బాలయ్య సభలో చిరు… అబ్బాయ్ కి బాబాయ్ పిలుపు…
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, నటసింహం బాలయ్య.. ఈ బాబాయ్ కి ఆ అబ్బాయ్ చాలా ఇష్టం. కాని మధ్యలో కాస్త గ్యాప్ వచ్చిందనే అభిప్రాయం కలిగేలా పరిస్థితులు కనిపించాయి. కాని జై బాలయ్య అనకుండా ఎన్టీఆర్ ఎప్పుడూ ఉండలేదు.. ఈ అబ్బాయ్ మంచిని కోరకుండా బాబాయ్ గా బాలయ్య ఎప్పుడూ వెనకడుగు వేయలేదు. ఈ డిస్కర్షన్ కి కారణం ఏంటంటే, బాలయ్యకి రీసెంట్ గా పద్మ భూషణ్ అవార్డు ఎనౌన్స్ చేశారు.
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, నటసింహం బాలయ్య.. ఈ బాబాయ్ కి ఆ అబ్బాయ్ చాలా ఇష్టం. కాని మధ్యలో కాస్త గ్యాప్ వచ్చిందనే అభిప్రాయం కలిగేలా పరిస్థితులు కనిపించాయి. కాని జై బాలయ్య అనకుండా ఎన్టీఆర్ ఎప్పుడూ ఉండలేదు.. ఈ అబ్బాయ్ మంచిని కోరకుండా బాబాయ్ గా బాలయ్య ఎప్పుడూ వెనకడుగు వేయలేదు. ఈ డిస్కర్షన్ కి కారణం ఏంటంటే, బాలయ్యకి రీసెంట్ గా పద్మ భూషణ్ అవార్డు ఎనౌన్స్ చేశారు. వెంటనే ఇండస్ట్రీ మొత్తం తనని అభినందిస్తూ ట్వీట్లు చేసింది. ఇక బాలా బాబాయ్ కంగ్రాట్స్ అంటూ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ కూడా సోషల్ మీడియాలో తమ సంతోషాన్ని వ్యక్త పరిచారు. కట్ చేస్తే, ఇప్పుడు స్టేజ్ మీద ఈ అభినందన కార్యక్రమం జరగబోతోందని తెలుస్తోంది. మెగా స్టార్ చిరంజీవికి పద్మ విభూషణ్ వచ్చిన సందర్భంలో ఎలాగైతే సన్మానం చేశారో అలానే, నటసింహానికి సన్మానం ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి తన సమకాలికులైనా చిరు, నాగ్, వెంకీ వచ్చే చాన్స్ ఉందని తెలుస్తోంది. ఇక ఇదే సభలో బాబాయ్ కోసం ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ గజమాల తీసుకొస్తున్నారట. ఆల్రెడీ అన్ స్టాపబుల్ తోనే బాబాయ్, అబ్బాయ్ కలిశారని తేల్చాలనుకున్నారు. అంతకు ముందే ఇలా ఓ సందర్భం వచ్చిందంటున్నారు. నిజమేనా? హావేలుక్
నటసింహం బాలయ్యకి పద్మ భూషణ్ ఎనౌన్స్ చేశాక, ఎంటైర్ ఇండస్ట్రీ నుంచి అభిమాన వెళ్లువ కనిపించింది. సోషల్ మీడియా ఊగిపోయింది. కట్ చేస్తే ఇప్పుడు వార్తా పత్రికల్లో వచ్చిన యాడ్ తో, నందమూరి ఫ్యామిలీ నుంచి ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ని వెలివేశారన్నట్టు ప్రచారం జరుగుతోంది. నిజంగా ఆ యాడ్ లో నందమూరి ఫ్యామిలీ మెంబర్స్ లిస్ట్ చూసినా, ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ పేర్లు మిస్సయ్యాయి. అలా చూస్తే ఇది నిజమేమో అనుకోవచ్చు..
కాని రియాలిటీ మాత్రం ఇంకోలా ఉంది. ఆ యాడ్ లో బాలయ్య, అలానే వియ్యంకుడి కుటుంబం సభ్యుల లిస్ట్ ఇచ్చారు. ఇక బాలయ్య సోదరుల ఫ్యామిలీ, సిస్టర్స్ ఫ్యామిలీ లిస్ట్ ఇచ్చారు. కాకపోతే ఎవరి పిల్లల వివరాలు ఇవ్వలేదు. కాబట్టి కేవలం ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ పేర్లు మాత్రమే మిస్ అయ్యాయని, దాన్నే హైలెట్ చేస్తున్నారు. కాని మిగతా వాళ్ల తాలూకు మూడో తరం పిల్లల పేర్లెక్కడా లేవు.. అది మాత్రం గమనించట్లేదు.
సో బాలయ్య పద్మభూషణ్ తాలూకు యాడ్ లో ఎక్కడా ఎన్టీఆర్ ని దూరం పెట్టినట్టు లేనే లేదు. అయినా అసలా యాడే బాలయ్య పరిదిలో లేదు. ఇవన్నీ ఒక ఎత్తైతే, బాలయ్య పద్మభూషన్ సన్మాన సభకి బాబాయ్ కూడా రంగంలోకి దిగుతున్నాడు. అన్న కళ్యాణ్ రామ్ తో కలిసి ఎన్టీఆర్ ఈ సన్మాన సభకి వస్తున్నట్టు తెలుస్తోంది. ఆల్రెడీ ట్విట్టర్లో బాలా బాబాయ్ అంటూ తన ప్రేమని ట్వీట్ రూపంలో చూపించాడు
నిజానికి బాలయ్య షో అన్ స్టాపబుల్ లో ఒక ఎపిసోడ్ ఎన్టీఆర్ కోసం ప్లాన్ చేశారు. క్వశ్చనేర్ రెడీ చేశారు. కాని కొత్త సీజన్ లోనే ఆ ఎపిసోడ్ ఉంటే బెటరన్న ప్రోగ్రామ్ మేకర్స్ నిర్ణయంతో, అలా ఆ ఐడియాను పోస్ట్ పోన్ చేసినట్టు తెలిసింది. లేదంటే ఈ పాటికే అన్ స్టాపబుల్ షోలో అటు అబ్బాయ్ ఇటు బాబాయ్ ఎంట్రీ లో ఫ్రేమ్ పేలిపోయేది. అయినా అంతకంటేముందే సన్మాన సభ మీద అలాంటి ఘట్టం కనిపించబోతోంది
బాలయ్యని సన్మానించే పనిలో భాగంగా ఇండస్ట్రీ కదిలొచ్చేలా ఉంది. చిరు కూడా వెంకీ తో కలిసి ఈ సభకి వస్తాడని తెలుస్తోంది. నాగ్ విషయంలోనే క్లారిటీ లేదు. మొత్తానికి బాలయ్య సన్మాన సభమీద ఎన్టీఆర్ , కళ్యాణ్ రామ్ మెరిస్తే, చాలా వరకు నెగెటీవ్ ప్రచారాలకు ఫుల్ స్టాప్ పడుతుంది. ఇక చిరు కూడా వస్తే ఆ సభ లో సమకాలికుడిగా ఇండస్ట్రీ మరింత గొప్పగా యూనిటీని చాటుకున్నట్టౌతుంది.