Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కోసం ఆంధ్రాకి సినిమా సెట్లు.. ఇది తప్పేమో..?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోసం సినిమా సెట్లు కదిలిపోతున్నాయి. ప్రజల వద్దకు పాలన ఎలాగో, స్టార్ వద్దకు సెట్లు అలా వెళ్లబోతున్నాయి. ఎందుకంటే పవన్ ఇప్పడు ప్రజాసేవలో భాగంగా పొలిటికల్ గా బిజీ కాబోతున్నారు. సో విజయవాడ, గుంటూరు, వైజాగ్ లోనే 25 రోజులు పొలిటికల్ జర్నీ చేయబోతున్నారు.

Pawan Kalyan Shootings and Meetings
కాబట్టి ఈ 25 రోజులు షూటింగ్స్ కి బ్రేక్ వేసే బదులు, ఏపీలో పొలిటికల్ గా యాత్ర చేస్తూనే మరో వైపు సినిమాల షూటింగ్ చేస్తే ఎలా ఉంటుందనుకున్నాడట. అంతే వెంటనే నిర్మాతలంతా కలిసి వాకే అనేశారు. అంటే ఈనెల 14 , 16, 18, 20 తేదీల్లో పవన్ ప్రజా యాత్ర చేస్తాడు.. ఆరోజుల్లో విజయవాడ, గుంటూరు చుట్టపక్కల పర్యటిస్తాడు.. సో 15, 17, 19 తేదీల్లో తను ఖాలీ కాబట్టి, ఆరోజు ఉస్తాద్ భగత్ సింగ్ సీన్లు తీస్తారట.
వింటానికి విచిత్రంగా ఉన్నా, అటు సినిమా షూటింగ్, ఇటు రాజకీయాలు బ్యాలెన్స్ చేసేందుకు ఇలా పవన్ ఎక్కడ పర్యటిస్తే అక్కడ గ్యాప్ దొరికినప్పుడు సినిమా షూటింగ్ పూర్తి చేయాలని స్కెచ్చేశారట. ఇక వైజాగ్ పర్యటనలో ఓజీ షూటింగ్ ప్లాన్ చేశారు, హరి హరవీరమల్లు సెట్ ని కూడా విజయవాడ, విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తున్నారు. మొత్తానికి పవర్ ఫుల్ స్టార్ కోసం హైదరాబాద్ లో వేసిన సెట్లని పీకి, ఆంధ్రాకి పార్సిల్ చేస్తున్నారు. ఏపీలో ఆయా చిత్రానికి సంబంధించిన సెట్టింగ్ వేసే పనుల్లో సినిమా టీం ఫుల్ బిజీ అయ్యిందంటున్నారు సినీ ప్రముఖులు.