించిన లవ్ మీ డిజాస్టర్ అయ్యింది. ప్రస్తుతం సిద్దు జొన్నలగడ్డతో జాక్ సినిమా చేసింది వైష్ణవి చైతన్య. ఈ సినిమా మీద ఈమె కెరీర్ ఆధారపడి ఉంది. జాక్ హిట్ అయింది అంటే అమ్మడు వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం లేదు.

కనీసం మరో మూడు నాలుగు ఆఫర్లు వస్తాయి. ఒకవేళ ఈ సినిమా ఏదైనా తేడా కొట్టింది అంటే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ వైష్ణవి చైతన్యకు తిప్పలు తప్పవు. ఈ సినిమా తర్వాత మరో రెండు ప్రాజెక్ట్స్ ఈమె చేతిలో ఉన్నాయి. అందులో ఒకటి సితార ఎంటర్టైన్మెంట్స్ తో పని చేయబోతుంది వైష్ణవి చైతన్య. ఎందుకో తెలియదు కానీ ఈ ముద్దుగుమ్మకు వరుసగా బ్యాడ్ క్యారెక్టర్స్ రాస్తున్నారు డైరెక్టర్స్. బేబీ సినిమాలో ప్రేమించిన వాడిని మోసం చేసే పాత్రలో నటించింది ఈ భామ. అందులో ఆమె క్యారెక్టర్ చూసి చాలామంది కుర్రాళ్ళు తిట్టుకున్నారు కూడా. ఇలాంటి అమ్మాయి తమ లైఫ్ లోకి వస్తే జీవితం నాశనం అంటూ కామెంట్ కూడా చేశారు. అంటే ఈ పాత్రలో ఆమె అంత అద్భుతంగా నటించింది అని అర్థం. లవ్ మీ సినిమాలో కూడా అన్నయ్యను ప్రేమించి తమ్ముడుతో లవ్ ట్రాక్ నడిపే క్యారెక్టర్. కారణం తెలియదు కానీ వరుసగా అలాంటి పాత్రలు చేయడం వల్ల.. తెలియకుండానే వైష్ణవిపై ఒక రకమైన ముద్ర పడిపోతుంది.

ఇప్పుడు జాక్ సినిమాలో కూడా కథను మలుపు తిప్పే పాత్రలో నటించింది. ఇక దీని తర్వాత సితార ఎంటర్టైన్మెంట్స్ లో చేయబోయే సినిమాలో ఈమె పాత్ర చాలా బ్యాడ్ గా ఉంటుందని చెప్పాడు నిర్మాత నాగ వంశీ. జాక్ సినిమాలోనే ఆమెను పద్ధతిగా చూడండి.. మా సినిమాలో బూతులు మాట్లాడుతుంది.. చాలా బోల్డ్ క్యారెక్టర్ చేస్తుంది అటు బోలెడు విషయాలు చెప్పాడు వంశీ. ఈయన చెప్పిన తీరు చూస్తుంటే వైష్ణవి చైతన్య చాలా వెరైటీ క్యారెక్టర్ ఒప్పుకుంది అనే విషయం అర్థం అవుతుంది. అది క్లిక్ అయితే ఓకే.. లేదంటే మాత్రం ఆ ప్రభావం కెరీర్ మీద పడే అవకాశం లేకపోలేదు. ఎలా చూసుకున్న కూడా ఈ తెలుగు అమ్మాయిని బ్యాడ్ చేయాలని ఫిక్స్ అయిపోయాడు నాగ వంశీ. మరి ఈయన చేయబోయే క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది అని ఆసక్తి ఇప్పటినుంచే ప్రేక్షకుల్లో మొదలైంది.