ఆడియో 25 కోట్లు.. OTT 150 కోట్లు.. థియేట్రికల్ 350 కోట్లు..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో బుచ్చి బాబు తీస్తున్న మూవీ పెద్ది. అసలు గ్లోబల్ స్టార్ గా మారకముందే చరణ్ కి సక్సెస్ రేటు ఘాటెక్కింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 3, 2025 | 08:30 PMLast Updated on: Apr 03, 2025 | 8:30 PM

Audio 25 Crores Ott 150 Crores Theatrical 350 Crores

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో బుచ్చి బాబు తీస్తున్న మూవీ పెద్ది. అసలు గ్లోబల్ స్టార్ గా మారకముందే చరణ్ కి సక్సెస్ రేటు ఘాటెక్కింది. త్రిబుల్ ఆర్ తర్వాతే కష్టాల బరువు పెరిగిపోయింది. ఆచార్య, గేమ్ చేంజర్ తో పంచ్ పడ్డాక, పెద్ది మీద తనకి, ఫ్యాన్స్ కి భారీగా అంచనాలుంటే, మార్కెట్ లో మాత్రం అసలు అంచనాల గోలే లేదు. అలాంటి టైంలో రెహమాన్, ఎన్టీఆర్, జాన్వీ కపూర్, రాజమౌళి సీన్ లోకి వచ్చి పుణ్యం కట్టుకుంటున్నారు. ఆస్కార్ విన్న ఏ ఆర్ రెహమాన్, జాన్వీ కపూర్ సీన్ లోకొచ్చారంటే అర్ధముంది. ఎందుకంటే వాళ్లు పెద్ది ప్రాజెక్టులో భాగమయ్యారు. కాని మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, రాజమౌళి ఎందుకు సీన్ లోకి వస్తున్నారు. ఏ కోణంలో రామ్ చరణ్ కి సాయం చేస్తున్నారు.? టేకేలుక్

గ్లోబల్ స్టార్ గా మారాక చరణ్ కి ఆచార్య పంచ్ ఇచ్చింది. గేమ్ ఛేంజర్ షాక్ ఇచ్చింది. ఇప్పుడు ఎన్టీఆర్ చేయాల్సిన బుచ్చి బాబు మూవీ పెద్ది మీదే పూర్తిగా ఆధార పడాల్సి వస్తోంది. ఐతే టైటిల్ వింటానికి యావరేజ్ గా ఉన్నా, పోస్టర్ వచ్చాకే అదరిందన్నారు. కాని పుష్ప రాజ్ లానే చరణ్ లుక్ ఉండటంతో, చాలా వరకు ట్రోలింగ్స్ చేశారు.ఓరకంగా పెద్దితో చరణ్ హ్యాట్రిక్ ఫ్లాప్ ఫేస్ చేస్తాడా అన్నట్టు, యాంటీ ఫ్యాన్స్ ట్రోలింగ్ ఓవైపు పెరిగింది.ఇళాంటి టైంలో, పెద్ది ఆడియో రైట్స్ 25 కోట్లని తేలటం, అది కూడా కేవలం సౌత్ భాషల వరకే అవటంతో, ఇక హిందీ వర్షన్ ఆడియోరైట్స్ మరో 20 కోట్లు ఉండొచ్చనంటున్నారు.

ఇక ఓటీటీ డీల్ అయితే 150 కోట్లని తేలింది. నార్త్ ఇండియా థియేట్రికల్ రైట్స్ 350 కోట్ల వరకు వెళ్లేలా ఉంది. మొత్తంగా చూస్తే 550 కోట్లు ఈ పాటికే కన్ఫామ్ అయ్యాయి. సౌత్ బిజినెస్, కూడా తోడైతే చరణ్ కూడా సోలో హీరోగా వెయ్యికోట్ల క్లబ్ లో అడుగుపెట్టే ఛాన్స్ ఉంది.ఓరకంగా ఇది మంచి శకునమే. దీనికి తోడు సీన్ లోకి మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, దర్శక ధీరుడు రాజమౌళి వస్తున్నారు. ఆల్రెడీ ఈ సినిమాకు ఏ ఆర్ రెహమాన్ మ్యూజిక్ కంపోజ్ చేయటం వల్లే, సినిమా ఆడియో రైట్స్ 25 కోట్లు ప్లస్ మరో 20 కోట్లు యాడ్ అయ్యాయి.

జాన్వీ కపూర్ వల్ల నార్త్ లో మార్కెట్ రీచ్ పెరుగుతుంది. ఇక ఇందులో మ్యాన్ ఆఫ్ మాసెస్ కూడా గెస్ట్ రోల్వేయటం ఆల్ మోస్ట్ కన్ఫామ్ అయ్యింది. రాజమౌళి కూడా కల్కీలో గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చినట్టే ఇందులోకనిపిస్తాడట. ఇది కూడా కిక్ ఇచ్చే అంశమే. మొత్తానికి ఆచార్య, గేమ్ ఛేంజర్ ఫ్లాపులతో అయిన గాయాలకు పెద్దితో మందు రాసే కార్యక్రమం గట్టిగానే జరుగుతున్నట్టుంది.