కో అంటే కోట్ల కార్లు… 2 కోట్లు.. 3 కోట్లు.. 5 కోట్ల కార్లు…
నటసింహం బాలయ్య కో అంటే రెండు కోట్ల కారొచ్చింది. తన ఢాకూ మహారాజ్ హిట్ విషయంలో తెగ ఖుషీ అయిన బాలయ్య తమన్ కి 2 కోట్ల కారుకొనిచ్చాడు. సినిమా సక్సెస్ లో తమన్ మ్యూజిక్ ఎంత మ్యాజిక్ చేసిందో తెలిసే, ఇలా నటిసింహం భారీ కానుక ఇచ్చాడట.

నటసింహం బాలయ్య కో అంటే రెండు కోట్ల కారొచ్చింది. తన ఢాకూ మహారాజ్ హిట్ విషయంలో తెగ ఖుషీ అయిన బాలయ్య తమన్ కి 2 కోట్ల కారుకొనిచ్చాడు. సినిమా సక్సెస్ లో తమన్ మ్యూజిక్ ఎంత మ్యాజిక్ చేసిందో తెలిసే, ఇలా నటిసింహం భారీ కానుక ఇచ్చాడట. ఇదే కాదు ఇంకా అఖండ 2 కూడా తెరకెక్కబోతోంది… ఆ ఆల్బమ్ కూడా బాగా వచ్చింది కాబట్టే, అలా కూడా తన సంతోషాన్ని ఇలా గిఫ్ట్ రూపంతో తెలిసేలా చేశాడంటున్నారు. విచిత్రం ఏంటంటే ఢాకూ మహారాజ్ హిట్టైన ఇన్నిరోజులకు, ఆ సినిమాలో దబిడి దిబిడి సాంగ్ ఇంటర్నేషనల్ లెవల్లో ఇప్పుడు హాడావిడిచేస్తోంది. జపాన్ లో ఈ పాట మారుమోగుతోంది. ఏదేమైనా బాలయ్య కార్ గిఫ్ట్ ఇండస్ట్రీలో అందరికి షాక్ లా మారింది. బేసిగ్గా హిట్ వస్తే దర్శకుడికి, నిర్మాత గిఫ్ట్ ఇవ్వటం కామన్. ఇక్కడ హీరో వచ్చిన మ్యూజిక్ డైరెక్టర్ కి అది కూడా 2 కోట్ల పోర్షే కారివ్వటం షాకింగ్ న్యూస్.. ఇలాంటి పది షాకింగ్ గిఫ్టులు టాలీవుడ్ లోనే ఇచ్చుకోవటం, పుచ్చుకోవటం జరిగింది. తమిల్, హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా ఇలా జరగలేదు. ఒక్కో కారు 75 లక్షల నుంచి 4 కోట్ల వరకుంటుంది. అలాంటి గిఫ్టులకు టాలీవుడ్ అడ్డా అయిపోయింది.
నటసింహం బాలయ్య 2 కోట్లు ఖర్చు పెట్టి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కి పోర్షే కార్ కొనివ్వటం హాట్ టాపికైంది. ఆ వీడియో వైరలైంది. తన ఢాకూ మహారాజ్ పాటలు తూటాల్లా పేలటానికి తమన్ మ్యూజిక్కే కారణం, వీరసింహారెడ్డి పాటలు ఇలానే తూటాల్లా మార్చాడు. త్వరలో సెట్స్ పైకెళుతున్న అఖండ 2 కి కూడా మ్యూజిక్ తనే కంపోజ్ చేస్తున్నాడు. ఆల్రెడీ ఆల్బమ్ రెడీ చేశాడు.అవన్నీ, నచ్చే ఇలా తమన్ మీద ప్రేమ కురిపిస్తున్నాడు బాలయ్య. ఐతే బేసిగ్గా ఓ మూవీ హిట్టైతే నిర్మాతే, దర్శకుడికో, హీరోకో ఇలాంటి కాస్ట్ లీ కార్లు కొనివ్వటం కామన్. కాని ఇక్కడ సీన్ లో ఉంది బాలయ్య… కోపం వచ్చినా, ప్రేమ వచ్చినా ఇలానే ఉంటుందనంటున్నారు. సోషల్ మీడియాలో అభిమానం తో కూడిన జోకులు పెంచారు.ఇలాంటి టైంలో బాలయ్య దబిడి దిబిడి సాంగ్ విదేశాల్లో వైరల్ అయ్యింది. జపాన్ అమ్మాయిలు ఈ పాటకి పర్ఫెక్ట్ డాన్స్ చేసి పెట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరలైంది. మొత్తానికి బాలయ్య సినిమాలకు పూనకాలొచ్చేలా పాటలు కంపోజ్ చేసి, చేసి, తను కూడా నందమూరి తమన్ గా మారిపోయాడన్న కాంప్లిమెంటే, నిజమయ్యేలా ఉంది.
ఇక ఇండస్ట్రీలో ఇలా హిట్ వచ్చినప్పుడు, మనసుకి నచ్చే పని సినీ నటులు, లేదంటే దర్శకు చేసినప్పుడు
ఇలా కార్లు గిఫ్టివ్వటం చూశాం. కాని ఈ ట్రెండ్ టాలీవుడ్ లోనే కనిపిస్తోంది. మొన్నామధ్య నితిన్ కూడా తనకి భీష్మతో హిట్ పడేలా చేశాడని సంతోషంతో, డైరెక్టర్ వెంకీ కుడుములకు 2 కోట్ల విలువ చేసే రేంజ్ రోవన్ ని గిఫ్ట్ గా ఇచ్చాడు.ఇక ఎన్టీఆర్ తో మూవీ ప్లాన్ చేసి, చరణ్ తో పెద్ద మూవీ తీస్తున్న ఉప్పెన డైరెక్టర్ బుచ్చి బాబుకి, మైత్రీ మూవీమేకర్స్ 75 లక్షలు విలువచేసే మెర్సిడేజ్ బెంజ్ గిఫ్ట్ గా ఇచ్చారు. రెబల్ స్టార్ ప్రభాస్ తో ది రాజా సాబ్ తీస్తున్న మారుతికి కూడా ప్రతీ రోజు పండగ మూవీ హిట్ టైంలో కోటిన్నర విలువ చేసే రేంజ్ రోవర్ ని గిఫ్ట్ చేశాడు ఈ సినిమా ప్రొడ్యూసర్.
ప్రభాస్ అయితే తన జిమ్ తాలూకు పర్సనలై ట్రైనలర్ కి 85 లక్షలు విలువ చేసే రేంజ్ రోవర్ ని ఇస్తే, శ్రీమంతుడు లాంటి హిట్ ఇచ్చాడని కొరటాల శివకి రెంుడన్నర కొట్టు విలువచేసే ఆడికార్ ని బహుమతిగా ఇచ్చాడు మహేశ్ బాబు.. ఇలాకో అంటే కోట్లు విలువ చేసే కార్లని గిఫ్ట్ గా ఇచ్చే కల్చర్ మాత్రం టాలీవుడ్ కే పరిమితం. మరెక్కడాల లేదు.. అందుకే ఇలా ఎవరు ఎవరికి కారు గిఫ్ట్ ఇచ్చినా నేషనల్ లెవల్లో వార్తగా మారిపోతుంది.