Vijay Devarakonda: అర్జున్ రెడ్డి కాంబినేషన్ కి ఛాన్స్ లేదా.. విజయ్ కి టచ్ లో సందీప్ రెడ్డి..

అర్జున్ రెడ్డి తో రౌడీ స్టార్ దేశ వ్యాప్తంగా ఫోకస్ అయ్యాడు. సందీప్ రెడ్డి అయితే ట్రెండ్ సెట్టర్ అయ్యాడు. కాని ఈ కాంబినేషన్ ఇంతవరకు రిపీట్ కాలేదు. సందీప్ ఇదే మూవీని హిందీలో రీమేక్ చేశాడు హిట్ పట్టాడు. తర్వాత యానిమల్ అంటూ రణ్ బీర్ కపూర్ తో మూవీ తీస్తున్నాడు. తర్వాత ప్రభాస్ తో స్పిరిట్, వెంటనే బన్నీతో మరో మూవీ ప్లాన్ చేసుకున్నాడు. కాని విజయ్ వైపు మాత్రం చూడట్లేదు.. ఎందుకు? అక్కడే ట్విస్ట్ ఉంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: May 23, 2023 | 04:46 PMLast Updated on: May 23, 2023 | 4:46 PM

Arjun Reddy Combination Movie Delay

విజయ్ దేవరకొండ కూడా అర్జున్ రెడ్డి హిట్ తర్వాత టాక్సీవాలా, గీత గోవిందం లాంటి బ్లాక్ బస్టర్లతో బానే దూసుకెళ్లాడు. లైగర్ పంచ్ తో డీలాపడ్డాడు. ఏదో ఖుషీ అది, ఇది అని ప్రయోగాలు చేస్తున్నాడు కాని, తన స్టామినాకు పడాల్సిన కథ పడట్లేదు. అదే మరోసారి సందీప్ రెడ్డి వంగ మేకింగ్ లో కాంబినేషన్ రిపీట్ అయితే సీనే మారిపోతుంది.

కాని అర్జున్ రెడ్డి టైంలో రౌడీ స్టార్ కి సందీప్ 12 లక్షలే రెమ్యునరేషన్ ఇచ్చాడట. సినిమా అంత హిట్టైనా పిలిచి కోటి ఇస్తాడనుకుంటే, మరో 13 లక్షలు చేతిలో పెట్టాడట. అలా ఇద్దరి మధ్య గ్యాప్ పెరిగిందనే ప్రచారం జరిగింది. ఏదేమైనా మళ్లీ ఇద్దరు అక్కడా ఇక్కడ మాట్లాడుకున్నా, కాంబినేషన్ మాత్రం రిపీట్ కావట్లేదు. విచిత్రం ఏంటంటే ఈమధ్యే బన్నీకి కథ చెప్పినప్పుడు విజయ్ కి కూడా ఓస్టోరీ లైన్ చెప్పాడట సందీప్ రెడ్డి.. ఈ విషయం బయటకి పొక్కగానే కనీసం ఇప్పుడైనా ఈ కాంబినేషన్ రిపీట్ అయితే, అర్జున్ రెడ్డికి మించి మరో మూవీ సెట్ అయినట్టే అంటున్నారు.