Balaiah: జూన్ 10 నుంచి బాలయ్య బోయపాటి పొలిటికల్ మూవీ.. జగనే టార్గెట్..!

హ్యాట్రిక్‌ కాంబినేషన్‌ రిపీట్ అవుతోంది. బాలకృష్ణ, బోయపాటి కలయికలో నాలుగో సినిమా జూన్ 10 న స్టార్ట్ అవుతోంది. పొలిటికల్‌ డ్రామాగా తెరకెక్కే ఈ సినిమా 2024 ఎలక్షన్స్‌ ముందు రిలీజయ్యేలా ప్లాన్‌ చేస్తున్నారు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 20, 2023 | 05:15 PMLast Updated on: Mar 20, 2023 | 5:15 PM

Balakrishna Boyapati Special Political Movie

సింహా.. లెజెండ్‌.. అఖండ. బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్‌లో అన్నీ హిట్సే. వీళ్ల కలయికలో నాలుగో సినిమా ఎనౌన్స్‌ చేయాలేగానీ.. నందమూరి ఫ్యాన్స్‌ ఎగిరి గంతేస్తాడు. అభిమానుల్లోనే కాదు.. ఈ హ్యాట్రిక్‌ కాంబినేషన్‌పై అందరిలో ఆసక్తే. అఖండకు సీక్వెల్‌ వుంటుందని బోయపాటి చెప్పడంతో.. నాలుగో సినిమాగా అఖండ2 తీస్తారనుకున్నారంతా. అయితే ఈ సీక్వెల్‌ ఇప్పట్లో వుండదు. అఖండలో బాలయ్యను అఘోరా పాత్రలో చూపించిన బోయపాటి.. ఈసారి పొలిటికల్‌ లీడర్‌గా చూపిస్తాడట. బాలయ్య బర్త్డే సందర్భంగా జూన్‌ 10 సినిమాను మొదలుపెట్టి 2024 సంక్రాంతికి లేదంటే.. ఏప్రిల్లో సినిమా రిలీజ్‌ చేస్తారు.

బాలకృష్ణ, బోయపాటి కాంబోలో వచ్చిన గత మూడు సినిమాలో అక్కడక్కడ పొలిటికల్‌ పంచ్‌లున్నాయి. లెజెండ్‌ ప్రీ క్లైమాక్స్‌లో ఓ 10 నిమిషాలపాటు పొలిటికల్‌ సీనే పెట్టాడు దర్శకుడు. నెక్ట్స్‌ ప్రాజెక్ట్‌ సినిమా కథ మొత్తం పాలిటిక్స్‌ చుట్టూ తిరుగుతోంది. వీరసింహ రెడ్డి లో బాలయ్య జగన్ సర్కార్ టార్గెట్ గా బాగానే డైలాగ్స్ వేసాడు. బాలకృష్ణ ఫ్యాక్షన్‌బ్యాక్డ్రాప్‌లో చాలా సినిమాల్లో నటించినా.. ఔట్‌ అండ్‌ ఔట్‌ పొలిటికల్‌ బ్యాక్‌డ్రాప్‌లో యాక్ట్ చేయలేదు. ఆలోటును బోయపాటి ఇప్పుడు తీర్చనున్నాడు.
బోయపాటి సినిమాకూ ఒకట్రెండేళ్లు తీసుకుంటాడు.

ఈసారి అలా తీసుకుంటే.. 2024 ఎలక్షన్స్‌ ముందు సినిమాను రిలీజ్‌ చేయలేరు. బోయపాటి ప్రస్తుతం రామ్‌ సినిమాతో బిజీగా వున్నా.. మరోవైపు బాలయ్య కోసం పొలిటికల్‌ స్టోరీ రెడీ చేస్తున్నాట. లెజెండ్, అఖండకు మాటలు రాసిన ఎం.రత్నం ఈ పొలిటికల్ మూవీకి డైలాగ్స్‌ రాయ బోతున్నాడు. రాజకీయాలే లక్ష్యంగా తయారవుతున్న ఈ కథ ఎన్ని వివాదాలు సృష్టిస్తుందో మరి.