Pawan Kalyan: ఏకంగా పవన్ కళ్యాణ్ తో.. పెట్టుకుంటున్న డైరెక్టర్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఎవరూ అంత ఈజీ పెట్టుకోరు. ఆ ఇమేజ్, ఫ్యాన్స్ లో ఆక్రేజ్ అలాంటిది. ఇంత తెలిసినా అర్జున్ రెడ్డి డైరెక్టర్ పని కట్టుకుని కయ్యానికి కాలుదువ్వుతున్నాడు. బేసిగ్గానే తను మెగా హీరోలకు అభిమాని, కాని టైం బ్యాడైతే ఎవరేం చేస్తారు.?

Pawan Kalyan Movie With Creazy Director
సందీప్ రెడ్డి వంగ నిజానికి రామ్ గోపాల్ వర్మ కంటే కూడా మెంటల్ అంటారు. అర్జున్ రెడ్డి మూవీ కథ నిజానికి తన ఒరిజినల్ స్టోరీనే అనే ప్రచారం కూడా ఉంది. కొన్ని సీన్లు తన లైఫ్ ని ప్రేరణగానే తీసుకుని తీశానని కూడా సందీప్ ఎన్నో సార్లు చెప్పాడు. ఈ ఉపోధ్ధాతమంతా ఎందుకంటే, ఈ డైరెక్టర్ ఇప్పుడు ఏకంగా పవర్ స్టార్ తోనే కయ్యానికి కాలుదువ్వుతున్నాడు.
బేసిగ్గానే మెగా హీరోలకి ముఖ్యంగా చిరుకి సందీప్ రెడ్డి మంచి అభిమాని. పవన్ అంటే కూడా ఎంతో ఇష్టం. అయినా పవర్ స్టార్ తో పెట్టుకుంటున్నాడు. కారణం తన పాన్ ఇండియా మూవీ యానిమలే.. ఈ సినిమా ఇప్పుడు పవన్ మూవీతో వార్ కి డోర్ తీస్తోంది. క్రిస్మస్ కి వార్ వన్ సైడ్ కాదు టూ సైడ్ అనే మాటే వినిపిస్తోంది
అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ తర్వాత సందీప్ తీసిన మూవీ యానిమల్. ఈ హిందీ మూవీ ఆగస్ట్ 11న రావాలి. కాని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లేటవుతుండటంతో, క్రిస్మస్ కి వాయిదా వేశారు. అప్పుడే సుజీత్ మేకింగ్ లో పవన్ చేస్తున్న ఓజీ రిలీజ్ కాబోతోంది. సో పవన్ తో పోటీ వద్దని పుష్ప 2నే వాయిదా వేస్తుంటే, సందీప్ రెడ్డి మాత్రం తన యానిమల్ ని క్రిస్మస్ కే రంగంలోకి దింపుతున్నాడు. ఇక్కడే సందీప్ తప్పు చేస్తున్నాడనే కామెంట్లు పెరిగాయి. బాలీవుడ్ సంగతేమోకాని, అక్కడి కంటే ఎక్కువ మార్కెట్ ఉన్న టాలీవుడ్ లో ఇలా రిస్క్ చేస్తే వసూళ్ల పంచ్ తప్పదంటున్నారు.