Trisha : బాబోయ్ టాలీవుడ్ టైర్ 2 హీరోల కంటే ఎక్కువే…

మెగా స్టార్ (Mega Star) విశ్వంభర (Vishwambhara)పై ఆడియెన్స్ లో ఉన్న ఎక్స్‌పెక్టేషన్స్ అన్నీ ఇన్నీ కావు. దాదాపు పది నెలల ముందే ఈ సినిమా సంక్రాంతి స్లాట్ ను బుక్ చేసుకుంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 1, 2024 | 02:15 PMLast Updated on: Apr 01, 2024 | 2:15 PM

Baboy Is More Than Tollywood Tier 2 Heroes

 

మెగా స్టార్ (Mega Star) విశ్వంభర (Vishwambhara)పై ఆడియెన్స్ లో ఉన్న ఎక్స్‌పెక్టేషన్స్ అన్నీ ఇన్నీ కావు. దాదాపు పది నెలల ముందే ఈ సినిమా సంక్రాంతి స్లాట్ ను బుక్ చేసుకుంది. ఈ సినిమాలో చిరు ముళ్లోకాలు చుట్టే మహా వీరుడిగా కనిపించనున్నట్లు సమాచారం. కేవలం టైటిల్ పోస్టర్ తోనే సినిమాపై ఎక్కడలేని అంచనాలు క్రియేట్ చేశాడు దర్శకుడు మల్లిడి వశిష్ట. రీ ఎంట్రీ తర్వాత అలాంటి హిట్టు కోసం ఎదురు చూస్తున్న చిరుకు విశ్వంభర అదే రేంజ్ హిట్ అయ్యేలా కనిపిస్తుంది.

గతేడాది వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ (Waltheru Veeraiah) కమర్షియల్ గా కోట్లు కొల్లగొట్టిన మెగా ఫ్యాన్స్ సైతం రిపీటెడ్ షోలు వేయలేకపోయారు. ఆ తర్వాత వచ్చిన ‘భోళా శంకర్’ (Bhola Shankar) అల్ట్రా డిజాస్టర్ కావడంతో మెగా ఫ్యాన్స్ బాధ అంతా కాదు. దాంతో చిరు సైతం కాస్త టైం తీసుకుని విశ్వంభరను పట్టా లెక్కించాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శర వేగంగా జరుగుతుంది. చిరుపై మాంటేజ్ సాంగ్ తెరకెక్కిస్తున్నారట. ఎట్టి పరిస్థితుల్లో సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేయాలని మేకర్స్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సినిమాలో త్రిష తో కలిపి మరో నలుగురు హీరోయిన్లు కనిపించనున్నారు. ఈ సినిమాలో త్రిష డ్యూయల్ రోల్ లో కనిపించనున్నట్లు సమాచారం. అందులో ఒకటి సాధారణ రోల్ అవగా, మరొక పాత్రలో దేవతగా కనిపించనుందట.

ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాను ఊపేస్తుంది.
అదేంటంటే.. ఈ సినిమా కోసం త్రిష 12 కోట్లు రెమ్యునరేషన్ తీసుకోబోతున్నట్లు టాక్ . టాలీవుడ్ టైర్ 2 హీరోల కంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకోవడం హాట్ టాపిక్ గా మారింది. నాలుగు పదుల వయసులోనూ త్రిష బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో చెలరేగిపోతుంది. గతేడాది దసరాకు రిలీజైన ‘లియో’ లో విజయ్ భార్యగా టెర్రిఫిక్ పర్ఫామెన్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ బ్యూటీ మరో తమిళ స్టార్ హీరో అజిత్ తో ‘విదాముయార్చి’ సినిమా చేస్తుంది. ఇవే కాకుండా మలయాళం లో మోహన్ లాల్ తో కలిసి ‘రామ్’ సినిమా చేస్తుంది. మణిరత్నం కమల్ హాసన్ కాంబోలో తెరకెక్కుతున్న ‘థగ్ లైఫ్’ సినిమాలోనూ త్రిష హీరోయిన్ గా నటిస్తుంది. యంగ్ హీరోయిన్ల పోటీగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ త్రిష తానేం తక్కువ కాదని నిరూపించుకుంటుంది.

విశ్వంభర విషయానికొస్తే.. సోషియో ఫాంటసీ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఒళ్లు జలదరించే వీఎఫ్ఎక్స్ కనిపించనున్నాయట. దాని కోసం హాలీవుడ్ టెక్నీషీయిన్లను రంగంలోకి దింపబోతున్నారు. పలు హాలీవుడ్ సినిమాలకు పనిచేసిన వీఎఫ్ఎక్స్ సంస్థలతో యూవీ క్రియేషన్స్ చర్చలు జరుపుతున్నారట. ఈ లోపు మల్లిడి వశిష్ట టాకీ పార్టు మొత్తం ఆర్నెళ్లలో కంప్లీట్ చేసి.. ఆపై నాలుగు నెలలు పోస్ట్ ప్రొడక్షన్ లను, ప్రమోషన్లు గ్రటా జరుపుకోవాలని ప్లాన్ చేసుకున్నాడట.