100 కోట్ల రెమ్యునరేషన్… ఫేక్ గాళ్ల మీద నాటు పంచ్….
నటసింహం బాలయ్య బాంబు పేల్చాడు. ప్రజెంట్ వందలు, వేల కోట్ల వసూల్ల మీద వినిపిస్తున్న నెంబర్స్ మీద దాడి చేశాడు. ఫేక్ కలెక్సన్స్ మీద కౌంటర్ విసిరాడు.
నటసింహం బాలయ్య బాంబు పేల్చాడు. ప్రజెంట్ వందలు, వేల కోట్ల వసూల్ల మీద వినిపిస్తున్న నెంబర్స్ మీద దాడి చేశాడు. ఫేక్ కలెక్సన్స్ మీద కౌంటర్ విసిరాడు. దీంతో ఇప్పుడు పుష్ప2 కలెక్షన్స్ కి ఈ కామెంట్ల ఘాటు తగిలినట్టైంది. ఐటీ రైడ్స్ తర్వాత పుష్ప2 కలెక్షన్స్ మీద కామెంట్లు, ట్రోలింగ్స్ పెరిగాయి. ఇలాంటి టైంలో ఫేక్ కలెక్షన్స్ మీద బాలయ్య మాట, తూటాలా పేలింది. ఇదే టైంలో తన పారితోషికం ఫస్ట్ టైం వందకోట్లకు చేరినట్టే అన్న మాట కూడా షాక్ ఇస్తోంది. 64 ఏళ్ళ వయసులో పాన్ ఇండియా మూవీతో 100 కోట్లు వెనకేసుకుంటున్నాడని తెలుస్తోంది. రిలీజ్ కి ముందే 500 కోట్లు బిజినెస్ చేసిన మూవీనే బాలయ్య పంట పండేలా చేస్తోంది. మొన్నటి వరకు పాతిక కోట్లకే పరిమితమైన నటసింహం, రెమ్యునరేషన్ ఏకంగా 3 రెట్లు పెరిగి, 100 కోట్లని టచ్ చేసిందని తెలుస్తోంది. మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున, విక్టరీ వెంకటేష్ ఈ ముగ్గురిని నటసింహం వెనక్కి నెట్టీ మరీ, పాన్ ఇండియా లెవల్లో ముందుకు దూసుకెళుతున్నాడా? హావేలుక్
నటసింహం బాలయ్య నిన్న పేల్చిన నాటు బాంబు లాంటి మాట, నిదానంగా ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. ఒరిజినల్ రికార్డ్స్ అంటూ తను ఇచ్చిన స్టేట్ మెంట్ దెబ్బకి, పుష్ప2 నెంబర్స్ లో కదలిక వచ్చింది. ఏకంగా ఈసినిమా వసూళ్లలో 550 కోట్ల వరకు ఫేక్ అంటున్నారు. ఇన్ కమ్ ట్యాక్స్ రైడ్ లో మైత్రీ మూవీ మేకర్స్ అండ్ కో దగ్గర బ్లాక్ మనీ దొరక్కున్నా…? ఎకౌంట్స్ లో మాత్రం భారీ గా బొక్కలు కనిపించాయని ప్రచారం జరుగుతోంది. వరుసగా 3 రోజులుఎకౌంట్స్ చూశారంటే, అప్పుడే ఆ లెక్కల్లో ఉన్న తేడా ఏంటో ఊహించొచ్చంటున్నారు.
