Baby Review: బొమ్మ బంబాట్‌.. బేబీ మూవీ రివ్యూ..

పేరుకు చిన్న సినిమా అయినా.. బేబీ పోస్టర్ మీద, మూవీ చుట్టూ చాలా పెద్ద పేర్లే వినిపించాయ్. పాటలు, ట్రైలర్ అద్భుతం అనిపించడంతో.. యూత్‌ ఆడియెన్స్‌లో బేబీ మూవీ మీద అంచనాలు పెరిగిపోయాయ్. ఆనంద్ దేవరకొండ హీరోగా.. యూట్యూబ్ స్టార్ వైష్ణవి చైతన్య హీరోయిన్‌గా తెరకెక్కిన ఈ మూవీ ఎలా ఉంది.. యువత మనసు గెలుచుకుందా.. అంచనాలు అందుకుందా..

dialtelugu author

Dialtelugu Desk

Posted on: July 14, 2023 | 02:50 PMLast Updated on: Jul 14, 2023 | 2:50 PM

Babu Movie Review Anand Devarakond And Caishnavi Chaitanya Starrer

స్టోరీ విషయానికి వస్తే.. స్కూల్‌ టైమ్‌ నుంచి హీరో, హీరోయిన్ ప్రేమలో ఉంటారు. హీరో టెన్త్ ఫెయిల్ అయి ఆటో నడుపుతుంటే.. పది దాటిన హీరోయిన్ పట్నంలో కాలేజీలో చేరుతుంది. ఆ తర్వాత ఇద్దరి జీవితాలు ఎలా మలుపు తిరిగాయ్. వీళ్ల జీవితాల్లోకి వచ్చిన పాత్రలు ఏంటి.. హీరో, హీరోయిన్ ఒక్కటయ్యారా లేదా అన్నదే మిగతా కథ. నిజానికి ప్రేమకథలా అనిపించినా.. ఇది ఓ అమ్మాయి బయోపిక్. మొద‌టి ప్రేమ‌కు మ‌ర‌ణం లేదు.. మ‌న‌సు పొర‌ల్లో శాశ్వతంగా స‌మాధి చేయ‌బ‌డి ఉంటుందని ట్రైలర్‌లోనే చెప్పిన డైరెక్టర్‌.. సెకండాఫ్‌లో కొన్ని ల్యాగ్‌ సీన్లు వదిలేస్తే.. పాయింట్‌ ఎక్కడా మిస్ కాకుండా మూవీని తెరకెక్కించాడు. ఫస్టాఫ్‌ ప్రజెంట్ యూత్‌ను టార్గెట్‌ చేస్తూ సీన్లు రాసుకున్నట్లు అనిపిస్తుంది. అక్కడక్కడా కొన్ని డైలాగ్స్‌.. బార్డర్ దాటినట్లు వినిపించినా.. ఆ తర్వాత పర్వాలేదులే అనిపిస్తుంది.

విజయ్ దేవరకొండ తమ్ముడిలా కాకుండా తనకంటూ ప్రత్యేకత కోసం ప్రయత్నాలు చేస్తున్న ఆనంద్‌ దేవరకొండ.. భగ్నప్రేమికుడిలా ఆకట్టుకున్నాడు. గత సినిమాలతో కంపేర్ చేస్తే ఆనంద్ యాక్టింగ్‌లో అద్భుతమైన మెచ్యూరిటీ కనిపిస్తుంది. ఈ సినిమాతో వైష్ణవి రూపంలో మరో తెలుగ‌మ్మాయి క‌థానాయిక‌గా మారింది. టిక్‌టాక్ వీడియోల‌తో ఫేమస్ అయన వైష్ణవికి ఇది తొలి సినిమా. వైష్ణవి పాత్రలో ఆమె న‌ట‌న‌కు మంచి మార్కులు పడతాయ్. అమాయకంగా, మొండిఘటంలా.. ఇలా ప్రతీ ఎక్స్‌ప్రెషన్‌ను చాలా పలికించింది. ఎమోషనల్ సీన్లతో ఏడిపించేసింది. మరో యాక్టర్ విరాజ్‌.. అందంగా కనిపించాడు. పాత్రకు ఎంత కావాలో అంత చేశాడు. ఇంటర్వెల్ సీన్.. సినిమాకే హైలైట్. డైరెక్టర్‌ కన్ను, రైటర్ పెన్ను మరింత షార్ప్‌గా పనిచేసింది అనిపించకుండా ఉండదు.

అమ్మాయిల ఫీలింగ్స్‌కు అద్దం పట్టే కథ ఇది. బయోపిక్ అనొచ్చు ఒకరకంగా ! బలంగా పోరాడలేం కావొచ్చు.. గుండెల మీద బలంగా కొట్టడంతో మమ్మల్ని మించిన వారు లేరు అని హీరోయిన్‌తో చెప్పించిన మాటలు ఆకట్టుకుంటాయ్. ప్రతీ మాటా టార్గెట్ ఆడియన్స్‌ను తాకుతుంది. ఇంటర్వెల్ కార్డు వేసిన‌ప్పుడు ఓర‌క‌మైన సంతృప్తితో ప్రేక్షకుడు థియేట‌ర్ల నుంచి బ‌య‌ట‌కు వ‌స్తారు. సెకండాఫ్‌లో స్టోరీ కాస్ పక్క దారి పట్టినా.. క్లైమాక్స్‌ వచ్చేసరికి తెలియకుండానే కళ్లు తడి అవుతాయ్. సంగీతం.. సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్ కాగా బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా సినిమా ఫీల్‌కు తగ్గట్లు మెప్పిస్తుంది. ఫస్టాప్‌లో బూతులు తగ్గించి.. సెకండాఫ్‌లో లెంగ్త్‌లు తగ్గించి ఉంటే.. సినిమా మరింత బాగుండేది. ఓవరాల్‌గా ఈ మధ్య వచ్చిన సినిమాల్లో.. డిఫరెంట్ ప్రయత్నం బేబీ. ప్రేమించిన వ్యక్తులతో ఈ సినిమా చూస్తే మరింత కిక్కు ఖాయం.

ఓవరాల్‌గా బేబీ మూవీకి మేమిచ్చే రేటింగ్‌.. 3/5