ఎన్టీఆర్ టాలెంట్ కు వార్ 2 డైరెక్టర్ ఫిదా
భాష విషయంలో దేవరకు తిరుగు లేదు. అది ఏ భాష అయినా సరే యిట్టె నేర్చుకుని ఏ రేంజ్ లో అయినా డైలాగులు నిమిషాల్లో చెప్పడం ఎన్టీఆర్ స్టైల్. మన టాలీవుడ్ లో ఏ స్టార్ హీరో కూడా నాలుగు భాషల్లో సినిమాకు డబ్బింగ్ ఇప్పటి వరకు చెప్పలేదు.
భాష విషయంలో దేవరకు తిరుగు లేదు. అది ఏ భాష అయినా సరే యిట్టె నేర్చుకుని ఏ రేంజ్ లో అయినా డైలాగులు నిమిషాల్లో చెప్పడం ఎన్టీఆర్ స్టైల్. మన టాలీవుడ్ లో ఏ స్టార్ హీరో కూడా నాలుగు భాషల్లో సినిమాకు డబ్బింగ్ ఇప్పటి వరకు చెప్పలేదు. కాని ఎన్టీఆర్ మాత్రం భాష ఏదైనా సరే టార్గెట్ ఫిక్స్ చేసుకుని డబ్బింగ్ ఫినిష్ చేస్తున్నాడు. దేవర సినిమా కన్నడ డబ్బింగ్ 4 గంటల్లో టార్గెట్ ఫిక్స్ చేసుకుని కంప్లీట్ చేసి హైదరాబాద్ ఫ్లైట్ ఎక్కేసాడు. ఇది చూసి అక్కడి హీరోలు కూడా షాక్ అయ్యారు. అంత ఈజీగా వేరే భాష డబ్బింగ్ ఎలా అంటూ ఆశ్చర్యపోయారు.
ఇక ఇదే టైం లో తమిళ, హిందీ భాషల్లో కూడా ఎన్టీఆర్ స్వయంగా డబ్బింగ్ చెప్పాడు. తెలుగుతో కలిపి నాలుగు భాషల్లో డబ్బింగ్ చెప్పడం అంటే అంత ఈజీ కాదు. వేరే భాషల్లో స్టార్ హీరోలు కూడా పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు గాని ఇలా ప్రతీ భాషపై పట్టు మాత్రం పెంచుకోలేదు. ఇదే దేవర సినిమాకు ప్లస్ అయింది అంటారు టాలీవుడ్ అనలిస్ట్ లు. ఇతర భాషల్లో డైరెక్ట్ గా హీరో డబ్బింగ్ చెప్పి, ఆ వర్డ్స్ పర్ఫెక్ట్ గా పలికితే కొందరు తమ భాషకు రెస్పెక్ట్ ఇచ్చినట్టు ఫీల్ అవుతారని, కన్నడ, తమిళంలో ఇదే జరిగింది అంటున్నారు.
డైరెక్ట్ గా తమిళంలో వెట్రిమారన్ తో సినిమా కూడా ప్లాన్ చేసాడు. దేవర ప్రమోషన్స్ టైం లో ఇదే విషయాన్ని స్వయంగా ఎన్టీఆర్ చెప్పాడు. దీనితో డైరెక్టర్ వెట్రిమారన్ ఓ కథ కూడా రెడీ చేసుకునే పనిలో పడ్డారు. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ బాలీవుడ్ మీద గురి పెట్టాడు. వార్ 2 సినిమాలో నెగటివ్ రోల్ లో అక్కడ ల్యాండ్ అయ్యే ప్లాన్ చేసాడు. ఇప్పటికే ముంబైలో ఈ సినిమా షూట్ కూడా షురూ అయింది. ఎన్టీఆర్ తో యాక్షన్, చేజింగ్ సీన్స్ ని ప్లాన్ చేస్తున్నాడు డైరెక్టర్. అలాగే ఒక పాట కూడా షూట్ చేస్తున్నారు.
ఇక్కడ జరిగింది వింటే ఫ్యాన్స్ కు పూనకాలు వస్తాయి. డైరెక్టర్ అయాన్ ముఖర్జీ సీన్స్ లో కొన్ని డైలాగ్స్ ను ఎన్టీఆర్ కు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేసారట. సీన్ పేపర్స్ కూడా ఎన్టీఆర్ చేతిలో పెట్టాడట డైరెక్టర్. ఈ డైలాగ్ ఇలా కావాలి అలా కావాలి… అంటూ ఎన్టీఆర్ కు తన స్టైల్ లో వివరించే ప్రయత్నం చేస్తే… ఎన్టీఆర్ తన స్టైల్ లో తన మార్క్ వేరియషన్స్ తో హిందీ డైలాగ్స్ చెప్పడం విని అయాన్ ముఖర్జీ షాక్ అయ్యాడట. ఇక సీన్ ను ఎన్టీఆర్ ప్రాక్టీస్ కూడా చేయకుండా డైరెక్ట్ గా షూట్ లోకి వచ్చేయడం చూసి వార్ 2 యూనిట్ మైండ్ బ్లాక్ అయింది. ఇదెక్కడి మాస్ రా అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు అక్కడి జనాలు.