ASSEMBLY ELECTIONS: చిరంజీవి, మహేశ్ బాబు.. ఓట్లు వేయబోయే పోలింగ్ బూత్‌లివే..!
ఓటర్లు ఎవరైనా సరే.. తమ స్థాయితో సంబంధం లేకుండా అందరూ పోలింగ్ బూత్ కు వచ్చి ఓటు వేయాల్సిందే. సామాన్యుల నుంచి రాజకీయ నేతల వరకూ, సినీ ప్రముఖుల వరకూ ఇదే రూల్ వర్తిస్తుంది. కాగా, ప్రముఖుల ఓటింగ్ విషయంలో అందరికీ ఆసక్తి ఉంటుంది.

ASSEMBLY ELECTIONS: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు మరికొన్ని గంటలే గడువుంది. వోటింగ్ కోసం ఎన్నికల సంఘం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. గురువారం రాష్ట్రంలోని ఓటర్లంతా తమ ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. ఓటర్లు ఎవరైనా సరే.. తమ స్థాయితో సంబంధం లేకుండా అందరూ పోలింగ్ బూత్ కు వచ్చి ఓటు వేయాల్సిందే. సామాన్యుల నుంచి రాజకీయ నేతల వరకూ, సినీ ప్రముఖుల వరకూ ఇదే రూల్ వర్తిస్తుంది. కాగా, ప్రముఖుల ఓటింగ్ విషయంలో అందరికీ ఆసక్తి ఉంటుంది. ఎవరు.. ఎక్కడ ఓటు వేస్తారు అని తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటుంది. ముఖ్యంగా సినీ సెలబ్రిటీల విషయంలో ఈ ఆసక్తి ఇంకాస్త ఎక్కువే. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి నుంచి పలువురు సెలబ్రిటీలు ఎక్కడెక్కడ ఓటు వేస్తారు.. వారికి ఓటు హక్కు ఎక్కడుంది.. వంటి వివరాలు వెల్లడయ్యాయి. ప్రస్తుతం సర్క్యులేట్ అవుతున్న వివరాలివి.
జూబ్లీహిల్స్ క్లబ్ (పోలింగ్ బూత్ 149): చిరంజీవి, సురేఖ, రాంచరణ్, ఉపాసన, నితిన్
జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ (పోలింగ్ బూత్ 165): మహేశ్‌బాబు, నమ్రత, మంచు మోహన్‌బాబు, మంచు విష్ణు, మంచు లక్ష్మి, మనోజ్
వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ (పోలింగ్ బూత్ 151): నాగార్జున, అమల, నాగచైతన్య, అఖిల్
బీఎస్‌ఎన్‌ఎల్ సెంటర్ (పోలింగ్ బూత్ 153): అల్లు అర్జున్, స్నేహారెడ్డి, అల్లు అరవింద్, అల్లు శిరీష్
ఓబుల్‌రెడ్డి స్కూల్ (పోలింగ్ బూత్ 150): జూనియర్ ఎన్టీఆర్, ప్రణతి
పోలింగ్ బూత్ (160): విశ్వక్‌సేన్
పోలింగ్ బూత్ 164: శ్రీకాంత్, విజయ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ,
యూసఫ్ గూడ చెక్‌పోస్టు ప్రభుత్వ పాఠశాల: తనికెళ్ల భరణి
పోలింగ్ బూత్ 166: దగ్గుబాటి రాణా, సురేశ్ బాబు
ఎంపీ, ఎమ్మెల్యే కాలనీ (పోలింగ్ బూత్ 157): రవితేజ
మణికొండ హైస్కూల్: ప్రభాస్, అనుష్క, వెంకటేశ్, బ్రహ్మానందం
రోడ్ నెం.45, జూబ్లీహిల్స్ ఆర్థిక సహకార సంస్థ: అల్లరి నరేశ్
ఎఫ్‌ఎన్‌సీసీ (పోలింగ్ బూత్ 164): రాఘవేంద్రరావు, రాజశేఖర్, జీవిత
షేక్ పేట్ ఇంటర్నేషనల్ స్కూల్: రాజమౌళి, రామారాజమౌళి