బోయపాటి మాస్, బాలయ్యకు విలన్ గా టాలీవుడ్ హీరో

నట సింహం నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఒక సినిమా వస్తుంది అంటే చాలు ఆ సినిమాకు క్రియేట్ అయ్యే హైప్ అంతా ఇంతా కాదు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: September 9, 2024 | 05:33 PMLast Updated on: Sep 09, 2024 | 5:33 PM

Balakrishna Akhanda Sequel Latest Update

నట సింహం నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఒక సినిమా వస్తుంది అంటే చాలు ఆ సినిమాకు క్రియేట్ అయ్యే హైప్ అంతా ఇంతా కాదు. వీరి కాంబినేషన్ లో వచ్చిన మూడు సినిమాలు సూపర్ హిట్ కావడంతో ఇప్పుడు రాబోయే నాలుగో సినిమాపై కూడా అంచనాలు భారీగా ఉన్నాయి. వీరి కాంబినేషన్ లో మూడేళ్ళ క్రితం విడుదలైన అఖండ సినిమా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. అక్కడి నుంచి బాలకృష్ణ వరుస హిట్ లు కొడుతూ యంగ్ హీరోలకు సవాల్ చేస్తున్నారు.

ఇప్పుడు ఆయన బాబీ దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది లేదా ఈ ఏడాది చివర్లో ఈ సినిమా విడుదల అయ్యే అవకాశం ఉంది. ఇదిలా ఉంచితే ఇప్పుడు బోయపాటి శ్రీనుతో చేయబోయే అఖండ సీక్వెల్ విషయంలో బాలయ్య కాస్త సీరియస్ గానే ఉన్నారట. అఖండ 2 హిట్ కొడితే కొన్ని లెక్కలు సరిచేయవచ్చని బాలయ్య భావిస్తున్నారు. అందుకే బోయపాటి శ్రీను కూడా సీరియస్ ఫోకస్ పెట్టారు. ఈ సినిమాలో విలన్ గా హీరో గోపిచంద్ ని ఎంపిక చేసాడు బోయపాటి. దీనికి సంబంధించి చర్చలు కూడా పూర్తయ్యాయి.

ఈ సినిమా కోసం గోపిచంద్ ని గడ్డం కూడా పెంచాలని బోయపాటి చెప్పారట. ఇందులో గోపిచంద్ గుండుతో కనపడే అవకాశం ఉంది. కెరీర్ మొదట్లో గోపిచంద్ విలన్ గా బాగా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. హీరో అయిన తర్వాత ఆయనకు అంతగా కెరీర్ సాఫీ గా కనపడటం లేదు అనే మాట వాస్తవం. విలన్ గా చేయాలని ఫ్యాన్స్ కూడా కోరుకుంటున్నారు. ఇప్పుడు బాలయ్య సినిమాలో విలన్ అంటే… గోపిచంద్ కెరీర్ కి కచ్చితంగా హెల్ప్ అవుతుంది. అందుకే గోపిచంద్ విలన్ పాత్ర కోసం సిద్దం అవుతున్నాడట.