అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ రివ్యూ.. జనతా గ్యారేజ్ 2.0.. కళ్యాణ్ రామ్ ఏంటి ఇలా చేశాడు..?
నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కీలక పాత్రలో ప్రదీప్ చిలుకూరి తెరకెక్కించిన సినిమా అర్జున్ సన్నాఫ్ వైజయంతి.

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కీలక పాత్రలో ప్రదీప్ చిలుకూరి తెరకెక్కించిన సినిమా అర్జున్ సన్నాఫ్ వైజయంతి. ఈ సినిమా గురించి చాలా హైట్ ఇచ్చారు దర్శక నిర్మాతలు. మరి సినిమా నిజంగానే ఆ అంచనాలు అందుకుందా లేదా అనేది పూర్తి రివ్యూలో చూద్దాం..
కథ విషయానికి వస్తే.. కళ్యాణ్ రామ్ వైజాగ్ సిటీ మొత్తాన్ని తన తను సైగలతో శాసిస్తూ ఉంటాడు. చివరికి పోలీసులు కూడా ఆయన అడ్డాలోకి అడుగు కూడా పెట్టలేరు. కట్ చేస్తే విజయశాంతి సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. తన కళ్ళ ముందు చిన్న అన్యాయం జరిగినా కూడా వాళ్లకు శిక్ష పడేదాకా ఊరుకోదు. అలాంటిది ఆమె ప్రాణానికి ప్రాణంగా పెంచుకున్న కొడుకే క్రిమినల్ గా మారుతాడు. వైజాగ్ సిటీ లో క్రైమ్ చేసేవాళ్లను ఏరిపారేస్తూ ఉంటాడు. ఇలాంటి వాళ్ళ జీవితంలోకి మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ సోహెల్ ఖాన్ ఎంటర్ అవుతాడు. ఆయన వచ్చిన తర్వాత కథ చాలా మలుపులు జరుగుతుంది. అసలు కళ్యాణ్ రామ్, విజయశాంతికి సోహెల్ ఖాన్ తో ఉన్న సంబంధం ఏంటి..? వీళ్ళ మధ్యలో శ్రీకాంత్, సాయి మంజ్రేకర్ క్యారెక్టర్స్ ఏంటి.. వాళ్లు ఏం చేస్తుంటారు అనేది మిగిలిన కథ..
స్క్రీన్ ప్లే విషయానికి వస్తే.. ఎన్నో సంవత్సరాల నుంచి చూస్తున్న టెంప్లెట్ మాస్ కమర్షియల్ సినిమా కథ ఇది. టైటిల్ కార్డు పడినప్పుడే ఎండ్ కార్డ్ ఇలా ఉంటుంది అని ఊహించే రొటీన్ కదా. అలాగని మరి తీసి పారేసే సినిమా కాదు. మదర్ సెంటిమెంట్ తో సాగే ప్రాపర్ మాస్ కమర్షియల్ సినిమా. మాస్ ఆడియన్స్ కు యూనియన్ కావాలో లెక్కలు వేసి మరీ కొలతల్లో ఈ సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు ప్రదీప్ చిలుకూరి. ఇందులో చాలా వరకు సక్సెస్ అయ్యాడు. విజయశాంతి కోసం ఒక ఇంట్రడక్షన్ ఫైట్.. హీరో కోసం ఒక ఇంట్రడక్షన్ ఫైట్.. విలన్ కోసం ఒక ఇంట్రడక్షన్ ఫైట్.. ఇలా వీళ్ళ ఇంట్రోస్ కోసమే దాదాపు అరగంట సినిమా అయిపోతుంది. ఫస్ట్ ఆఫ్ అంతా వేగంగా వెళుతుంది.
ప్రతి పది నిమిషాలకు ఒక యాక్షన్ సన్నివేశం కచ్చితంగా వచ్చేలా ప్లాన్ చేసుకున్నాడు దర్శకుడు. దానికోసం మంచి ఎమోషనల్ సీక్వెన్స్ లు కూడా రాసుకున్నాడు. ముఖ్యంగా కళ్యాణ్ రామ్, విజయశాంతి మధ్య వచ్చే సన్నివేశాలు బాగున్నాయి. మదర్ సెంటిమెంట్ సీన్స్ అన్నీ బాగానే వర్కౌట్ అయ్యాయి. సెకండ్ హాఫ్ మాత్రం కొన్ని డల్ మూమెంట్స్ ఉన్నాయి. క్లైమాక్స్ వరకు పడుతూ లేస్తూ ముందుకు వెళుతుంది సినిమా. చివరి 20 నిమిషాలు మాత్రం కాస్త కొత్తగా ట్రై చేశాడు దర్శకుడు. ముందు నుంచి కూడా చిత్ర యూనిట్ క్లైమాక్స్ గురించి బాగా హైట్ ఇస్తూ వచ్చారు.. వాళ్లు చెప్పినంత రేంజ్ లో లేకపోయినా కూడా ఇచ్చిన ట్విస్ట్ మాత్రం బాగానే ఉంది. కళ్యాణ్ రామ్ లాంటి మాస్ హీరో అలాంటి క్లైమాక్స్ ఒప్పుకోవడం నిజంగా సాహసమే.
ఇక నటీనటుల విషయానికి వస్తే.. కళ్యాణ్ రామ్ మరోసారి చించేసాడు. తనదైన పర్ఫార్మెన్స్ తో, డైలాగ్ డెలివరీతో అదరగొట్టాడు. యాక్షన్ సీన్స్ విషయంలో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. విజయశాంతికి పర్ఫెక్ట్ రీ ఎంట్రీ సినిమా అంటే ఇదే. ఈ వయసులో కూడా అదిరిపోయే యాక్షన్ సీన్స్ చేశారు. అలాగే ఎమోషనల్ సన్నివేశాలు కూడా బాగా నటించింది విజయశాంతి. శ్రీకాంత్ సర్ప్రైజింగ్ ప్యాకేజ్. సోహైల్ ఖాన్ విలన్ గా బాగున్నాడు. మిగిలిన వాళ్లంతా తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.
టెక్నికల్ టీం విషయానికి వస్తే.. అజనీష్ లోకనాథ్ అందించిన సంగీతం పర్లేదు. పాటలు ఓకే కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం బాగుంది. రాంప్రసాద్ సినిమాటోగ్రఫీ రిచ్ గా ఉంది. తమ్మిరాజు ఎడిటింగ్ ఇంకాస్త షార్ప్ గా ఉండుంటే బాగుండేది. కానీ దర్శకుడు ఛాయిస్ కాబట్టి మనం తప్పు పట్టలేము. నిర్మాతలు ఖర్చుకు వెనకాడకుండా సినిమాను నిర్మించారు. దర్శకుడు ప్రదీప్ చిలుకూరి రొటీన్ కథ రాసుకున్నా కూడా దానికి మదర్ సెంటిమెంట్ యాడ్ చేయడంతో సినిమా రేంజ్ పెరిగింది. రొటీన్ సినిమా చూస్తున్న ఫీలింగ్ వచ్చినా కూడా.. మాస్ సినిమాలను ఇష్టపడే ఆడియన్స్ కు ఇది నచ్చే అవకాశం ఉంది.ఓవరాల్ గా అర్జున్ సన్నాఫ్ వైజయంతి.. వెరీ రొటీన్ కమర్షియల్ మదర్ సెంటిమెంట్ సినిమా.. ఏ మాత్రం ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వెళ్తే పర్లేదు అనిపిస్తుంది..