కేవలం బాలీవుడ్ లోనే ఇలా డమ్మీ కలెక్షన్స్ ని ఎనౌన్స్ చేయటం, లేదంటే కార్పోరేట్ బుక్కింగ్స్ లాంటి జిమ్మిక్కులు చేస్తారనే అభిప్రాయముంది. ఇప్పుడు అది తెలుగు సినిమాకు కూడా పాకిందా? ఎందుకంటే 1850 కోట్ల వసూళ్లు దాటిన పుష్పరాజ్ ఎప్పుడో బాహుబలి 2 ని బీట్ చేసినట్టే.కాని సడన్ గా ఐటీ రైడ్ జరగ్గానే ఆ లెక్కలు 1700 కోట్లకు తగ్గాయి. మూడోరోజు ఎకౌంట్స్ తో 1250 కోట్ల పుష్ప2 అన్నమాట బయటికి వస్తోంది..వీటిని బట్టే నటసింహం బాలయ్య తనవి ఒరిజినల్ రికార్డ్స్ అని సెటైర్ వేశాడనంటున్నారు.
ఈ మాటలే అల్లు ఆర్మీకి మింగుడు పడేలా లేవు… ఏదేమైనా ఇదే టైంలో 100 కోట్ల బాలయ్య అంటూ ఓ న్యూస్ తన ఫ్యాన్స్ కి కిక్ ఇస్తోంది.పాన్ ఇండియా ట్రెండ్ మొదలయ్యాకే పాతిక, 50 కోట్లు మించి తీసుకోని ప్రభాస్, అండ్ కో ఇప్పుడు 200 కోట్లు, 300 కోట్ల వరకు ఎదిగారు. కాని చిరు, బాలయ్య, నాగ్, వెంకికి మాత్రం తెలుగులో నే ఆ వెలుగులు కనిపించాయి. నార్త్ మార్కెట్ ని ఎవరైతే కొల్లగొడతారో, వాళ్లకే వందకోట్లకుమించి రెమ్యునరేషన్ తీసుకునే అవకాశం ఉంటుందనే తేలింది. అందుకే చిరు, సైరా నుంచి విశ్వంభర వరకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నాడు. కాని దసరా డైరెక్టర్ తో తను చేసే మూవీకి 80 కోట్లే తీసుకోగలిగాడు, కాని వందకోట్లు రీచ్ కాలేదు..
ఆ రికార్డు ఇప్పుడు నటసింహం బాలయ్యకే దక్కేలా ఉంది. ఎందుకంటే తన అఖండ 2 నార్త్ ఇండియాని షేక్ చేసేలా ఉంది.రిలీజ్ కిముందే 500 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ చేస్తుండటంతోనే, టాలీవుడ్ సీనియర్స్ లో వందకోట్ల పారితోషికం ముందు బాలయ్యనే వరించేలా ఉంది. ఎందుకంటే, సీనియర్స్ లో పాన్ ఇండియా హిట్ పడింది తనొక్కడికే. అఖండతో నార్త్ ఇండియాలో లేటుగా హిట్ మెట్టెక్కిన బాలయ్య ఈసారి, పూర్తిస్థాయిలో అఖండ2 ని హిందీలో డైరెక్ట్ రిలీజ్ చేయిస్తున్నాడు.
రిలీజ్ కిముందే ఈ మూవీ ఓటీటీరైట్స్, నార్త్ ఇండియా రైట్స్ 390 కోట్లు దాటాయి. ఇక తెలుగు మార్కెట్ తోపాటు ఓవర్ సీస్ రైట్స్ రూపంలో 110 కోట్లు దక్కాయని తెలుస్తోంది. అంటే రిలీజ్ కిముందే 500 కోట్లు రావటం, అందులో 20 శాతం తన వాటాగా బాలయ్య తీసుకుంటున్నాడు కాబట్టి 100 కోట్లకు తన పారితోషికం పెరిగినట్టే అని తేల్చారు. అసలే కుంభమేళా జరుగుతున్న వేల, అఖండ 2 ప్రీరిలీజ్ 500 కోట్లు దాటింది. దసరాను టార్గెట్ చేసుకుంటున్న ఈసినిమా పాన్ ఇండియాని ఊపితే మాత్రం, ఇక సీనియర్స్ లో పాన్ ఇండియా మార్కెట్ ని కొల్లగొట్టిన హీరోగా నటసింహం పేరు మారుమోగుతుంది.