Arjun Reddy: అర్జున్ రెడ్డి కాంబో కోసం ప్రయత్నిస్తున్న మైత్రీ మూవీ మేకర్స్
నిజానికి లైగర్ ఫ్లాప్ తర్వాత డీలా పడ్డ విజయ్ తో సందీప్ రెడ్డి సినిమా తీస్తే ఎలా ఉంటుందనే కోణంలో మైత్రీ మూవీమేకర్స్ టీం ప్రయత్నించిందట.

Arjun Reddy: విజయ్ దేవరకొండని మరోసారి అర్జున్ రెడ్డి రేంజులో చూస్తే ఎలా ఉంటుంది. చరిత్ర పునరావృతం అవ్వాల్సిందే. అదే జరిగేలా ఉంది. మైత్రీ మూవీ మేకర్స్ ఏడాదిగా ఈ కాంబినేషన్ రిపీట్ అవ్వటానికి చాలా గట్టిగా ట్రై చేస్తోందట. తమ సంస్థలో అర్జున్ రెడ్డి రేంజ్ మూవీ పడాలని కోరుకుంటున్నారట.
నిజానికి లైగర్ ఫ్లాప్ తర్వాత డీలా పడ్డ విజయ్ తో సందీప్ రెడ్డి సినిమా తీస్తే ఎలా ఉంటుందనే కోణంలో మైత్రీ మూవీమేకర్స్ టీం ప్రయత్నించిందట. కాని గతంలో ఇచ్చిన కమిట్ మెంట్ వల్ల యానిమల్ మూవీ పూర్తి చేస్తున్నాడు సందీప్ రెడ్డి. కాకపోతే స్పిరిట్ కంటే ముందే విజయ్ తో సందీప్ సినిమా సెట్స్పైకి తీసుకెళ్లాలనుకున్న మైత్రీ మూవీ మేకర్స్ టీం ఆలోచన తర్వాత హోల్డ్ లో పెట్టాడట సందీప్ రెడ్డి. కారణం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నుంచి ఆఫర్ రావటం.
అలా అటు బన్నీ, ఇటు ప్రభాస్ మూవీస్ తో సందీప్ రెడ్డి వంగ 2 ఏళ్లు బిజీ అయ్యేలా ఉన్నాడు. ఆ తర్వాతే రౌడీ స్టార్ తో సినిమా తీస్తాడని తెలుస్తోంది. ఈ విషయంలో విజయ్ దేవరకొండ నుంచి ఎప్పుడో గ్రీన్ సిగ్నల్ వచ్చినా ఇంకా సందీప్ రెడ్డి వంగనే ఎటూ తేల్చలేదట.