ఎవరీ ప్రీతీ చల్లా…? క్రిష్ పెళ్లి చేసుకునేది ఈ అమ్మాయినే

టాలీవుడ్ లో ఇప్పుడు పెళ్ళిళ్ళ సందడి మొదలయింది. యువ హీరోలు, డైరెక్టర్లు ఇలా ఒక్కొక్కరు పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. త్వరలో నాగ చైతన్య, శోభిత వివాహం జరగనుంది. ఆ తర్వాత... నార్నే నితిన్, శివాని వివాహం జరగనుంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: November 9, 2024 | 08:10 PMLast Updated on: Nov 09, 2024 | 8:10 PM

Avery Preeti Challa Krish Will Marry This Girl

టాలీవుడ్ లో ఇప్పుడు పెళ్ళిళ్ళ సందడి మొదలయింది. యువ హీరోలు, డైరెక్టర్లు ఇలా ఒక్కొక్కరు పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. త్వరలో నాగ చైతన్య, శోభిత వివాహం జరగనుంది. ఆ తర్వాత… నార్నే నితిన్, శివాని వివాహం జరగనుంది. ఇప్పుడు మరో పెళ్లి న్యూస్ బయటకు వచ్చింది. 2016 లో వివాహం చేసుకుని 2021 లో డైవర్స్ తీసుకుని ఇప్పుడు సింగల్ గా ఉంటున్న డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి రెండో వివాహానికి రెడీ అయ్యారు. 2016 లో ఆయన డాక్టర్ గా వర్క్ చేసే రమ్య అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు.

ఇప్పుడు సినిమాలపై ఫోకస్ చేసిన క్రిష్… సింగిల్ గా ఉంటూ వచ్చారు. హరిహర వీరమల్లు సినిమాను స్టార్ట్ చేసిన క్రిష్… ఆ తర్వాత డైరెక్షన్ బాధ్యతల నుంచి తప్పుకుని మరొకరికి సినిమా అప్పగించారు. ఈ టైం లో క్రిష్ మరో పెళ్లి చేసుకుంటున్నారు అనే ప్రచారం జరిగింది. ఎట్టకేలకు అది నిజమే అని టాలీవుడ్ వర్గాలు తెలిపాయి. ఆయన మరోసారి డాక్టర్ ను వివాహం చేసుకుంటున్నారు. డాక్టర్ గా వర్క్ చేసే ప్రీతీ చల్లాను వివాహం చేసుకుంటున్నారు క్రిష్. డాక్టర్ ప్రీతి చల్లా 2007 నుండి ప్రాక్టీస్‌లో ఉన్నారు.

హైదరాబాద్‌ లో పుట్టి పెరిగిన ప్రీతీ… 2007లో చెన్నైలోని శ్రీరామచంద్ర యూనివర్సిటీ నుంచి MBBS అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీని కంప్లీట్ చేసారు. 2012లో చెన్నైలోని అదే యూనివర్సిటీ నుంచి MS కంప్లీట్ చేసింది ప్రీతీ. గైనకాలజీలో గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన తర్వాత, ఆమె MS – గైనకాలజిస్ట్ గా వర్క్ చేస్తున్నారు. ఆమె ఫ్యామిలీ మొత్తం డాక్టర్లే. ఆమె కుటుంబంలో నాల్గవ తరం వైద్యురాలిగా ఆమె వర్క్ చేస్తున్నారు. అమీర్పేట్ లోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో ఆమె వర్క్ చేస్తున్నారు. ప్రీతీ అమ్మ, అమ్మమ్మ కూడా డాక్టర్లుగా పని చేసారు.

డాక్టర్ గా ప్రీతికి 16 ఏళ్ళ అనుభవం ఉంది. హైదరాబాద్‌లోని అమీర్‌పేటలోని చల్లా హాస్పిటల్స్ లో డాక్టర్ ప్రీతి చల్లా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఆమె ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) సభ్యురాలుగా కూడా ఉన్నారు. వచ్చేవారంలోనే నిశ్చితార్థం కూడా జరగనుందనే టాక్ వినిపిస్తోంది. ప్రీతికి గతంలోనే వివాహం అయింది. ఆమెకు 11 ఏళ్ళ కొడుకు కూడా ఉన్నాడట. ప్రస్తుతం సింగిల్ మథర్ గా ఉంటూ… కొడుకుని చదివిస్తూ డాక్టర్ గా పని చేస్తున్నారు ప్రీతీ. ఈ విషయంలో క్రిష్ కు అభ్యంతరం లేకపోవడంతో ఆమె వివాహానికి అంగీకరించారట.