అవతార్ డైరెక్టర్ ల్యాండింగ్… SSMB29తో పాటు అవతార్ 3 కోసం..
సూపర్ స్టార్ మహేశ్ బాబు 29 వ మూవీ ప్రెస్ మీట్ కి టైం దగ్గర పడుతోంది. ఈనెల 21న వరల్డ్ మీడియా ముందు సినిమా టైటిల్ ని, పోస్టర్ ని లాంచ్ చేయటమే కాదు, బేసిక్ స్టోరీ లైన్ ని కూడా ఎనౌన్స్ చేయబోతున్నాడు రాజమౌళి.

సూపర్ స్టార్ మహేశ్ బాబు 29 వ మూవీ ప్రెస్ మీట్ కి టైం దగ్గర పడుతోంది. ఈనెల 21న వరల్డ్ మీడియా ముందు సినిమా టైటిల్ ని, పోస్టర్ ని లాంచ్ చేయటమే కాదు, బేసిక్ స్టోరీ లైన్ ని కూడా ఎనౌన్స్ చేయబోతున్నాడు రాజమౌళి. ఆల్రెడీ అవతార్ ఫేం జేమ్స్ కామెరున్ కూడా ఈ ప్రెస్ మీట్ కి రావటం కన్ఫమ్ అవటమే కాదు, తను కూడా ఆన్ ది వే… ఇండియా టూర్ కి తనకి వీసా కూడా వచ్చినట్టు తెలుస్తోంది. అయితే ఇంతగా రాజమౌళి కోసం, మహేశ్ మూవీని ప్రమోట్ చేయాల్సిన అవసర అవతార్ లాంటి క్లాసిక్స్ తీసిన జేమ్స్ కామెరున్ కి ఏముంది..? అక్కడే రెండు లాజిక్స్ ఉన్నాయి. మొదటి లాజిక్ ప్రకారం చూస్తే ఇండియాలోనే నెంబర్ వన్ డైరెక్టర్ కాబట్టి, రాజమౌళి మూవీని ప్రమోట్ చేయటానికి ఇండియాకొస్తే, అవతార్ 3 టైంలో ఇక్కడి ఆడియన్స్ కి తన సినిమా ఈజీగా దగ్గరౌతుంది. అలా తన మూవీకి 140 కోట్ల భారతీయులని దగ్గరికి తీసుకెళ్లినట్టౌతుంది. అయినా అవతార్ లాంటి సినిమాకు ప్రమోషన్ అక్కర్లేదని అందరికి అనిపించొచ్చు.. కాని అవతార్ మూడో సీక్వెల్ కి ప్రమోషన్ లేకపోతే ఎంత డ్యామేజ్ జరిగే ఛాన్స్ఉందో తెలిస్తే అంతా షాక్ అవ్వాల్సిందే.. దీనికి తోడు రాజమౌళి తీస్తున్న మహేశ్ మూవీ బిజినెస్ లోకూడా జేమ్స్ కామెరున్ కి వాటా ఉందని తెలుస్తోంది… అదెలాగో చూసేయండి.
అవతార్, టైటానిక్ లాంటి ట్రెండ్ సెట్టింగ్ సినిమాలతో హాలీవుడ్ ని కుదిపేసిన దర్శకుడు జేమ్స్ కామెరున్. అలాంటి తను సూపర్ స్టార్ మహేశ్ బాబు 29 వ మూవీ ప్రెస్ మీట్ కి ఇండియాకు రాబోతున్నాడని నెలరోజులుగా ప్రచారం జరుగుతోంది. నిజానికి ఆ ఏర్పార్లు పూర్తయ్యాకే రాజమౌళి టీం ఏప్రిల్ 21న రోజున భారీ ప్రెస్ మీట్ పెట్టి, ఇంటర్ నేషనల్ మీడియా ముందుకు రాబోతోందని లీకులందాయి..కాకపోతే ఇక్కడ జేమ్స్ కామెరున్ లాంటి హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు ఎందుకు ఓ తెలుగు సినిమా ప్రెస్ మీట్ కి వస్తాడు..? అదేదో సినిమా లాంచ్ టైంలో కాదు… కనీసం ట్రైలర్ లాంచ్ ప్రమోషన్ కాదు… కేవలం మూడు షెడ్యూల్ల షూటింగ్ జరుపుకున్న ఎస్ ఎస్ ఎంబీ 29 వ మూవీకోసం…అక్కడే లాజిక్ షాక్ ఇస్తుంది..
