ఆ ట్రోలింగ్ కి కౌంటర్ ఎటాక్.. లుక్ వెనక కిక్కిచ్చే షాకు…

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ సినిమా వస్తోందంటే చాలు యాంటీ ఫ్యాన్స్ ట్రోలింగ్ మొదలౌతుంది. పనికట్టుకుని నెగెటీవ్ కామెంట్లు షురూ అవుతాయి...

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 10, 2025 | 07:20 PMLast Updated on: Mar 10, 2025 | 7:20 PM

As Soon As A Man Of Masses Ntr Movie Is Coming Out Anti Fan Trolling Starts

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ సినిమా వస్తోందంటే చాలు యాంటీ ఫ్యాన్స్ ట్రోలింగ్ మొదలౌతుంది. పనికట్టుకుని నెగెటీవ్ కామెంట్లు షురూ అవుతాయి… కాని ఇప్పటికిప్పుడు ఎన్టీఆర్ సినిమా ఏది రావట్లేదు.తను చేస్తున్న హిందీ మూవీ వార్ 2 కూడా ఆగస్ట్ 14 కే రిలీజ్ అవుతోంది.. అలాంటప్పుడు సడన్ గా ఎందుకు తన మీద ట్రోలింగ్ పెరిగింది. అది కూడా ఈమధ్య ఎన్నడూ లేనంతగా తన మీదే టార్గెటెడ్ గా ట్రోలింగ్ షురూ అయ్యింది. అంతటికీ తన కొత్త లుక్కే కారణం. కొత్త హేయిర్ స్టైల్ తో ఓ యాడ్ లో తళుక్కమన్నాడు తారక్. అంతే వెంటనే తన లుక్ మీద నెగెటీవ్ కామెంట్ల దాడి మొదలైంది. కట్ చేస్తే కావాలనే ఎన్టీఆర్ ఇలా తన హేయిర్ స్టైల్ ని టెంపరరీగా మార్చాడట. తన లుక్ మీద కామెంట్లు పడే ఛాన్స్ ఉన్నా, తప్పక ఇలా తన లుక్ మార్చుకున్నాడట.. ఎందుకు? టేకేలుక్

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హేయిర్ స్టైల్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రోలింగ్ కి కారణమైంది. గెడ్డం తోకనిపిస్తున్న ఎన్టీఆర్, తల మీద జుట్టుని ఎవరో వొత్తి పట్టినట్టు లేదంటే ఆయిల్ పెట్టినట్టు ఉందని కొందరు… లేదు అదే కటింగ్ జుట్టు తగ్గించి గెడ్డం పెంచారని ఇంకొకరు.. ఇలా కామెంట్ గోల పెరిగింది. అయితే ఈ ట్రోలింగ్స్ లో ఎన్నాళ్లకు దొరికాడనే పైశాచిక ఆనందం తప్ప ట్రోలర్స్ కామెంట్స్ లో డెప్త్ లేదు.కాబట్టే ఇది యాంటీ ఫ్యాన్స్ పనే అనితేలిపోతోంది. నిజానికి హేయిర్ స్టైల్ విషయంలోనే కాదు, డ్రెస్ మేకప్ అన్నీంట్లో తారక్ కి మంచి టేస్ట్ ఉందంటారు. చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు. అలాంటి తను ఇలాంటి హేయిర్ స్టైల్ కి ఎలా ఒప్పుకున్నాడనే డౌట్ నిజానికి వాలిడ్ పాయింటే.. కాని ట్రోలింగ్ చేసేలా తన లుక్ లేదు. కామెంట్ల దాడిక చేసేంత ఘోరంగా ఆ యాడ్ లేదు..

సందు దొరికింది కదాని యాంటీ ఫ్యాన్స్ గట్టిగానే ఎన్టీఆర్ హేయిర్ స్టైల్ ని, ఆ యాడ్ ని ట్రోల్ చేస్తున్నారు. కాని ఇక్కడే ఈ ప్రపంచ ముదురు స్ట్రాజటి బయట పడింది. నిజానికి ఎన్టీఆర్ మొన్నటికి మొన్న వార్ 2 లో అదిరిపోయేలుక్కులో కనిపిస్తాడని, ఈపాటికే లీకైన ఫోటోలతో తేలింది. షూటింగ్ స్పాట్ లో తన లుక్ చాలా సార్లు రివీలైంది. దీనికి తోడు తను వార్2 షూటింగ్ తో ప్రజెంట్ ముంబైలో బిజీ అయ్యాడు. సండే వరకు ఈ షూట్ జరుగుతుంది. అయితే ఈ యాడ్ మాత్రం రీసెంట్ గానే తీశారని తెలుస్తోంది. మరి అంత గుడ్ లుక్ ఉన్నతను, సడన్ గా హేయిర్ స్టైల్ మార్చేలా జుట్టు కత్తిరిస్తాడా అంటే ఛాన్సేలేదు. కావాలని తన జుట్టుని తగ్గించిన లుక్ లోకి టెంపరరీగా మార్చారట.

దీనికి కారనం వార్ 2 మూవీలోని స్పెషల్ సాంగ్ లో తను ఎలా కనిపిస్తాడో, అలానే ఈ యాడ్ లో కనిపిస్తే, లుక్ రివీల్ అయినట్టౌతుంది. అలానే డ్రాగన్ కోసం జుట్టు పెంచుతున్న తారక్ లుక్ కూడా రివీల్ కాకూడదని, బాద్ షాలో జుట్టు స్టైల్ ని మార్చినట్టు ఇక్కడ మార్చారట. ఇది వాంటెడ్ లీ చేసిన పనే అని తెలుస్తోంది. కాకపోతే మరీ జుట్టుకి నూనె పెట్టి అణిచివేసినట్టుండేసరికి యాంటీ ఫ్యాన్స్ పైశాచిక ఆనందానికి ఇదో కారనంగా దొరికింది. కాని అసలు లాజిక్ వెనకున్న మ్యాజిక్ వార్ 2 రిలీజ్ అయ్యాకే తెలుస్తుంది.