అల్లు అర్జున్ హెల్త్ పై అరవింద్ సెన్సేషనల్ కామెంట్స్, అసలేం అయింది..?

సంధ్య థియేటర్ ఘటన తర్వాత అల్లు అర్జున్ ఏం మాట్లాడినా, ఏం చేసినా సరే సెన్సేషనల్ గానే ఉంటుంది. పుష్ప సినిమా గ్రాండ్ సక్సెస్ ను అదే రేంజ్ లో ఎంజాయ్ చేయలేకపోయిన.. అల్లు అర్జున్ ఇప్పుడు చాలా సైలెంట్ గా కనపడుతున్నాడు. ఆయన ఎక్కడున్నాడో, ఏం చేస్తున్నాడో కూడా ఎవరికీ క్లారిటీ లేదు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 5, 2025 | 12:30 PMLast Updated on: Feb 05, 2025 | 12:30 PM

Arvinds Sensational Comments On Allu Arjuns Health What Happened

సంధ్య థియేటర్ ఘటన తర్వాత అల్లు అర్జున్ ఏం మాట్లాడినా, ఏం చేసినా సరే సెన్సేషనల్ గానే ఉంటుంది. పుష్ప సినిమా గ్రాండ్ సక్సెస్ ను అదే రేంజ్ లో ఎంజాయ్ చేయలేకపోయిన.. అల్లు అర్జున్ ఇప్పుడు చాలా సైలెంట్ గా కనపడుతున్నాడు. ఆయన ఎక్కడున్నాడో, ఏం చేస్తున్నాడో కూడా ఎవరికీ క్లారిటీ లేదు. ఇక రీసెంట్ గా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం విదేశాలకు వెళ్లిన అల్లు అర్జున్ ఇప్పుడే తిరిగి ఇండియాలో అడుగుపెట్టాడు. త్వరలోనే ఒక సినిమా షూటింగ్ లో కూడా పాల్గొనే అవకాశం కనబడుతోంది.

త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో వస్తున్న సినిమాకు ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ ఫిక్స్ చేశారు. త్వరలోనే ఈ సినిమా షెడ్యూల్ లో అల్లు అర్జున్ పాల్గొనే ఛాన్స్ ఉందని వార్తలు వస్తున్నాయి. జనవరిలో స్టార్ట్ కావాల్సిన ఈ సినిమా కొన్ని కారణాలతో వాయిదా పడింది. ఫిబ్రవరి చివరిలో ఈ సినిమాను మొదలు పెట్టాలని టార్గెట్ గా పెట్టుకుని వర్క్ చేస్తున్నారు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆల్మోస్ట్ కంప్లీట్ చేశాడు. ఇక అల్లు అర్జున్ కూడా ఈ సినిమా కోసం గట్టిగానే కష్టపడుతున్నాడు. పుష్ప సినిమాతో నార్త్ ఇండియాలో మార్కెట్ పెరగడంతో, మళ్ళీ నార్త్ ఇండియాలో దుమ్మురేపాలని అల్లు అర్జున్ టార్గెట్ గా పెట్టుకొని పని చేస్తున్నాడు.

ఇక సినిమా ఈవెంట్లకు కూడా అల్లు అర్జున్ పెద్దగా అటెండ్ అయ్యే ప్రయత్నం చేయడం లేదు. ఆహ్వానం వచ్చిన ఈవెంట్లకు కూడా వెళ్లడానికి ఇష్టపడటం లేదు. రీసెంట్ గా నాగచైతన్య, సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా వచ్చిన తండేల్ సినిమా ఈవెంట్ లో అల్లు అర్జున్ చీఫ్ గెస్ట్ గా పాల్గొనాలని ఇన్విటేషన్ పంపించారు. కానీ అల్లు అర్జున్ మాత్రం వెళ్లడానికి ఇష్టపడలేదు. అనవసరమైన రాద్ధాంతం ఎందుకు అనుకున్నాడో ఏమో, మరి ఏదైనా కారణమో తెలియదు గాని ఈవెంట్ కు అల్లు అర్జున్ వెళ్ళలేదు.

ముందు వెళ్తాడని ప్రచారం జరిగినా ఆ తర్వాత సైలెంట్ గా ఉండిపోయాడు. దీని వెనుక కారణమేంటి అనేదానిపై ఇప్పటివరకు ఎవరి నుంచి అనౌన్స్మెంట్ రాలేదు. అయితే లేటెస్ట్ గా ఆయన తండ్రి, ఈ సినిమా నిర్మాత అల్లు అరవింద్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అల్లు అర్జున్ చీఫ్ గెస్ట్ గా అటెండ్ కాకపోవడంపై రియాక్ట్ అయిన అల్లు అరవింద్.. బన్నీ రీసెంట్ గా ఫారిన్ ట్రిప్ కు వెళ్లొచ్చాడని ఈ కార్యక్రమానికి వస్తాడని అనుకున్నామని, అయితే తీవ్రమైన గ్యాస్ సంబంధ సమస్య కారణంగానే రాలేకపోయాడని, ఇదే విషయాన్ని అతను తన మాటగా చెప్పమన్నాడంటూ అల్లు అరవింద్ క్లారిటీ ఇచ్చారు. ఇక ఈ సినిమా ఫిబ్రవరి 7న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.