ఆల్రెడీ అవతార్, అవతార్ 2 తో వరల్డ్ మార్కెట్ ని రెండు సార్లు షేక్ చేసిన జేమ్స్ కామెరున్, అవతార్ 3 ప్రమోషన్ కి కలిసొస్తుందనే ఇండియాకొస్తున్నాడా? అంటే ఖచ్చితంగా అందులో నిజముంది. అసలు అవతార్ లాంటి మూవీలకు ప్రమోషనే అవసరం లేదు… అలా రిలీజ్ అయితే ఇలా చూస్తారనేది కూడా నిజమే.. కాని అవతార్ 2 వచ్చాక సీన్ మారిపోయింది. అవతార్ వచ్చినప్పుడున్నంత ఫీవర్ జనాల్లో అవతార్ 2 టైంలో కనిపించలేదు.అంతా రెగ్యులర్ స్టోరీనే.. ఏదో గ్రాఫిక్స్ మాయాజాలం అనుకుంటే, అందులో కూడా కొత్తదనం లేక, టైంపాస్ లా చూసారే తప్ప… అదేదో అద్భుతమైన మూవీ చూడబోతున్నామనేంతగా సీక్వెల్ కి రెస్పాన్స్ రాలేదు. దీంతో అవతార్ 3 కి పరిస్థితి మరీ ఘోరంగా ఉండే ఛాన్స్ ఉందనే అభిప్రాయం వినిపిస్తోంది. కాబట్టి 140 కోట్ల పైన జనాలున్న దేశంలో అవతార్ 3 ప్రమోషన్ పీక్స్ కి తీసుకెళ్లేందుకు డెఫినెట్ గా రాజమౌళిఒక మంచి ఆప్షన్.
అసలే పాన్ ఇండియా ట్రెండ్ సెట్ చేసిన దర్శకుడు, ఇండియా నెంబర్ వన్ కూడా.. అలాంటి డైరెక్టర్ తో కలిసి ఓ ప్రెస్ మీట్లో ఉంటే, తన అవతార్ 3 మూవీ ప్రమోషన్ టైంలో, ఇండియన్ మార్కెట్ లో అవసరానికి మించి రీచ్ పెరుగుతుంది. అంతేకాకుండా ఇండియన్స్ కి దగ్గరయ్యేందుకు ఇదో మంచి సందర్భం.. ప్రపంచ వ్యాప్తంగా కంపెనీలే మన మార్కెట్ కోసం ఇండియన్స్ కి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నాయి. కాబట్టి ఆ ఐడియాలజీలోనే జేమ్స్ కామెరున్ హైద్రబాద్ ప్రయాణాన్ని కూడా చూడాల్సి వస్తుంది.
ఇక ఆస్కార్ టైంలో రాజమౌళితో ఏర్పడ్డ స్నేహం వల్లే ఎస్ ఎస్ ఎంబీ యూరోప్, కెనడా డిస్ట్రిబ్యూషన్ ని కూడా తన కంపెనీ చూసుకోబోతోందట. అలా కూడా తనకి ఈ మూవీలో వాటా ఉండబోతోంది. అది కాక రాజమౌలి తీసేది ఆశామాషి మూవీ కాదు. రిలీజ్ కి ముందే 5 వేల కోట్ల ప్రీరిటీజ్ బిజినెస్ చేసింది. ఫస్ట్ టైం ఐమ్యాక్స్ కెమెరాతో తీస్తున్న ఇండియన్ సినమా… అలానే 7 ఖండాలు, ఏడు వింతలు వీటితో పాటు ప్రపంచ వ్యాప్తంగా 55 వేల థియేటర్స్ లో రిలీజ్ అయ్యే తొలి భారతీయ సినిమా… ఇన్ని సర్ ప్రైజులున్న మూవీని ప్రమోట్ చేయటం డెఫినెట్ గా జేమ్స్ కామెరున్ కి కలిసొచ్చేదే.. అందులోనూ ఇండియన్ సినిమాను ప్రమోట్ చేస్తున్నాడన్న మంచిపేరు కూడా… ఇన్ని కలిసి ఉన్నాయి కాబట్టే జేమ్స్ కామెరున్ ఇండియా ప్రయాణం కన్పామ్ చేసుకున్నాడు.