Bala Krishna: జై తెలంగాణ అంటున్న చిరంజీవి, బాలయ్య .. క్యా సీన్ హై.. !
మెగాస్టార్ చిరంజీవి జైతెలంగాణ అంటున్నాడు. నటసింహం బాలయ్య కూడా జై తెలంగాణ అంటున్నాడు. నిజానికి జై బాలయ్య అనేది నటసింహం ఫ్యాన్స్ నినాదం. కాని ఇప్పుడు బాలయ్యే జై తెలంగాణ అంటున్నాడు. ఇదేదో పొలిటికల్ స్టేట్ మెంట్ కాదు. సినిమాలో తను మాట్లాడే డౌలాగ్స్ తాలూకు యాసకు సంబంధించిన స్టంట్.

Jai Telangana Dailuge in Movie
అనిల్ రావిపుడి మేకింగ్ లో తెరకెక్కుతున్న భగవతి కేసరిలో బాలయ్య కంప్లీట్ గా తెలంగాణ యాస మాట్లాడబోతున్నాడని ఎప్పటినుంచో ప్రచారం జరుగుతోంది. అదే నిజమని లీకై డిలీటైన వీడియోతో తేలుతోంది. అంతేకాదు ఫస్ట్ టైం ఒకేసారి చిరంజీవి, బాలయ్య ఇద్దరూ తెలంగాణ యాసలో ఒకేసారి పోటీ పడబతున్నారు
ఎందుకంటే చిరు శంకర్ దాదా తర్వాత మళ్లీ తెలంగాణ యాసని వాడబోయేది భోళా శంకర్ లోనేనట. ఆగస్ట్ 11 అనుకున్నమూవీ కాస్త దసరాకు వాయిదా పడుతోందట. అదే జరిగితే ఈ సారి దసరా పండక్కి దసరాలో నాని విసిరిన తెలంగాణ పంచులను మించిన పంచెస్ ని చిరు, బాలయ్య విసరబోతున్నారు. అది కూడా నైజాం యాసలో.. ఇది మాత్రం ఖచ్చితంగా తెలంగాణలో ఉన్న ఫ్యాన్స్ కి పండగ తెచ్చే అంశమే..