David Warner: ట్విట్టర్ కు పోటీగా థ్రెడ్స్ వార్నర్ మామ ఇందులో కూడా..
ట్విటర్‌కు పోటీగా ఫేస్‌బుక్ దిగ్గజం మార్క్ జుకర్ బర్గ్ తీసుకొచ్చిన థ్రెడ్స్‌లోకి ఆస్ట్రేలియా డాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ ఎంట్రీ ఇచ్చాడు. @davidwarner31 పేరుతో ఖాతా తెరిచాడు.
నేను ఇప్పుడు థ్రెడ్స్‌లోకి వచ్చానని తొలి పోస్ట్ పెట్టాడు. ఈ పోస్ట్‌లో ఆసీస్ టెస్ట్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌ను ట్యాగ్ చేశాడు. అప్పటికే థ్రెడ్స్‌లో ఉన్న ప్యాట్ కమిన్స్.. దయచేసి డ్యాన్ వీడియోలు వద్దంటూ రిక్వెస్ట్ చేశాడు. టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ రిషభ్ పంత్ కూడా ఈ పోస్ట్‌పై స్పందించాడు. మంచి సలహా ఇచ్చారు బ్రో అని ప్యాట్ కమిన్స్ మెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఈ సంభాషణ సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతోంది. టిక్ టాక్, ఇన్‌స్టా రీల్స్‌లో తన డ్యాన్స్, స్పూఫ్ వీడియోలతో డేవిడ్ వార్నర్ భారత అభిమానులను అలరించాడు. ముఖ్యంగా టాలీవుడ్ సాంగ్స్, డైలాగ్స్‌తో అదరగొట్టాడు. సతీమణి క్యాండీస్ వార్నర్‌తో కలిసి కూడా డ్యాన్స్ చేసిన వీడియోలను పంచుకున్నాడు.
ఈ క్రమంలోనే థ్రెడ్స్‌లో కూడా డ్యాన్స్ వీడియోలతో తమను ఇబ్బంది పెట్టవద్దని ప్యాట్ కమిన్స్ వార్నర్‌ను రిక్వెస్ట్ చేశాడు. మార్క్ జుకర్‌బర్గ్ నేతృత్వంలోని మెటా సంస్థ.. ట్విటర్ తరహాలో థ్రెడ్స్‌ను తీసుకురాగా.. సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులతో పాటు నెటిజన్లు అకౌంట్స్ ప్రారంభించారు. థ్రెడ్ అకౌంట్ ఓపెన్ చేసిన రిషభ్ పంత్.. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి బర్త్ డే విషెస్ తెలియజేశాడు. ఇదిలా ఉండగా, మరోవైపు, మార్క్ జుకర్‌బర్గ్‌పై కేసు వేసేందుకు ట్విటర్ సిద్ధమవుతోంది. ట్విటర్ వ్యాపార సంబంధిత రహస్యాలు, మేథో సంపత్తి హక్కులను వినియోగించి థ్రెడ్స్ రూపొందించారంటూ ట్విట్టర్ తరపు న్యాయవాది మెటా సీఈఓ మార్గ్ జుకర్‌బర్గ్‌కు తాజాగా ఓ లేఖ రాశారు. ఇందుకోసం మెటా పలువురు ట్విటర్ మాజీ ఉద్యోగులను నియమించుకుందని కూడా ఆరోపించారు.