ARJUN KAPOOR: 38 లవ్స్ 50.. ప్రేమకు వయసుతో పనిలేదు.. ట్రోలింగ్‌పై అర్జున్
సోషల్ మీడియాలో ఎప్పుడూ ట్రోలింగ్ బారిన పడేవారిలో హీరో అర్జున్ కపూర్ ఒకరు. ఈయన వయసు 38 ఏళ్లు. ఇంకా పెళ్లి చేసుకోలేదు. ఇతడికో ప్రియురాలు ఉంది. ఆవిడే ఐటం సాంగ్ డ్యాన్సర్, బాలీవుడ్ నటి మలైకా అరోరా. ఈమె వయసు 50.

ARJUN KAPOOR: సెలబ్రిటీలను ఇష్టపడేవాళ్లుంటారు.. ఉత్తి పుణ్యానికే వాళ్లపై విమర్శలు గుప్పించేవాళ్లూ ఉంటారు. వారు ఏదైనా ఫోటో షేర్ చేసినా, బయటకు వెళ్లినా, ఖరీదైన వస్తువులు కొన్నా, బ్రాండెడ్ అండ్ వెరైటీ డ్రెస్సులు వేసుకున్నా, ఎవరినైనా ప్రేమించినా, ప్రియురాలికి బ్రేకప్ చెప్పినా, భార్యకు విడాకులిచ్చినా.. ఏం చేసినా సరే తిట్లదండకం అందుకోవడానికి రెడీగా ఉంటారు కొందరు. అలా సోషల్ మీడియాలో ఎప్పుడూ ట్రోలింగ్ బారిన పడేవారిలో హీరో అర్జున్ కపూర్ ఒకరు.
SALAAR: జస్ట్ మిస్.. ‘సలార్‘లో వరద పాత్ర గోపీచంద్ చేసి ఉంటేనా..
ఈయన వయసు 38 ఏళ్లు. ఇంకా పెళ్లి చేసుకోలేదు. ఇతడికో ప్రియురాలు ఉంది. ఆవిడే ఐటం సాంగ్ డ్యాన్సర్, బాలీవుడ్ నటి మలైకా అరోరా. ఈమె వయసు 50. గతంలో సల్మాన్ ఖాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్‌ను పెళ్లి చేసుకోగా వీరికి ఒక బాబు జన్మించాడు. కానీ, భార్యాభర్తల మధ్య పొరపచ్చాలు రావడంతో 2017లో విడాకులు తీసుకున్నారు. అప్పటినుంచి అర్జున్ కపూర్‌కు మరింత దగ్గరైంది మలైకా. నీకంటే 12 ఏళ్లు పెద్ద.. అలాంటి ఆంటీతో లవ్వేంటి..? అని నెటిజన్లు తరచూ సూటిపోటి మాటలతో అర్జున్‌ను వేధిస్తూనే ఉన్నారు. తాజాగా హాట్‌స్టార్‌లో ప్రసారమవుతున్న కాఫీ విత్ కరణ్ 8వ సీజన్‌లో పాల్గొన్న అర్జున్ ఈ ట్రోలింగ్‌పై స్పందించాడు. ‘ట్రోలింగ్ వల్ల ఎప్పుడో ఒకసారైనా బాధపడని వ్యక్తి అంటూ ఎవరూ ఉండరు.
కానీ దాన్ని ఎలా డీల్ చేస్తామనేది ముఖ్యం. ఈ ట్రోలింగ్ వల్ల.. తప్పుడు కామెంట్లు చేసేవారి పద్ధతులు, వక్రబుద్ధి బయటపడుతుంది. మొదట్లో నేను కూడా వారి కామెంట్లకు స్పందించాలనుకున్నాను. కానీ వారికి నేను అటెన్షన్ ఇవ్వడమేంటని తర్వాత లైట్ తీసుకున్నాను. లైకుల కోసం ఇలాంటి చిల్లరపనులు చేస్తుంటారు. మళ్లీ ఇలాంటివారే మనం కనిపించగానే సెల్ఫీల కోసం ఎగబడుతారు’ అని అర్జున్ కపూర్ చెప్పుకొచ్చాడు.