మహేష్ – రాజమౌళి ప్రాజెక్ట్ లో ఆస్ట్రేలియా క్రికెటర్ కీ రోల్…?
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి సినిమాల్లో ఎప్పుడూ ఏదో ఒక స్పెషల్ ఉంటుంది. ఆయన సినిమాలు గురించి ఏ అప్డేట్ వచ్చినా సరే సోషల్ మీడియా షేక్ అవ్వడమే కాకుండా ఎలక్ట్రానిక్ మీడియాలో
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి సినిమాల్లో ఎప్పుడూ ఏదో ఒక స్పెషల్ ఉంటుంది. ఆయన సినిమాలు గురించి ఏ అప్డేట్ వచ్చినా సరే సోషల్ మీడియా షేక్ అవ్వడమే కాకుండా ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా దాని గురించి డిస్కషన్ జరుగుతూనే ఉంటాయి. తన సినిమాల్లో ఎప్పుడూ ఏదో ఒక స్పెషల్ చూపించేందుకు రాజమౌళి కూడా ఇంట్రెస్టింగ్గా వర్క్ చేస్తూ ఉంటారు. అందుకే సినిమా ఎలా ఉన్నా సరే హిట్టు టాక్ వచ్చేస్తుంది. త్రిబుల్ ఆర్ సినిమా విషయంలో రాజమౌళి కొన్ని మిస్టేక్స్ చేసినట్టు అప్పట్లో ప్రచారం జరిగింది. ఆ మిస్టేక్స్ మహేష్ బాబు సినిమాలో రిపీట్ కాకుండా ఉండేందుకు రాజమౌళి ఇప్పుడు చాలా కష్టపడుతున్నారు.
ప్రస్తుతం మహేష్ బాబు సినిమా షూటింగును స్టార్ట్ చేస్తున్న జక్కన్న ఈ సినిమాలో ఎలాగైనా సరే వరల్డ్ వైడ్ గా ఉన్న కొంతమంది స్టార్స్ లో తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నాడు. రెండు పార్ట్ లుగా వస్తున్న ఈ సినిమాలో ఇప్పటికే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా ఫైనల్ అయిపోయింది. రీసెంట్గా హైదరాబాద్ వచ్చి ఆ లుక్ టెస్ట్ కూడా అటెండ్ అయింది. ఇక త్వరలోనే ఈ సినిమా షూటింగ్లో ఆమె పాల్గొనే అవకాశం కనబడుతోంది. ఈ సినిమా కోసం దాదాపుగా ప్రియాంక చోప్రా ఏడాది పాటు కష్టపడే అవకాశం ఉంది. రాజమౌళి సినిమా అంటే హీరో హీరోయిన్లు తమ కెరీర్లో కనీసం రెండు మూడేళ్లు అయినా సరే వదులుకోవాల్సిందే.
ఈ సినిమా ది హాలీవుడ్ రేంజ్ కాబట్టి రాజమౌళి కూడా అలాగే ప్లాన్ చేస్తున్నాడు. అందుకే ప్రియాంక చోప్రా కూడా ఈ సినిమాలో యాక్ట్ చేయడానికి ఓకే చెప్పింది. ఇక ఈ సినిమాలో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డేవిడ్ వార్నర్‌ను తీసుకోవడానికి రాజమౌళి రెడీ అయిపోయాడు. డేవిడ్ వార్నర్ తెలుగు సినిమాలు విషయంలో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాడు. అందుకే ఈ సినిమాలో డేవిడ్ వార్నర్‌ను తీసుకుంటే ఆస్ట్రేలియాలో సినిమా ప్రమోషన్స్ కు హెల్ప్ అవుతుందని జక్కన్న ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ కొంత ఆస్ట్రేలియాలో కూడా జరగనుంది అక్కడ జరిగే షూటింగ్లో డేవిడ్ వార్నర్ అటెండ్ అవుతాడు.
అలాగే ఆఫ్రికాలో జరిగే షూటింగ్ లో కూడా డేవిడ్ వార్నర్ పాల్గొనే ఛాన్స్ ఉందని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో డేవిడ్ వార్నర్ రోల్ ఏంటి అనేది క్లారిటీ లేకపోయినా.. ఒక కౌంటికీ అతను గవర్నర్ గా ఉంటాడట. అతనుంటే కచ్చితంగా న్యూజిలాండ్ లో కూడా ఈ సినిమాకు ప్రమోషన్ చేయడానికి హెల్ప్ అవుతుంది. అందుకే జక్కన్న ఈ విధంగా ప్లాన్ చేసినట్టు టాక్. ఇక ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉండే ఛాన్స్ ఉందనే వార్తలు కూడా వస్తున్నాయి.