విజయశాంతి అంటే ఇష్టం, లవ్ లెటర్ రాసా, వసుంధర ముందే ఓపెన్ అయిపోయిన బాలయ్య

నట సింహం నందమూరి బాలకృష్ణకు నాకు పద్మభూషణ్ అవార్డు రావడంతో నందమూరి నారా కుటుంబాలు చాలా సంతోషంగా ఉన్నాయి. బాలకృష్ణ సినీ పరిశ్రమకు చేసిన సేవలకు గాను ఆయనకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల పద్మభూషణ అవార్డు ప్రకటించింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 3, 2025 | 01:19 PMLast Updated on: Feb 03, 2025 | 1:19 PM

Balakrishna Comments On Vijayshanthi

నట సింహం నందమూరి బాలకృష్ణకు నాకు పద్మభూషణ్ అవార్డు రావడంతో నందమూరి నారా కుటుంబాలు చాలా సంతోషంగా ఉన్నాయి. బాలకృష్ణ సినీ పరిశ్రమకు చేసిన సేవలకు గాను ఆయనకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల పద్మభూషణ అవార్డు ప్రకటించింది. దీనితో నందమూరి నారా కుటుంబాలు హైదరాబాదులో ఒక పార్టీ ఘనంగా నిర్వహించాయి. ఈ పార్టీలో బాలయ్యతో పాటుగా ఆయన అక్క చెల్లెలు ఇద్దరు పాల్గొన్నారు. దగ్గుబాటి పురందరేశ్వరి అలాగే నారా భువనేశ్వరి ఇద్దరూ కలిసి బాలయ్యను పలు ప్రశ్నలు వేశారు. బాలయ్య సినిమా కెరియర్ గురించి అలాగే పర్సనల్ లైఫ్ గురించి కూడా ఇందులో ఇంట్రెస్టింగ్ ప్రశ్నలు అడిగారు.

తన భార్య వసుంధరను మొదటిసారి ఎక్కడ చూసావ్ అని పురందరేశ్వరి అడగగా తన తండ్రి ఎన్టీఆర్ వైట్ హౌస్ దగ్గర కొత్త ఇంటికి భూమి పూజ చేసిన రోజు తొలిసారి చూశానని ఆ రోజు రిడ్జ్ లో ఉన్నానని చెప్పగా మధ్యలో పురందరేశ్వరి జోక్యం చేసుకొని అంటే ఎప్పుడు చూసావు గుర్తులేదు అంటూ ఆటపట్టించారు. ఇక పురందరేశ్వరి మరో ప్రశ్న అడిగారు ఏ రిలేషన్ షిప్ లో అయినా మొహమాటానికి కొన్ని చేస్తుంటామని నీకు ఇప్పుడు పద్మభూషణ్ అవార్డు వచ్చింది అది ఎందుకు వచ్చింది 40 ఏళ్లకు పైగా వసుంధర తో డిప్లమాటిక్గా నటించినందుకా సినిమాల్లో నటించినందుకా.. క్లారిటీ రావాలని ప్రశ్నించారు.

దీనికి బాలయ్య స్పందిస్తూ వసుంధర తన లక్కీ వైఫ్ అని ఆవిడ నన్ను భరించినందుకు.. మూడోసారి హిందూపురం ఎమ్మెల్యేగా గెలిచినందుకు ఆఫీస్ స్క్రీన్ ఆన్ స్క్రీన్ నటించినందుకు అవార్డు వచ్చిందనుకుంటున్న అంటూ బాలయ్య కామెంట్ చేశారు. ఇక వసుంధరను చూసిన వెంటనే నీ రియాక్షన్ ఏంటి అని అడగగా బాలయ్య వెంటనే ఓకే చేసేసాను అని సమాధానం ఇచ్చారు సమయం కావాలని కొంచెం ఆలోచించుకొని చెబుతానని అనలేదని వెంటనే ఓకే చేశానని చెప్పుకురాగా దానికి పురందరేశ్వరి జోక్యం చేసుకొని చాలా రోజులు సమాధానం చెప్పలేదని నాన్నగారు తనని పిలిచి అడిగారని నువ్వు వెళ్లి బాలయ్యను కనుక్కో విషయం ఏంటని అన్నారని అప్పుడు తాను నీతో కూర్చుని మాట్లాడాను నాకు బాగా గుర్తు ఉందంటూ సమాధానం ఇచ్చారు.

ఇక భువనేశ్వరీ మాట్లాడుతూ మీ మొదటి క్రష్ ఎవరు హీరోయిన్లలో నచ్చింది ఎవరు అని అడగగా అందాన్ని చూసి ఆనందించు కళాదృష్టి మాకు లేకపోలేదు అంటూ సమాధానం ఇచ్చారు ఇక తనకు బాగా ఇష్టమైన హీరోయిన్లు విజయశాంతి రమ్యకృష్ణ సిమ్రాన్ అంటూ బాలయ్య సమాధానం ఇచ్చారు.. మీరు ఎవరికైనా లవ్ లెటర్ రాశారా అని భువనేశ్వరి అడగగా వసుంధర కి రాశాను అప్పుడు ఏదో గిఫ్ట్ కూడా ఇచ్చింది అని గుర్తు చేసుకున్నారు ఇక వసుంధర మాట్లాడుతూ తానేమి గిఫ్ట్ ఇవ్వలేదని ఆయనే డ్రెస్ తీసుకుని ఓ చిన్న లవ్ లెటర్ తో ఇచ్చారని అది ఎప్పటికీ భద్రంగా దాచుకున్న అంటూ గుర్తు చేసుకున్నారు.