నందమూరి నరసింహ బాలకృష్ణ సినిమాలకు ఇప్పుడు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. అఖండ సినిమా తర్వాత నుంచి హిట్ ట్రాక్ లోకి అడుగుపెట్టిన బాలకృష్ణ అక్కడి నుంచి కథల విషయంలో చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. ప్రతి సినిమాను పక్కా ప్లానింగ్ తో మాస్ ఆడియన్స్ తో పాటుగా క్లాస్ ఆడియన్స్ కు కూడా దగ్గర అయ్యేవిధంగా సినిమాలు చేస్తున్నారు బాలయ్య. రీసెంట్ గా వచ్చిన డాకు మహారాజ్ సినిమా సూపర్ హిట్ కావడంతో బాలకృష్ణ ఫుల్ జోష్లో ఉన్నారు. డైరెక్టర్ బాబి కొల్లి సినిమా కథ విషయంలో స్క్రీన్ ప్లే విషయంలో తను అనుకున్నది చేయడంతో సినిమా సూపర్ హిట్ అయింది. ఇక నిర్మాతలకు కూడా ఈ సినిమా భారీ లాభాలు తెచ్చి పెడుతోంది. గతంలో బాలకృష్ణ సినిమాలు కనీసం బ్రేక్ ఈవెన్ కూడా అయ్యేవి కాదు. కానీ ఇప్పుడు మాత్రం భారీ లాభాలు రావడంతో నిర్మాతలు పోటీలు పడుతున్నారు. ఇదే టైంలో అఖండ సినిమాకు సీక్వెల్ కూడా వస్తోంది. ఈ సినిమా విషయంలో కూడా బాలయ్య చాలా జాగ్రత్తగా స్టెప్స్ వేస్తున్నాడు. అఖండ సినిమాను అత్యంత గ్రాండ్ గా రిలీజ్ చేసిన మేకర్స్ అఖండ 2 విషయంలో కూడా అదే ప్లానింగ్ తో దిగుతున్నారు. ఈ సినిమాకు భారీ బడ్జెట్ కూడా కేటాయించుకుని పెట్టుబడి పెడుతున్నారు. అందుకే షూటింగ్ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా ప్రతి ఒక్కటి తామనుకున్నది చేస్తున్నారు. అఖండ సీక్వెల్ ను గ్రాండ్ గా చూపించడానికి ఏకంగా ఉత్తర్ ప్రదేశ్ లోని ప్రయాగ్రాజ్ వెళ్లారు మూవీ యూనిట్. 144 ఏళ్లకు ఒకసారి వచ్చే మహా కుంభమేళాలో అఖండ సీక్వెల్ షూటింగ్ జరుగుతోంది. ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన ఆధ్యాత్మిక కార్యక్రమంగా పేరున్న మహా కుంభమేళాకు దాదాపు 40 కోట్ల మంది భక్తులు హాజరవుతారని అంచనా వేసుకుంటున్నారు. భారీగా నాగ సాధువులు కూడా కుంభమేళాకు చేరుకునే అవకాశం ఉంది. అలాంటి ప్రదేశంలో ఈ సినిమా షూటింగ్ చేయాలనుకోవడం మాత్రం కచ్చితంగా ఒక సెన్సేషన్ అనే చెప్పాలి. త్రివేణి సంగమం వద్ద భారీగా నాగ సాధువులు చేరుకోవడంతో వారి వద్దనే షూటింగ్ చేయాలని బాలయ్య కూడా ఇంట్రెస్ట్ చూపించడంతో డైరెక్టర్ బోయపాటి ఏమాత్రం ఆలస్యం చేయకుండా సినిమా షూటింగ్ ను అక్కడ మొదలు పెట్టేసారు. ఈ విషయాన్ని అధికారికంగా సోషల్ మీడియాలో ప్రకటించింది మూవీ యూనిట్. అఖండ సినిమా తర్వాత నుంచి బాలయ్య సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టారు. గతంలో కంటే ఆయన సినిమాలు చాలా డిఫరెంట్ గా ఉండటంతో ఆడియన్స్ కూడా ఎంజాయ్ చేస్తున్నారు. అందుకే అఖండ సీక్వెల్ విషయంలో బోయపాటి కూడా చాలా జాగ్రత్తగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో భారీ యాక్షన్ సీన్స్ ను ప్లాన్ చేసారు.[embed]https://www.youtube.com/watch?v=foOVDixPUFs[/embed]