టాలీవుడ్ లో ఇప్పుడు సంక్రాంతి సినిమాల హడావుడి ఎక్కువగా నడుస్తోంది. స్టార్ హీరోలు సినిమాలు వరుసగా రిలీజ్ అవుతూ సంక్రాంతి వేడి పెంచేస్తున్నాయి. గత రెండు మూడు నెలల నుంచి భారీ బడ్జెట్ సినిమాల డామినేషన్ మన తెలుగులోనే కాదు పాన్ ఇండియా లెవెల్ లో కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు సంక్రాంతి కానుకగా తెలుగులో మూడు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఈ మూడు సినిమాలకు సంబంధించిన సాంగ్స్ అలాగే ట్రైలర్లు ఒక్కొక్కటి విడుదల చేస్తున్నారు మేకర్స్. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ అనే సినిమాతో ప్రేక్షకులు ముందుకు వస్తున్నాడు. దీనికి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ అయింది. ఆ ట్రైలర్ కు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వచ్చింది. మాస్ ఆడియన్స్ కు ట్రైలర్ బాగా నచ్చేసింది. ఇక నందమూరి బాలకృష్ణ డాకు మహారాజ్ సినిమా కూడా సంక్రాంతి కానుక గానే రిలీజ్ కానుంది. ఆ తర్వాత వెంకటేష్ సినిమా సంక్రాంతి వస్తున్నాం కూడా రిలీజ్ అవుతుంది. ఇక లేటెస్ట్ గా బాలకృష్ణ సినిమాలో దబిడి దిబిడే అనే సాంగ్ రిలీజ్ చేశారు. ఈ సాంగ్ లో మాస్ ఆడియన్స్ ను ఎట్రాక్ట్ చేసే విధంగా కొన్ని స్టెప్పులు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశాడు. అయితే హీరో హీరోయిన్ల స్టెప్పులు చూసి ఆడియన్స్ బూతులు తిడుతున్నారు కూడా. పుష్ప సినిమాలో కూడా కొన్ని స్టెప్పులు ఇలాగే చిరాకుగా ఉన్నాయి. రవితేజ హీరోగా వచ్చిన మిస్టర్ బచ్చన్ సినిమాలో సీతారా అనే పాటలో కూడా ఇలాగే అభ్యంతరకరమైన స్టెప్పులు ఉన్నాయి. మాస్ ఆడియన్స్ ను ఎట్రాక్ట్ చేసే విధంగా స్టెప్పులు ఉంటే తప్పులేదు కానీ అవి చూడటానికి చిరాగ్గా ఉంటేనే సమస్య. స్టార్ హీరోకు అటువంటి కొరియోగ్రఫీ చేయడం కరెక్ట్ కాదంటూ శేఖర్ మాస్టర్ పై సోషల్ మీడియాలో ఫైర్ అవుతున్నారు ఆడియన్స్. ఈ మధ్యకాలంలో క్లాస్ ఆడియన్స్ ఎక్కువయ్యారు కాబట్టి సినిమాలు డీసెంట్ గా ఉంటే మంచి రిజల్ట్ ఉంటుంది. సాంగ్స్ విషయంలో కూడా గతంలో మాదిరిగా మాస్ సాంగ్స్ ఇష్టపడటం లేదు. మెలోడీ సాంగ్స్ లేదంటే సాంగ్ లో అర్థం ఉంటే మాత్రమే చూస్తున్నారు. ఇక డాన్స్ విషయంలో కూడా పక్కాగా ఉంటున్నారు ఆడియన్స్. అందుకే కొంతమంది డైరెక్టర్లు అసలు సినిమాల్లో సాంగ్స్ లేకుండానే కంప్లీట్ చేసే పరిస్థితి ఉంది. సాంగ్స్ పెట్టినా... ఒకటి రెండు సాంగ్స్ మాత్రమే ఉంటున్నాయి. కాబట్టి కొరియోగ్రఫీ చేసే వాళ్ళు అలాగే సినిమా డైరెక్ట్ చేసే వాళ్ళు, మ్యూజిక్ డైరెక్టర్లు కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలని అనవసరంగా ట్రోలింగ్ అయి సినిమా చూసే ఆడియన్స్ కు వల్గర్ గా ఉంటాయని.. వసూళ్లు కూడా తగ్గే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఉండాలంటూ వార్నింగ్ ఇస్తున్నారు.[embed]https://www.youtube.com/watch?v=5WClOA2k3gU[/embed]