ఆర్య 2 ర్యాంపేజ్.. ఇదేం పిచ్చిరా.. అప్పుడు ఫ్లాప్ చేసి ఇప్పుడు ఎగబడుతున్నారు..!
ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి జనరేషన్ మారుతుంది అంటే ఏమో అనుకుంటాం కానీ.. ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు చూస్తుంటే అది నిజమే అని నమ్మక తప్పట్లేదు. పదేళ్ల కింద విడుదలైన సినిమాలు అప్పుడు ఫ్లాప్ అయితే..

ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి జనరేషన్ మారుతుంది అంటే ఏమో అనుకుంటాం కానీ.. ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు చూస్తుంటే అది నిజమే అని నమ్మక తప్పట్లేదు. పదేళ్ల కింద విడుదలైన సినిమాలు అప్పుడు ఫ్లాప్ అయితే.. అవే సినిమాలు ఇప్పుడు విడుదల చేస్తే సూపర్ సూపర్ అంటూ విజిల్స్ వేసుకుంటూ చూస్తున్నారు ప్రేక్షకులు. అప్పుడు డిజాస్టర్ అన్న సినిమాలను తీసుకొచ్చి ఇప్పుడు కైట్ క్లాసిక్స్ అంటున్నారు. ఈ కాన్సెప్ట్ అర్థం కాక సగటు సినీ అభిమాని తల పట్టుకుంటున్నాడు. ఫస్ట్ టైం రిలీజ్ చేసినప్పుడు సినిమా దరిద్రంగా ఉంది అని.. బ్లాక్ చేసిన ప్రేక్షకులే సెకండ్ టైం దాన్ని రిలీజ్ చేసినప్పుడు సూపర్ అని నెత్తిన పెట్టుకుంటున్నారు. ఈ మధ్య చాలా సినిమాల విషయంలో ఇదే జరిగింది. అయినా మనుషులు కోతుల నుంచి వచ్చారు అంటే ఏమో అనుకుంటాం కానీ.. మనం చేసే పనులు చూస్తుంటే అప్పుడప్పుడు అది నిజమే అనిపిస్తుంది. చాలా వరకు ఫ్లాప్ సినిమాలను మళ్లీ రిలీజ్ చేసుకొని క్యాష్ చేసుకుంటున్నారు నిర్మాతలు. తాజాగా అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన ఆర్య 2 సినిమాను మరోసారి విడుదల చేస్తున్నారు.
ఏప్రిల్ 5న ఈ సినిమా విడుదల కానుంది.. తాజాగా బుకింగ్స్ ఓపెన్ చేస్తే కొన్ని నిమిషాల్లోనే పెట్టిన టికెట్స్ అన్నీ హాట్ కేకుల్లా అమ్ముడు అయిపోయాయి. హైదరాబాదులో చాలావరకు మొదటిరోజు టికెట్స్ అన్నీ అయిపోయాయి. ఇంకా షోస్ పెంచే ఆలోచనలో ఉన్నారు మేకర్స్. ఇదే ఆర్య 2 సినిమా 2009లో విడుదలైనప్పుడు డిజాస్టర్ అయ్యింది. సుకుమార్ టేకింగ్.. అల్లు అర్జున్ యాక్టింగ్ బాగానే ఉన్నా ఎందుకు అప్పటి పరిస్థితులకు ఆర్య 2 సెట్ కాలేదు. దాన్ని మళ్ళీ ఇప్పుడు విడుదల చేస్తుంటే ఎగబడి చూడడానికి రెడీ అవుతున్నారు ప్రేక్షకులు. ఇదొక్కటే కాదు.. ఆ మధ్య ప్రేమికుల రోజు సందర్భంగా ఓయ్ సినిమాను మళ్ళీ విడుదల చేస్తే థియేటర్స్ అన్ని ప్యాక్ అయిపోయాయి. ఒక్క టికెట్ ముక్క కూడా దొరక్కుండా ఫుల్ పండగ చేసుకున్నారు ఆడియన్స్. అదే సినిమా 2009లో ఈ సినిమా విడుదలైనప్పుడు ఈ రేంజ్ లో చూసి ఉంటే కచ్చితంగా సిద్ధార్థ్ ఖాతాలో ఒక బ్లాక్ బస్టర్ ఉండేది. కానీ అప్పుడు సినిమా చూడలేదు.. ఏం బాలేదు.. స్లోగా ఉంది.. హీరోయిన్ చచ్చిపోతే ఏం బాగుంటుంది అంటూ చాలా కథలు చెప్పారు. అదే సినిమాను ఇప్పుడు ప్రేమికుల రోజు స్పెషల్ అంటూ ఒక టాగ్ లైన్ వేసి విడుదల చేస్తే అబ్బో అద్భుతం అంటూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు.
ఆనంద్ రంగా తెరకెక్కించిన ఓయ్ సినిమాలో షామిలి హీరోయిన్ గా నటించింది. ఇక రెండేళ్ల కింద రామ్ చరణ్ బర్త్ డే రోజు రీ రిలీజైన ఆరెంజ్ సినిమాకు వచ్చిన రెస్పాన్స్ చూసి ఇండస్ట్రీ మొత్తం షాక్ అయిపోయింది. రామ్ చరణ్, జెనీలియా జంటగా నటించిన ఈ సినిమాను బొమ్మరిల్లు భాస్కర్ 2010లో తెరకెక్కించాడు. అప్పుడు సినిమాను ఎవరూ పట్టించుకోలేదు. కానీ ఇదే సినిమాను మళ్లీ విడుదల చేస్తే అబ్బో అద్భుతం అంటూ ఓ రేంజ్ లో పండగ చేసుకున్నారు. సూర్య సన్నాఫ్ కృష్ణన్, ధనుష్ 3 ఇలా ఈ మధ్య చాలా ఫ్లాప్ సినిమాలను మళ్లీ విడుదల చేస్తే అదుర్స్ అంటూ ఆదరిస్తున్నారు ప్రేక్షకులు. అందుకే చంచల మనస్తత్వం అనేది కేవలం మనకు మాత్రమే ఉంటుంది అని మరోసారి నిరూపిస్తున్నారు మన ఆడియన్స్. ఇక ఇదే అదునుగా అకేషన్ చూసి ఫ్లాప్ సినిమాలను మళ్లీ విడుదల చేయాలని చూస్తున్నారు దర్శక నిర్మాతలు. అయినా అప్పుడు సక్సెస్ చేయకుండా అదే సినిమాలను 15 ఏళ్ల తర్వాత మళ్లీ రిలీజ్ చేస్తే చూడడం అనేది కాస్త విచిత్రంగానే ఉంది.