Bala Krishna: భగవత్‌ కేసరిగా బాలకృష్ణ.. #NBK108 టైటిల్‌ ఇదేనా..

ఆరు పదుల వయస్సులో కూడా యంగ్‌ హీరోస్‌కు పోటీ ఇస్తున్నాడు నటసింహం నందమూరి బాలకృష్ణ. వరుస హిట్స్‌తో దూసుకుపోతూ మంచి జోష్‌లో ఉన్నాడు. ఇప్పటికే ఆఖండ, వీరసింహా రెడ్డి సినిమాలతో బ్యాక్‌ టు బ్యాక్‌ హిట్లు కొట్టిన బాలయ్య.. ఇప్పుడు 108వ సినిమాతో హ్యాట్రిక్‌ కోసం ట్రై చేస్తున్నాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: June 2, 2023 | 01:20 PMLast Updated on: Jun 02, 2023 | 1:20 PM

Bala Krishna New Movie Bhagavath Kesrari

దీంతో ఈ సినిమాను చాలా ప్రెస్టీజియస్‌గా తీసుకున్నాడు డైరెక్టర్‌ అనిల్‌ రావిపూడి. ఫ్యామిలీ సినిమాలకు కేరాఫ్‌ అడ్రస్‌గా ఉండే అనిల్‌ రావిపూడి మొదటి సారి ఫుల్‌ లెంత్‌ యాక్షన్‌ సినిమా తీస్తున్నాడు. NBK108 వర్కింగ్‌ టైటిల్‌తో షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ సినిమాకు భగవత్‌ కేసరి అనే టైటిల్‌ ఫిక్స్‌ చేసినట్టుగా తెలుస్తోంది. రీసెంట్‌గా NBK108 సినిమాకు బ్రో, ఐ డోంట్‌ కేర్‌ టైటిల్స్‌ పరిశీలించారు. కానీ పవన్‌ కళ్యాణ్‌, సాయిధరమ్‌ తేజ్‌ కాంబోలో వస్తున్న వినోదయాసితం రీమేక్‌కు బ్రో అనే టైటిల్‌ ఫిక్స్‌ చేశారు. దీంతో ఆ టైటిల్‌ను వదిలేశాడు బాలకృష్ణ.

కథ పరంగా చూస్తూ ఐ డోంట్‌ కేర్‌ కంటే భగవత్‌ కేసరి అనే టైటిల్‌ బాగా సరిపోతుందని మేకర్స్‌ భావించారట. దీంతో ఇదే టైటిల్‌ను ఫైనల్‌ చేశారని సినీ వర్గాల్లో టాక్‌ నడుస్తోంది. దీనికి సంబంధించి అధికారికంగా త్వరలోనే ఎనౌన్స్‌మెంట్‌ విడుదల చేసే చాన్స్‌ ఉంది. ఈ నెల 10న బాలకృష్ణ బర్త్‌డే. ఆరోజు NBK108 సినిమాకు సంబంధించిన అప్‌డేట్‌ ఇస్తారు. అదే రోజు సినిమా టైటిల్‌ రివీల్‌ చేసే చాన్స్‌ ఉందని టాక్‌.

వరుసగా రెండు హిట్స్‌తో ఉన్న బాలయ్య ఈ సినిమాతో హ్యాట్రిక్‌ కొట్టేందుకు ప్లాన్‌ చేస్తున్నాడు. ఇక F3 లాంటి యావరేజ్‌ సినిమాతో డల్‌గా ఉన్న అనిల్‌ రావిపూడి ఈ సినిమాతో మంచి కంబ్యాక్‌ పొందేందుకు ప్రయత్నిస్తున్నాడు. దీంతో ఈ ప్రాజెక్ట్‌ వీళ్లిద్దరికీ కీలకంగా మారింది. బాలకృష్ణ 108వ సినిమాగా వస్తున్న ఈ సినిమా అటు బాలకృష్ణకు ఇటు అనిల్‌ రావిపూడికి ఎలాంటి రిజల్ట్‌ ఇస్తుందో చూడాలి.