Balagam: ఆస్కార్ రేసులో బలగం..! ఏ సినిమాలు పోటీలో ఉన్నాయంటే..?
ఇప్పటివరకు 22 సినిమాలు అధికారిక ఎంట్రీకి వచ్చినట్లు టాక్. ఆ 22 సినిమాల్లో రెండు తెలుగు సినిమాలు కూడా ఉన్నాయ్. అవే బలగం, దసరా సినిమాలు. వీటీతో పాటుగా ది కేరళ స్టోరీ, గదర్ 2, రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహాని, జ్విగాటో, దీ స్టోరీ టెల్లర్ వంటి పలు సినిమాలు ఎంట్రీకి వెళ్లాయ్.
Balagam: ఆస్కార్ అంటే.. అమ్మో అనేది తెలుగు సినిమా ఇండస్ట్రీ నిన్నటివరకు. అది వచ్చేది లేదు.. మనం పోయేది లేదు అని.. సాధ్యమయ్యే పని కాదులే అని నిరుత్సాహంలో కనిపించేది. ఐతే ట్రిపుల్‌ఆర్.. అలాంటి నిరుత్సాహాన్ని ఒక్క దెబ్బతో బద్దలు కొట్టింది. ఆస్కార్ గెలిచి.. తెలుగోడి సత్తాను ప్రపంచానికి చాటి చెప్పింది. ట్రిపుల్‌ఆర్‌లోని నాటు నాటు సాంగ్‌కు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ అవార్డు వరించింది. అవార్డు రాకతో తెలుగు ప్రేక్షకుల సంతోషం అంతా ఇంతా కాదు.
ట్రిపుల్ ఆర్ ఇచ్చిన ఊపుతో పలువురు దర్శక, నిర్మాతలు తమ సినిమాలను ఆస్కార్ రేంజ్‌లో ప్లాన్ చేస్తున్నారు. ఇక వచ్చే ఏడాది జరిగే ఆస్కార్ కోసం ఇప్పటి నుంచే సినిమాల ఎంపిక కోసం కసరత్తులు చేస్తున్నారు. ఇప్పటివరకు 22 సినిమాలు అధికారిక ఎంట్రీకి వచ్చినట్లు టాక్. ఆ 22 సినిమాల్లో రెండు తెలుగు సినిమాలు కూడా ఉన్నాయ్. అవే బలగం, దసరా సినిమాలు. వీటీతో పాటుగా ది కేరళ స్టోరీ, గదర్ 2, రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహాని, జ్విగాటో, దీ స్టోరీ టెల్లర్ వంటి పలు సినిమాలు ఎంట్రీకి వెళ్లాయ్. ప్రముఖ ఫిల్మ్ మేకర్ గిరీష్ కాసరవల్లి నేతృత్వంలో.. 17మంది సభ్యులతో కూడిన ఆస్కార్ కమిటీ.. చెన్నై వేదికగా ఆస్కార్ ఎంట్రీ కోసం దరఖాస్తు చేసుకున్న సినిమాలను చూస్తోంది. బలగం, జ్విగాటో, విడుదలై 1 సినిమాల్లో ఒకటి ఆస్కార్ ఎంట్రీ సాధించే చాన్స్ అధికంగా ఉందని తెలుస్తోంది.
మరి ఈసారి ఆస్కార్స్‌కు భారత్ నుంచి ఏ సినిమాను పంపుతారో చూడాలి. ఇక ఈ మధ్యనే జవాన్ దర్శకుడు అట్లీ.. ఓ సందర్భంలో ఆస్కార్‌కు జవాన్ సినిమా కూడా నామినేషన్‌కు పంపే ఆలోచినలో ఉన్నామని చెప్పి ట్రోలర్ రాయుళ్లకు టార్గెట్ అయ్యాడు. కమర్షియల్ సినిమాను అకాడమీ అవార్డులకు పంపి ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారని నెటిజన్లు గట్టిగానే ట్రోల్స్ చేశారు. ఇక రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహాని సినిమా కూడా ఏ విధంగా ఆలోచించి ఆస్కార్ ఎంట్రీకు రెడీ చేశారని పలువురు నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.