Balagam: సినీ పరిశ్రమలో విషాదం.. బలగం నటుడు మృతి..

బలగం సినిమాలో సర్పంచ్‌ క్యారెక్టర్‌లో నటించిన నర్సింగం చనిపోయారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న నర్సింగం పరిస్థితి విషమించడంతో చనిపోయాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 5, 2023 | 06:37 PMLast Updated on: Sep 05, 2023 | 6:37 PM

Balagam Died Due To Health Issues

Balagam; చిన్న సినిమాగా రిలీజై సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిన బలగం సినిమా గురించి పెద్దగా చెప్పనక్కర్లేదు. భారీ బడ్జెట్‌ సినిమాలు కూడా క్రియేట్‌ చేయలేని వండర్స్‌ను వేణు వండర్స్‌ దర్శకుడిగా మారి క్రియేట్‌ చేశాడు. ఖండతరాలు దాటిన ఈ సినిమాకు అంతర్జాతీయ అవార్డులు కూడా వచ్చాయి.

మొదటి ప్రయత్నంలోనే ఇలాంటి సినిమా తీసిన వేణుకు వచ్చిన అభినందనలు అన్నీ ఇన్నీ కావు. ఈ సినిమాలో నటించిన ప్రతీ ఒక్కరూ సినిమాకు ప్రాణం పోశారు. అలాంటి టీం గురించి ఓ సాడ్ న్యూస్‌ చెప్పాడు దర్శకుడు వేణు. బలగం సినిమాలో సర్పంచ్‌ క్యారెక్టర్‌లో నటించిన నర్సింగం చనిపోయారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న నర్సింగం పరిస్థితి విషమించడంతో చనిపోయాడు. ఈ విషయాన్ని దర్శకుడు వేణు సోషల్‌ మీడియాలో పంచుకున్నాడు.

సినిమా షూటింగ్‌ టైంలో నర్సింగంతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఓ ఫొటో షేర్‌ చేశాడు. సినిమాలో కనిపించేది కొంతసేపే అయినా ప్రతీ ఒక్కరికీ గుర్తిండిపోయారు నర్సింగం. అలాంటి వ్యక్తి చనిపోయాడని తెలిసి అంతా షాకవుతున్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కామెంట్లు పెడుతున్నారు.