అర్జున్ S/O వైజయంతి.. పాత జ్ఞాపకాల్లోకి వెళ్లిపోయిన కళ్యాణ్ రామ్, విజయశాంతి..!

డెవిల్ సినిమా తర్వాత తెలియకుండానే భారీ గ్యాప్ తీసుకున్నాడు కళ్యాణ్ రామ్. వరుస ప్రాజెక్టులకు కమిట్ అవుతున్నాడు కానీ అవి విడుదల కావడానికి మాత్రం చాలా టైం పడుతుంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 10, 2025 | 12:55 PMLast Updated on: Mar 10, 2025 | 12:55 PM

Arjun S O Vyjayanthi Kalyan Ram Vijayashanti Who Have Gone Back To Old Memories

డెవిల్ సినిమా తర్వాత తెలియకుండానే భారీ గ్యాప్ తీసుకున్నాడు కళ్యాణ్ రామ్. వరుస ప్రాజెక్టులకు కమిట్ అవుతున్నాడు కానీ అవి విడుదల కావడానికి మాత్రం చాలా టైం పడుతుంది. ప్రస్తుతం కళ్యాణ్ రామ్ ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఇందులో విజయశాంతి కూడా కీలకపాత్రలో నటిస్తుంది. సరిలేరు నీకెవరు సినిమాతో దాదాపు 20 ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన విజయశాంతి.. ఇప్పుడు కళ్యాణ్ రామ్ సినిమాలో తనకు బాగా అచ్చొచ్చిన పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తుంది.

నిజానికి మహేష్ బాబు కోసమే సరిలేరు నీకెవరు సినిమా చేశానని చెప్పింది విజయశాంతి. అయితే అందులో ఆమె పాత్రకు పెద్దగా రెస్పాన్స్ రాలేదు.. 20 సంవత్సరాల తర్వాత విజయశాంతి లాంటి యాక్టర్ రియంట్రీ ఇస్తున్నారు అంటే ఎంతో ఊహించుకున్నారు ఆడియన్స్. కానీ రొటీన్ గా ఉండడంతో ప్రేక్షకులపై ఈ పాత్ర పెద్దగా ఇంపాక్ట్ చూపించలేదు. దాంతో ఇక మీద నేను సినిమాలు చేయను రాజకీయాల్లోనే ఉంటాను అంటే చెప్పుకొచ్చారు విజయశాంతి. కానీ ప్రదీప్ చిలుకూరు చెప్పిన కథ నచ్చడంతో కళ్యాణ్ రామ్ సినిమాలో నటిస్తుంది ఈమె. ఇందులో చాలా పవర్ఫుల్ పాత్ర చేస్తుంది విజయశాంతి. ఆమె క్యారెక్టర్ పేరు వైజయంతి.. మిలీనియం మొదట్లో వైజయంతి ఐపీఎస్ అనే సినిమా చేసింది విజయశాంతి. అప్పట్లో ఈ సినిమా సంచలన విజయం సాధించింది.

ఆ పేరు కలిసి రావడంతో ఇప్పుడు కళ్యాణ్ రామ్ సినిమాకు కూడా అదే టైటిల్ పెట్టారు. అర్జున్ సన్నాఫ్ వైజయంతి అనే టైటిల్ కన్ఫర్మ్ చేశారు ఈ సినిమాకు. తాజాగా విడుదలైన ఈ టైటిల్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ సినిమాలో సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తుంది. త్వరలోనే ఈ సినిమా విడుదల కానుంది. కచ్చితంగా ఈ సినిమాతో మరోసారి హిట్ కొడతాను అని నమ్మకంగా చెబుతున్నాడు కళ్యాణ్ రామ్. అప్పుడెప్పుడో కెరీర్ మొదట్లో అతనొక్కడే.. ఆ తర్వాత పదేళ్లకు పటాస్.. అదొచ్చిన ఏడేళ్లకు బింబిసార సినిమాలతో బ్లాక్ బస్టర్ కొట్టాడు కళ్యాణ్. ఈ మూడు తప్ప ఈయన కెరీర్ లో చెప్పుకోదగ్గ సినిమాలు లేవు. ప్రస్తుతం అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమా మీద భారీ ఆశలు పెట్టుకున్నాడు కళ్యాణ్ రామ్. మరి ఈ సినిమాతో ఆయన ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి.