పవన్ తమ్ముడిగా అకీరా, ఫ్యాన్స్ కు పూనకాలే
స్టార్ హీరోల కుమారుల ఎంట్రీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు. ఇప్పుడు టాలీవుడ్ లో ఇద్దరు హీరోల కుమారుల ఎంట్రీ కోసం ఫ్యాన్స్ లో ఆసక్తి పెరిగిపోతుంది. అందులో ముఖ్యంగా నందమూరి బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ, పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరా కోసం ఫ్యాన్స్ బాగా ఎదురు చూస్తున్నారు.
స్టార్ హీరోల కుమారుల ఎంట్రీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉంటారు. ఇప్పుడు టాలీవుడ్ లో ఇద్దరు హీరోల కుమారుల ఎంట్రీ కోసం ఫ్యాన్స్ లో ఆసక్తి పెరిగిపోతుంది. అందులో ముఖ్యంగా నందమూరి బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ, పవన్ కళ్యాణ్ కుమారుడు అకీరా కోసం ఫ్యాన్స్ బాగా ఎదురు చూస్తున్నారు. ఒక సీక్వెల్ కథను బాలకృష్ణ తన కుమారుడి కోసం సిద్దం చేయించారు అనే వార్తలు వస్తున్నాయి. ఆ కథ విషయంలో కొన్ని మార్పులు చేయాల్సి ఉండగా ఆలస్యం అవుతోందని తెలుస్తోంది.
ఇటీవల ఒక ప్రముఖ దర్శకుడికి ఆ కథ బాలయ్య ఇచ్చారని అందులో కొన్ని మార్పులు అడిగారని, అలాగే పరుచూరి గోపాల కృష్ణను బాలయ్య మాటలు రాయమని అడిగినట్టుగా తెలుస్తోంది. ఇక పవన్ కళ్యాణ్ కుమారుడి విషయానికి వస్తే అకీరాను ఓజీ లో చూపించాలని ఆయన భావిస్తున్నారు. ఇటీవల సుజిత్ తనను కలిసినప్పుడు కూడా ఓజీలో అకీరా కోసం కొన్ని సీన్స్ డిజైన్ చేయాలని చెప్పారట. దీనికి సుజిత్ కూడా ఓకే చెప్పినట్టు సమాచారం. తనకు సినిమా ఫియర్ ఉంటే పోతుందని, తనతో ఉంటే కొంత ధైర్యం వస్తుందని పవన్ భావిస్తున్నారట.
ఓజీలో అకీరాను తన తమ్ముడిగా చూపించాలని పవన్ కోరారట. ఇద్దరి మధ్య యాక్షన్ సీన్స్ కూడా ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. ఒక పాట, యాక్షన్ సీన్స్, చిన్న లవ్ స్టోరీ ఇలా ఓజీలో అకీరా కోసం డిజైన్ చేయమని చెప్పారట పవన్. దీనికి సంబంధించి ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. అకీరా ఇప్పటికే యాక్టింగ్ లో మెళుకువలు నేర్చుకున్నాడు. ఈ సినిమాలో అతను సక్సెస్ అయితే మాత్రం పవన్ కు భయం తగ్గినట్టే. ప్రస్తుతం అకీరా కోసం ఒక కథ కూడా పవన్ రెడీ చేయించారు. మరి ఎప్పుడు ఆ సినిమాను ప్లాన్ చేస్తారనేది క్లారిటీ లేదు.