Brahmanandam : బ్రహ్మానందం ఆత్మకథ.. సన్మానించిన మెగాస్టార్..

టాలీవుడ్ స్టార్ కమెడియన్ బ్రహ్మానందం తన ఆత్మకథ రాశారు. పుస్తక రూపంలో తన ఆత్మకథను ఆవిష్కరించారు. తాజాగా బ్రహ్మానందం ఆత్మకథ పుస్తకం మార్కెట్లో అందుబాటులో ఉంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 29, 2023 | 11:44 AMLast Updated on: Dec 29, 2023 | 11:44 AM

Autobiography Of Brahmanandam Honored Megastar

టాలీవుడ్ స్టార్ కమెడియన్ బ్రహ్మానందం తన ఆత్మకథ రాశారు. పుస్తక రూపంలో తన ఆత్మకథను ఆవిష్కరించారు. తాజాగా బ్రహ్మానందం ఆత్మకథ పుస్తకం మార్కెట్లో అందుబాటులో ఉంది. ఈ తరుణంలో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తనకు ప్రియమైన బ్రహ్మానందంకు అభినందనలు తెలిపారు. తన ఇంటికి బ్రహ్మానందాన్ని ఆహ్వానించి శాలువాతో సత్కరించారు.

ఈసందర్భంగా మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో ఓ పోస్ట్ షేర్ చేశారు. తనకెంతో ఆప్తుడు అయిన బ్రహ్మానందం ఎన్నో విషయాలతో కూడిన తన ఆత్మకథను పుస్తకరూపంలోకి తీసుకురావడం ఆనందంగా ఉందన్నారు. బ్రహ్మానందం అక్షర రూపంలో పుస్తకాన్ని తీసుకురావడం ఎంతో అభినందనీయమని, ఆ పుస్తకాన్ని అందరూ కొని చదవాలని ఆశిస్తున్నట్లు తెలిపారు.

ఒకనాడు బ్రహ్మానందం ఒక విషయం చెప్పాడని మెగాస్టార్ సోషల్ మీడియా వేదిక ఆ విషయాన్ని పంచుకున్నారు. ఒకరి అనుభవం మరొకరికి పాఠ్యాంశం కావొచ్చని, మార్గదర్శకం అవ్వొచ్చని, బ్రహ్మానందం ఆత్మకథ పుస్తకం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం అవుతుందని, వెలకట్టలేని అనుభూతిని ఇస్తుందని మెగాస్టార్ అన్నారు. పుస్తక ప్రచురణకర్తలైన అన్వీక్షికి వారికి అభినందనలు తెలియజేశారు.