Kamal Hassun: ప్రభాస్ ని వాడేసుకుంటున్న కమల్ హాసన్.. ఇది కథ కాదు.!
రెబల్ స్టార్ ప్రభాస్ ఇమేజ్, క్రేజ్, మార్కెట్ అన్నీంటితో ఇప్పుడు లోకనాయకుడు కమల్ హాసన్ కి పనిపడింది. దేశం గర్వించదగ్గ నటుడైన కమల్ కి మరో హీరో ఇమేజ్ తో పనేముందిలే అనుకోవచ్చు. కాని నిజంగానే ప్రభాస్ ఇమేజ్ ని వాడుకునే స్కెచ్చేశాడు కమల్ హాసన్.

As part of the film Project K, he is going to the Comic Con event in San Diego, US for promotions of his Lokanayakudu
ప్రాజెక్ట్ కేలో కమల్ హాసన్ విలన్ గా నటించబోతున్నాడు. కాబట్టే గురువారం యూఎస్ లోని శాన్ డియాగోలో జరిగే కామిక్ కాన్ ఈవెంట్ కి వెళ్లబోతున్నాడు. అక్కడ స్టేజ్ మీద ప్రాజెక్ట్ కే టీం కామిక్ రైటర్స్ అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పబోతోందట. ఆ చర్చా వేదిక మీద కమల్, ప్రభాస్, దీపికాతో పాటు నాగ్ అశ్విన్ కూడా ఉండబోతున్నాడట.
ఫస్ట్ పాన్ వరల్డ్ మూవీగా రానున్న ప్రాజెక్ట్ కే ప్రమోషనల్ ఈవెంట్ లో కమల్ భారతీయుడు 2 తాలూకు చర్చకు రెడీ య్యాడట. అంటే ప్రాజెక్ట్ కే గురించి మాట్లాడుతూనేతను చేస్తున్న భారతీయుడు 2 ప్రస్తావన వచ్చేలా క్యశ్చనేర్ రెడి అయ్యిందట. అంటే బాహుబలిగా ప్రపంచానికి పరిచయం అయినా ప్రభాస్ ఇమేజ్ ని, ప్రాజెక్ట్ కే స్టేజ్ ని కమల్ వాడుకోబోతున్నాడని తేలింది.సో లోకనాయకుడనిపించుకున్న నటుడికే ప్రభాస్ ఇమేజ్ తో పని పడింది.