చిరంజీవితో అర్జున్ రెడ్డి జస్ట్ మిస్.. అప్పుడు చేసుంటే ఇప్పుడు సందీప్ వంగా ఉండేవాడా..?

ఏంటి.. అర్జున్ రెడ్డిగా చిరంజీవా..! పైగా జస్ట్ మిస్ అయ్యాడా..? అసలు చిరంజీవితో అర్జున్ రెడ్డి సినిమా ఏంటి.. మీకేమైనా పిచ్చి ప‌ట్టిందా అనుకుంటున్నారా..? అప్పుడప్పుడు కొన్ని నమ్మడానికి కష్టంగానే ఉంటాయి..

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 13, 2025 | 03:55 PMLast Updated on: Mar 13, 2025 | 3:55 PM

Arjun Reddy With Chiranjeevi Just Missed If It Had Been Done Then Would Sandeep Vanga Have Been There Now

ఏంటి.. అర్జున్ రెడ్డిగా చిరంజీవా..! పైగా జస్ట్ మిస్ అయ్యాడా..? అసలు చిరంజీవితో అర్జున్ రెడ్డి సినిమా ఏంటి.. మీకేమైనా పిచ్చి ప‌ట్టిందా అనుకుంటున్నారా..? అప్పుడప్పుడు కొన్ని నమ్మడానికి కష్టంగానే ఉంటాయి.. కానీ నమ్మక తప్పదు. మీరు ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా చిరంజీవి అర్జున్ రెడ్డి లాంటి సినిమాను మిస్ అయ్యాడు అనేది నిజం. ఒకవేళ ఆరోజు ఆ సినిమా చేసి ఉంటే ఈరోజు అర్జున్ రెడ్డి గురించి ఇంత చర్చ జరిగి ఉండేది కాదేమో..? 90స్ లోనే చిరంజీవితో ఒక రా అండ్ రస్టిక్ సినిమా ప్లాన్ చేశాడు ఒక దర్శకుడు. అది గానీ అప్పుడు వర్కౌట్ అయి ఉంటే ఇండస్ట్రీ రికార్డుల్లో ఒకటి కూడా మిగిలేది కాదేమో. అస‌లు చిరంజీవి అర్జున్ రెడ్డి పాత్ర‌లో ఎలా ఊహించుకుంటారు సామీ.. అదెలా సాధ్యం అనుకుంటున్నారా..?

ఇదిప్పుడు జ‌రిగిన క‌థ కాదు.. కొన్నేళ్ల కింద జ‌రిగిన క‌థ‌. అప్ప‌ట్లో చిరంజీవి కెరీర్ పీక్స్ చూస్తున్న‌పుడు క‌న్న‌డ ద‌ర్శ‌కుడు, న‌టుడు ఉపేంద్ర ఓ క‌థ మెగాస్టార్ కోసం సిద్ధం చేసాడు. 90ల్లో సంచ‌ల‌న సినిమాలు తెర‌కెక్కించాడు ఉపేంద్ర‌. అప్పటికే కన్నడలో ఈయన తెరకెక్కించిన సినిమాలు రికార్డుల దుమ్ము దులుపుతున్నాయి. ఉపేంద్ర కెరీర్ గ్రాఫ్ చూసి చిరు కూడా ఈయ‌న‌తో ఓ సినిమా చేయాల‌ని అప్ప‌ట్లో ముచ్చ‌ట పడ్డాడు. అశ్వినీ దత్ నిర్మాణంలో ఈ చిత్రం చేయాలనుకున్నారు కూడా. ఆ మధ్య ఓ ఇంటర్వ్యూకి వచ్చిన ఉపేంద్ర‌.. ఈ ఇంట్రెస్టింగ్ విష‌యం చెప్పాడు. అప్పుడు కానీ ఆ సినిమా పట్టాలెక్కి ఉంటే మరోలా ఉండేదన్నాడు ఈ దర్శకుడు కమ్ నటుడు. ఇదే వేడుకలో ఉపేంద్ర దగ్గర అప్పట్లో అసిస్టెంటుగా పని చేసిన వైవిఎస్ చౌదరి కూడా ఉన్నాడు.

ఇక్క‌డే ఈ సంచ‌ల‌న విష‌యం బ‌య‌ట పెట్టాడు చౌద‌రి. 90ల్లో చిరంజీవి కోసం అర్జున్ రెడ్డి కంటే ప‌వ‌ర్ ఫుల్ స్క్రిప్ట్ ఉపేంద్ర సిద్ధం చేసాడని.. అన్నీ అనుకుని సినిమా కుదిరే స‌మ‌యానికి అనివార్య కార‌ణాల‌తో ఆగిపోయింద‌ని చెప్పాడు వైవిఎస్. ఒక‌వేళ అప్పుడు కానీ ఆ సినిమా ప‌ట్టాలెక్కి ఉంటే ఇప్పుడు అర్జున్ రెడ్డి గురించి ఇంత‌గా మాట్లాడేవారు కాదేమో అంటున్నాడు వైవిఎస్. మ‌రి ఈ లెక్క‌న అప్ప‌ట్లో చిరంజీవి కోసం ఈయ‌న ఇంకెంత ప‌వ‌ర్ ఫుల్ క‌థ సిద్ధం చేసి ఉంటాడో అని మెగాభిమానులు ఆలోచిస్తున్నారు. మరి ఆ సినిమాను మిస్ చేసుకుని చిరంజీవి ఎంత మిస్ అయిపోయాడో అంటున్నారు ఫ్యాన్స్. ఓంకారం, ఏ, రా, ఉపేంద్ర‌ లాంటి సినిమాల‌తో తెలుగులో కూడా త‌న‌కంటూ ప్ర‌త్యేకంగా గుర్తింపు సంపాదించుకున్నాడు ఉపేంద్ర.