ఆర్య 2 ఫస్ట్ డే కలెక్షన్స్.. పవన్, మహేష్, NTR లను బీట్ చేయలేకపోయిన బన్నీ..!

అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో 15 సంవత్సరాల కింద వచ్చిన సినిమా ఆర్య 2. అప్పట్లో ఈ సినిమా పెద్దగా ఆడలేదు. అదేంటి అని అడిగితే తెలంగాణ ఉద్యమం అల్లర్లలో పడి ఆర్య 2 అంతగా ఆడలేదు అంటూ అప్పట్లో సమాధానం చెప్పారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 7, 2025 | 02:50 PMLast Updated on: Apr 07, 2025 | 2:50 PM

Arya 2 First Day Collections Bunny Couldnt Beat Pawan Mahesh Ntr

అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో 15 సంవత్సరాల కింద వచ్చిన సినిమా ఆర్య 2. అప్పట్లో ఈ సినిమా పెద్దగా ఆడలేదు. అదేంటి అని అడిగితే తెలంగాణ ఉద్యమం అల్లర్లలో పడి ఆర్య 2 అంతగా ఆడలేదు అంటూ అప్పట్లో సమాధానం చెప్పారు. కానీ నిజం మాట్లాడుకుంటే ఈ సినిమాలో స్క్రీన్ ప్లే లోపాలు చాలా ఉన్నాయి. ఆర్య 2 ఫ్లాప్ అవ్వడానికి కారణం కూడా అదే అని చాలా సార్లు చెప్పాడు సుకుమార్. కానీ రాను రాను ఈ సినిమాకు కల్ట్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. తెలియకుండానే ఆర్య 2 అంటే ఒక క్రేజ్ వచ్చేసింది. దానికి తోడు దేవి శ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ కూడా ఈ సినిమాకు ప్రాణం. చాలా రోజుల నుంచి ఈ సినిమాను రీ రిలీజ్ చేయండి అనే డిమాండ్ దర్శక నిర్మతలకు బాగా వినిపిస్తుంది. దాంతో మొన్న ఏప్రిల్ 5ను ఈ సినిమాను మళ్ళీ విడుదల చేశారు. అల్లు అర్జున్ పుట్టినరోజుకు సరిగ్గా మూడు రోజుల ముందు ఆర్య 2 ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఈ మధ్య ఏ పెద్ద హీరో సినిమా మళ్లీ రీ రిలీజ్ అయినా కూడా రికార్డు కలెక్షన్స్ వస్తున్నాయి. అలాగే పుష్ప 2 లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత అల్లు అర్జున్ సినిమా మళ్లీ విడుదల కానుండటంతో కచ్చితంగా ఆర్య 2 సినిమాకు రికార్డు ఓపెనింగ్స్ వస్తాయి అనుకున్నారంతా. వాళ్లు ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్ లో కాదు గాని మంచి కలెక్షన్స్ వచ్చాయి ఈ సినిమాకు. ఫస్ట్ డే దాదాపు 4 కోట్ల గ్రాస్ వసూలు చేసింది ఆర్య 2. రీ రిలీజ్ సినిమాకు నాలుగు కోట్ల కలెక్షన్స్ అంటే అద్భుతం అని చెప్పాలి. కానీ మిగిలిన హీరోలతో పోలిస్తే మాత్రం చాలా తక్కువ కలెక్షన్స్. రెండేళ్ల కింద ఖుషి సినిమా దీని కంటే ఎక్కువ వసూలు చేసింది. అలాగే జూనియర్ ఎన్టీఆర్ సింహాద్రి సినిమాకు ఫస్ట్ డే 5 కోట్లకు పైగా గ్రాస్ వచ్చింది. అలాగే మహేష్ బాబు బిజినెస్ మాన్ సినిమా రీ రిలీజ్ లో మొదటి రోజే 5 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ సినిమాలన్నింటితో పోలిస్తే ఆర్య 2 సినిమాకు చాలా తక్కువ ఓపెనింగ్స్ వచ్చినట్టు. చాలా చోట్ల ఈ సినిమాకు హౌస్ ఫుల్ బోర్డులు కనిపించాయి. కానీ రికార్డు ఓపెనింగ్స్ తీసుకురావడానికి ఇది సరిపోలేదు.

ఒకప్పుడు బన్నీ సినిమా అంటే మెగా ఫాన్స్ కూడా చూసేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా కాదు.. మరీ ముఖ్యంగా ఈ మధ్య కాలంలో అల్లు అర్జున్ బిహేవియర్ చూసిన తర్వాత చిరంజీవి, పవన్ కళ్యాణ్ అభిమానులు పూర్తిగా ఆయనకు దూరమయ్యారు. పైగా తనకు ఆర్మీ ఉంది అంటూ ప్రతిసారి అల్లు అర్జున్ పదేపదే చెప్పడంతో.. అది కూడా మెగా అభిమానులను బన్నీకి దూరం చేసింది. ఒకవేళ ఆర్య 2 సినిమాను మెగా ఫాన్స్ మొత్తం చూసి ఉంటే కచ్చితంగా దీనికి రికార్డ్ ఓపెనింగ్స్ వచ్చేవి. కానీ ఒక వర్గం మొత్తం ఈ సినిమాను దూరం పెట్టడంతో ఆ ఎఫెక్ట్ కలెక్షన్స్ మీద బాగానే చూపించండి. ఆరెంజ్ రీ రిలీజ్ కు వచ్చిన రెస్పాన్స్ అల్లు అర్జున్ సినిమాకు రావడం లేదు అనేది కళ్ళ ముందు కనిపిస్తున్న సాక్ష్యం. మ్యాటర్ ఏదైనా కూడా రీ రిలీజ్ సినిమాలలో ఆర్య 2 బెటర్ పర్ఫామెన్స్ చేసింది కానీ రికార్డ్ బ్రేకింగ్ పర్ఫామెన్స్ అయితే చేయలేదు.

ప్రస్తుతం ఈయన అట్లీ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టినరోజు కానుక ఈ సినిమా అనౌన్స్మెంట్ వీడియో రానుంది. సన్ పిక్చర్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా కోసం దాదాపు 200 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు బన్నీ.. అలాగే షేరింగ్ కూడా. మరోవైపు అట్లీ 100 కోట్ల పారితోషికం అందుకుంటున్నాడు. 2026 లోనే ఈ సినిమా విడుదల కానుంది. ఆ తర్వాత త్రివిక్రమ్ సినిమా లైన్లోకి రానుంది.