Allu Arjun: సూప‌ర్ అప్‌డేట్.. హీరోయిన్‌గా ఆ స్టార్ న‌టిని ఫిక్స్ చేశారా..?

బన్నీ.. కోలీవుడ్ డైరెక్ట‌ర్ అట్లీ కాంబోలో ఓ మూవీ సెట్ అయిన‌ట్లు జోరుగా ప్రచారం జ‌రుగుతోంది. ఇప్పుడు దీనికి సంబంధించిన మ‌రో లేటెస్ట్ అప్‌డేట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. టాలీవుడ్ హీరోల్లో అల్లు అర్జున్ స్టైల్ ఓ స్పెష‌ల్ అని చెప్పాలి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 15, 2024 | 10:56 AMLast Updated on: Mar 15, 2024 | 10:56 AM

Atlee And Allu Arjun Collaboration Confirmed Announcement Soon

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్ర‌స్తుతం పుష్ప 2 షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌తున్న ఈ సీక్వెల్ ఆగ‌స్ట్ 15న వ‌ర‌ల్డ్ వైడ్‌గా రిలీజ్ కాబోతోంది. పుష్ప పార్ట్ వ‌న్ దాదాపు 400 కోట్ల క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. ఇందులో పుష్ప‌రాజ్‌గా బ‌న్నీ యాక్టింగ్‌, మేన‌రిజ‌మ్స్ దేశ‌వ్యాప్తంగా సినీ అభిమానుల‌ను మెప్పించాయి. దాంతో పుష్ప సీక్వెల్‌పై పాన్ ఇండియ‌న్ లెవెల్‌లో భారీగా అంచ‌నాలు నెల‌కొన్నాయి.

JD Lakshminarayana: టార్చ్‌లైట్‌.. జేడీ పార్టీకి కేటాయించిన గుర్తు ఇదే..

ఇక దీని త‌ర్వాత‌.. బన్నీ.. కోలీవుడ్ డైరెక్ట‌ర్ అట్లీ కాంబోలో ఓ మూవీ సెట్ అయిన‌ట్లు జోరుగా ప్రచారం జ‌రుగుతోంది. ఇప్పుడు దీనికి సంబంధించిన మ‌రో లేటెస్ట్ అప్‌డేట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. టాలీవుడ్ హీరోల్లో అల్లు అర్జున్ స్టైల్ ఓ స్పెష‌ల్ అని చెప్పాలి. త‌న డైలాగ్స్, మేన‌రిజం, బాడీ లాంగ్వేజ్‌తో బ‌న్నీ ఎన్నో భారీ హిట్లు అందుకున్నాడు. ఇక‌.. సోష‌ల్ మెసేజ్‌కు స్టైలిష్ యాక్ష‌న్ మాస్ అంశాల‌ను మేళ‌వించి సినిమాలు తెర‌కెక్కించ‌డం డైరెక్ట‌ర్ అట్లీ స్పెషాలిటీ. తేరీ నుంచి జ‌వాన్ వ‌ర‌కు ఈ ఫార్ములాలో అట్లీ రూపొందించిన‌ సినిమాల‌న్నీ బాక్సాఫీస్ వ‌ద్ద వంద‌ల కోట్ల వ‌సూళ్ల‌ను రాబ‌ట్టాయి. షారుఖ్‌తో జవాన్ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ త‌ర్వాత.. అల్లు అర్జున్‌తో అట్లీ సినిమా చేయ‌బోతున్న‌ట్లు టాక్ వినిపిస్తోంది. అట్లీ మార్క్ స్టైలిష్ యాక్ష‌న్ అంశాల‌తో ఈ మూవీ రూపొంద‌నున్న‌ట్లు స‌మాచారం. దీని అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఆయన బర్త్ డే రోజున రానుందని తెలుస్తోంది. దీంతో బ‌న్నీ ఫ్యాన్స్ పండ‌గ చేసుకుంటున్నారు.

ఈ ప్రెస్టీజియ‌స్ మూవీని ఒక బడా నిర్మాణ సంస్థ రూపొందిస్తుంద‌ట‌. స్టార్ నటి కీర్తి సురేష్‌ను హీరోయిన్‌గా ఫిక్స్ చేశారని అంటున్నారు. అంతేకాదు.. సీనియ‌ర్ హీరోయిన్ త్రిష ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ పాన్ ఇండియ‌న్ మూవీ కోసం అట్లీ 60 కోట్ల రెమ్యున‌రేష‌న్ అందుకోనున్న‌ట్లు తెలిసింది. జ‌వాన్ బ్లాక్‌బ‌స్ట‌ర్ త‌ర్వాత అట్లీకి డిమాండ్ పెర‌గ‌డంతో అత‌డు కోరినంత మొత్తాన్ని ఇవ్వ‌డానికి ప్రొడ్యూస‌ర్లు అంగీక‌రించిన‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. దీంతో.. అల్లు అర్జున్‌, అట్లీ సినిమాకు సంబంధించి అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఈగ‌ర్‌గా వెయిట్ చేస్తున్నారు.