కొడుకు కోసం అఖండను రిస్క్ చేస్తున్న బాలయ్య
నందమూరి మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ ఏమోగానీ ఇప్పుడు బాలకృష్ణకు ఇది పెద్ద తలనొప్పిగా మారింది అంటున్నాయి టాలీవుడ్ సర్కిల్స్. బాలకృష్ణ ఎప్పటినుంచో తన కొడుకుని సినిమాల్లోకి తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.
నందమూరి మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ ఏమోగానీ ఇప్పుడు బాలకృష్ణకు ఇది పెద్ద తలనొప్పిగా మారింది అంటున్నాయి టాలీవుడ్ సర్కిల్స్. బాలకృష్ణ ఎప్పటినుంచో తన కొడుకుని సినిమాల్లోకి తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. దాదాపు 6 ఏళ్ల నుంచి ప్రయత్నాలు జరుగుతుంటే ఈ ఏడాది దీనికి ముహూర్తం ఫిక్స్ చేశారు. హనుమాన్ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన ప్రశాంత్ వర్మతో తన కొడుకుని టాలీవుడ్ కు పరిచయం చేయాలని బాలకృష్ణ పట్టుదలగా ముందుకు అడుగు వేశారు.
అయితే ఈ సినిమా విషయంలో చాలా రూమర్స్ వచ్చాయి… సినిమా ఆగిపోయిందని ప్రచారం జరిగింది. అయితే తాజాగా దీనిపై సినిమా మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. సినిమా అసలు ఆగిపోలేదని కేవలం అవన్నీ ప్రచారాలని వాటిని నమ్మవద్దని రిక్వెస్ట్ చేశారు. సినిమా అప్డేట్స్ అన్నీ కూడా టైం వచ్చినప్పుడు బయటకు వస్తాయని… కాబట్టి ఎదురు చూడాలని ప్రశాంత్ వర్మ కూడా తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అయితే ఇప్పుడు బాలకృష్ణ మాత్రం తన ఫేవరేట్ డైరెక్టర్ తో కొడుకును పరిచయం చేయడానికి రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది.
ఎలాగైనా వచ్చేయడాది సినిమాల్లో పరిచయం చేయాలనే బాలయ్య పట్టుదలగా ఉన్నాడు. అందుకే అఖండ సీక్వెల్లో తన కొడుకుని పరిచయం చేయడానికి ప్లాన్ చేసేసాడు. ఇప్పటికి బోయపాటి కూడా మోక్షజ్ఞ కోసం ఒక పవర్ఫుల్ రోల్ రెడీ చేసి పెట్టుకున్నారట. దాదాపు అరగంట పాటు అఖండ సీక్వెల్ లో ఆ రోల్ ఉండేలా ప్లాన్ చేసాడు బోయపాటి. ఇద్దరితో ఒక యాక్షన్ సీన్ కూడా ప్లాన్ చేసేసాడు. పాన్ ఇండియా లెవెల్లో ఆ సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి కచ్చితంగా తన కొడుకు గురించి కూడా పాన్ ఇండియా లెవెల్ లో ఆడియన్స్ చూస్తారని బాలయ్య ప్లాన్.
ప్రశాంత్ వర్మ సినిమా కోసం ఎదురు చూడకుండా ముందే తాను ఇంటర్ద్యూస్ చేయాలని బాలయ్య పట్టుదలగా ఉన్నారు. ఇక బోయపాటి కూడా ఈ విషయంలో వెనకడుగు వేయడం లేదట. ఈ సినిమాలో తన కొడుకుకి ఎంపీ రోల్ ఇచ్చినట్టు టాక్. ఫస్ట్ పార్ట్ లో సుబ్బరాజు ఎంపీ హోదాలో చనిపోతాడు. తర్వాత ఆ పాత్రకు తన కొడుకుని పరిచయం చేయాలని… ఆ పాత్రని పవర్ ఫుల్ గా డిజైన్ చేయాలని బోయపాటికి బాలయ్య చెప్పారట. దీంతో బోయపాటి కూడా ఆ విషయంలో సీరియస్ గా అడుగులు వేస్తున్నట్టు నందమూరి ఫ్యాన్స్ అంటున్నారు. దీనికి సంబంధించి త్వరలోనే క్రేజీ అప్డేట్ కూడా రానుందని సమాచారం. ఇక ప్రశాంత్ సినిమాతో పాటుగా ఆదిత్య 369 సీక్వెల్ లో కూడా మోక్షజ్ఞ నటించనున్నాడు. 2026 జనవరి తర్వాత మొదలుపెట్టే ఛాన్స్ ఉంది. త్వరలోనే బాలకృష్ణ బాబి కొల్లి డైరెక్షన్లో డాకు మహారాజ్ అనే సినిమాను రిలీజ్ చేయనున్నారు.