అవతార్ డైరెక్టర్ ఎంట్రీ… ప్రెస్ మీట్ అందుకేనా..?
సూపర్ స్టార్ మహేవ్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా కోసం హాలీవుడ్ డైరెక్టర్ ఇండియాలో ల్యాండ్ కాబోతున్నాడు. టైటానిక్ , ట్రూ లైస్ లాంటి సినిమాలతో ట్రెండ్ సెట్ చేసిన జేమ్స్ కామేరున్ అంటేనే, అవతార్ పేరు గుర్తొస్తుంది.

సూపర్ స్టార్ మహేవ్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా కోసం హాలీవుడ్ డైరెక్టర్ ఇండియాలో ల్యాండ్ కాబోతున్నాడు. టైటానిక్ , ట్రూ లైస్ లాంటి సినిమాలతో ట్రెండ్ సెట్ చేసిన జేమ్స్ కామేరున్ అంటేనే, అవతార్ పేరు గుర్తొస్తుంది. అలా కొన్నేళ్లుగా అవతార్ సీక్వెల్స్ తీస్తున్న తను, రాజమౌళి కోసం రంగంలోకి దిగుతున్నాడు. ఇండియాకి బయలు దేరుతున్నాడు. ఏకంగా ఓ తెలుగు సినిమాని, పాన్ వరల్డ్ లెవల్లో ప్రమోట్ చేసేందుకు సిద్దపడ్డాడు. ఇంతకి తనెందుకు రాజమౌలి కి ఇంత పెద్ద సాయం చేస్తున్నాడు…? ఓ తెలుగు సినిమా కోసం హాలీవుడ్ ట్రెండ్ సెట్టర్ ఎందుకు ఇంత దూరం రావాలి? ఆల్రెడీ నెట్ ఫ్లిక్స్ సంస్థ అధినేత రాజమౌళి మూవీ కోసం అడుగు ముందుకేశాడని ప్రచారం జరుగుతోంది. ఇలాంటి టైంలో అవతార్ డైరెక్టర్ ఇండియా కొస్తున్నాడంటే నిజమేనా? ఏప్రిల్ ప్రెస్ మీట్ ని సడన్ గా ఫిక్స్ చేయటానికి తనే కారణమా? హావేలుక్
జేమ్స్ కామేరున్ అంటే వెంటనే ఎవరికి తెలియకపోవచ్చు. కాని టైటానిక్ సినిమా డైరెక్టర్ అంటే వెంటనే గుర్తొస్తాడు. లేదంటే అవతార్ 1,2 తీసి అవతార్ 3 ని తీస్తున్న దర్శకుడంటే వెంటనే కనెక్ట్ అవుతాడు. నిజానికి టాలీవుడ్ కి రాజమౌళి, సుకుమార్ కోలీవుడ్ కి శంకర్, మణిరత్నం లానే, హాలీవుడ్ కి స్టీవెన్ స్పిల్ బర్గ్, జేమ్స్ కామెరున్ రెండు కళ్లలాంటి వాళ్లు.. హాలీవుడ్ తో మన ఇండస్ట్రీకిపోల్చలేం.. కాని
అక్కడ కూడా ఈ ఇద్దరు దర్శకులెంత లెజెండో తేలాలంటే ఈ పోలిక తప్పదు.అలాంటి హాలీవుడ్ లివింగ్ లెజెండ్ అయిన జేమ్స్ కామేరున్ ఇండియాకొస్తున్నాడు. గతంలో కూడా వచ్చాడు. కాని ఇప్పుడు తెలుగు సినిమా కోసమే రంగంలోకి దిగుతున్నాడు. హైద్రబాద్ లో ల్యాండ్ కాబోతున్నాడు. ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో మహేశ్ బాబు, రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా సెట్లో కనిపించబోతున్నాడు.
అసలు విషయం ఏంటంటే, మహేశ్ బాబు పాన్ వరల్డ్ మూవీకి హాలీవుడ్ ప్రమోటర్ జేమ్స్ కామేరునే అని తెలుస్తోంది. ఆల్ మోస్ట్ ఇది అన్ అఫీషియల్ గా కన్ఫామ్ అయిన సంగతే. కాకపోతే ఏప్రిల్ ఫస్ట్ వీక్ ప్రెస్ మీట్ లో తను కనిపించటం, తన నుంచి ఎదో ఒక స్టేట్ మెంట్ వస్తే అసలు కనెక్షన్ తెలుస్తుంది. ఆల్రెడీ త్రిబుల్ ఆర్ చూసినప్పుడు రాజమౌళిని తెగ పొగిడాడు ఈ దర్శకుడు.తను త్రిబుల్ ఆర్ చూడటమే కాదు, తన వైఫ్ ని కూడా చూడమన్నట్టు చెప్పాడు. రాజమౌళితో చాలా సేపు మాట్లాడాడు.. ఆవీడియో అప్పట్లో వైరల్ అయ్యింది. సో ఆ పరిచయం వల్లే రాజమౌళి కొత్త సినిమాకు హాలీవుడ్ లో గైడ్ చేస్తున్నాడా? లేదంటే ఈ సినిమా ప్రొడక్షన్ లోనో, లేదంటే డిస్ట్రిబ్యూషన్ లోనో సహాయం చేస్తున్నాడా అన్నది తేలలేదు.
కాకపోతే రాజమౌళి వచ్చేయ్ మనం సినిమా తీద్దాం అని ఒక వీడియలో అన్నాడు జేమ్స్ కామేరున్. ఆ లెక్కన ఈసినిమాలో తను కూడా ప్రొడ్యూసర్ గా కొంత భాగమయ్యాడా అన్నది ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో పెట్టే ప్రెస్ మీట్ లో తేలబోతోంది. తన నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది కాబట్టే సినిమాను లాంచ్ చేసినప్పుడు కూడా మీడియాను పిలవని రాజమౌళి, పనికట్టుకుని ఇప్పుడు ప్రెస్ మీట్ పెడుతున్నాడు.