Bala Krishna: బాలయ్య ఫాన్స్ లో కొత్త టెన్షన్.. విగ్గు సెట్ ఆవుద్దో లేదోనని భయం

అభిమాన హీరో సినిమా నుంచి ఫస్ట్ లుక్‌ ఎప్పుడు వస్తుందా? అని ఫ్యాన్స్‌ వెయిట్ చేస్తారు. అయితే బాలయ్య అభిమానులు మాత్రం కాస్త భయపడతారు. ఈ భయమంతా ఫస్ట్ లుక్‌ వరకే. ఆతర్వాత దబిడిదిబిడే.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 27, 2023 | 07:00 PMLast Updated on: Mar 27, 2023 | 7:00 PM

Bala Krishna Tens About Hair Style

హీరో గ్రాండ్ గా కనిపించాలంటే.. ముందు విగ్‌ సెట్‌ అవ్వాలి. రజనీకాంత్‌లా అందరికీ అన్ని విగ్గులు కుదరవు. బాలయ్య దగ్గరకొచ్చేసరికి ఒక్కోసారి ఎబ్బెట్టుగా కనిపిస్తాయి. విగ్ సెట్‌ కాలేదని ఫ్యాన్స్‌ ఫీలయిన సందర్భాలు చాలా వున్నాయి. బోయపాటి సినిమాల్లో మాత్రమే బాలయ్య విగ్‌ పర్‌ఫెక్ట్‌గా వుంటుంది. ఆమధ్య రూరల్‌లో విగ్‌ భయపెట్టింది. ఈభయాన్ని అనిల్‌ రావిపూడి పోగొట్టాడు. విగ్‌ సెట్‌ అయితే బాలయ్య మూవీ సగం హిట్టేనంటారు అభిమానులు. ఈ విషయంలో అనిల్ రావిపూడి సక్సెస్‌ అయ్యాడు. వీరసింహారెడ్డి తర్వాత బాలయ్య అనిల్‌ దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఉగాది సందర్భంగా ఫస్ట్ లుక్ రిలీజ్‌చేశారు. ఇందులో బాలయ్య గెటప్‌ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంది. ‘ఈసారి మీ ఊహకు మించి’ అంటూ పోస్టర్‌ రిలీజ్‌ చేయగా.. సినిమా ఎలా వున్నా.. గెటప్‌ మాత్రం ఎక్స్‌పెక్టేషన్స్‌ను అందుకుంది.
ఈమధ్యకాలంలో బాలయ్య డ్యూయెల్ రోల్లో ఎక్కువ కనిపిస్తున్నాడు. ముందుగా ఓల్డ్‌ గెటప్‌ను రిలీజ్ చేసి హైప్‌ క్రియేట్‌ చేస్తున్నారు. ఇదే దారిలో అనిల్‌ రావిపూడి ఏజ్డ్‌ గెటప్‌ స్టిల్‌ రిలీజ్‌ చేశారంటున్నారు. వీరసింహారెడ్డిలో బాలయ్య చేసిన తండ్రి గెటప్‌కు ఫ్యాన్స్‌ ఫిదా అయిపోయారు. లెజెండ్‌.. అఖండ .. వీరసింహారెడ్డిలో ఏజ్డ్ గెటప్స్‌కు వచ్చిన రెస్పాన్సే మరోసారి రావడంతో చిత్ర యూనిట్‌ ఖుషీగా వుంది.
సినిమా దసరాకు రిలీజ్‌ అవుద్దీ ఈమధ్యనే హీరోయిన్‌గా కాజల్‌ ఎంట్రీ ఇవ్వగా.. ముఖ్య పాత్రలో కనిపించే శ్రీలీలపై కొన్ని సీన్స్ ఆల్రెడీ తీశారు. అఖండ.. వీరసింహారెడ్డి తర్వాత వరుసగా మూడోసారి తమన్‌ మ్యూజిక్‌ ఇస్తున్నాడు. బాలయ్యను కొత్తగా చూపిస్తూ.. తనదైన కామెడీ టింట్‌తో సినిమా వుంటుందని దర్శకుడు ముందు నుంచీ చెబుతున్నాడు. మీ ఊహకు మించి వుంటుందన్నట్టు.. గెటప్‌తో ఓకె అనిపించుకున్నాడు బాలయ్య.