బాబాయ్ ని అబ్బాయ్, ఇక్కడ మించితే.. అక్కడ బాబాయ్ దాడి .?
నటసింహం గర్జిస్తే జై బాలయ్య అని అబ్బాయే అరుస్తాడు.. బేసిగ్గా బాబాయ్ మీద అబ్బాయ్ కి ఉండే అభిమానం అలాంటిది. అపార్ట్ ఫ్రం పాలిటిక్స్, సినిమాల విషయంలో బాబాయ్ అంటే అబ్బాయ్ ఎన్టీఆర్ కి ప్రేమ ఎక్కువే.. ఐతే ఇక్కడ ఫ్యామిలీస్ మధ్య గ్యాప్ గురించి డిస్కర్షన్ పక్కన పెడితే, టాలీవుడ్ లో అబ్బాయ్ కంటే బాబాయ్ దే పైచేయి.
నటసింహం గర్జిస్తే జై బాలయ్య అని అబ్బాయే అరుస్తాడు.. బేసిగ్గా బాబాయ్ మీద అబ్బాయ్ కి ఉండే అభిమానం అలాంటిది. అపార్ట్ ఫ్రం పాలిటిక్స్, సినిమాల విషయంలో బాబాయ్ అంటే అబ్బాయ్ ఎన్టీఆర్ కి ప్రేమ ఎక్కువే.. ఐతే ఇక్కడ ఫ్యామిలీస్ మధ్య గ్యాప్ గురించి డిస్కర్షన్ పక్కన పెడితే, టాలీవుడ్ లో అబ్బాయ్ కంటే బాబాయ్ దే పైచేయి.. దశాబ్దాలుగా ఇండస్ట్రీకి నాలు స్థంబాల్లో ఒక స్థంబంగా ఉన్నాడు బాలయ్య. కాకపోతే పాన్ ఇండియా లెవల్లో మాత్రం బాబాయ్ బాలయ్యని అబ్బాయ్ ఎన్టీఆర్ ఎప్పుడో దాటాడు. కాని బాబాయే పాన్ ఇండియా లెవల్లో అఖండతో అబ్బాయి వేగాన్ని అందుకోబోయాడు. కాని దాటేయ్యలేదు. ఐతే ఈ సారి రెండు సునామీలతో అబ్బాయ్ ని మించేలా దండెత్తుతున్నాడు బాలయ్య…. ఏకంగా ఇక్కడే కాదు, అక్కడా నటసింహమే అని ప్రూవ్ చేసుకునే పనిలో ఉన్నాడు. ఇందులో 50శాతం సక్సెస్ అయిన తను, మిగతా 50 శాతం సక్సెస్ రేటుకోసం, మాస్ డివోషనల్ పోటుతో పోటెత్తుతున్నాడు.
టాలీవుడ్ లో చిరు, బాలయ్య, నాగ్, వెంకీ నలుగురునాలుగు స్థంబాల్లాంటి స్టార్లు. కాని పాన్ఇండియా లెవల్లో ఒక్కొక్కరిది ఒక్కో స్టామినా. ఐతే తెలుగు మార్కెట్ పరంగా ఇప్పుడో కంపేరిజన్ షాకిస్తోంది… అదే బాబాయ్ అబ్బాయ్ మార్కెట్ స్టామినా..
తెలుగు మార్కెట్ పరంగా చూస్తే ఎన్టీఆర్ కంటే బాలయ్యదే టాప్ పొజిషన్. ఇమేజ్, క్రేజ్ విషయంలో కూడా అబ్బాయ్ తో పోలికే లేదు. ఎంతైనా సీనియర్ కమ్ నటసింహం కాబట్టి. కాకపోతే పాన్ ఇండియా లెవల్లో మాత్రం అబ్బాయ్ ఎన్టీఆర్ దే పై చేయి.. రాజమౌళి పుణ్యమాని త్రిబుల్ ఆర్ తో తొలి హిట్, తన మాస్ డబ్బింగ్ మూవీలతో నార్త్ లో వచ్చిన మాస్ ఫ్యాన్ బేస్ కి దేవర కిక్ ఇవ్వటం మరో లక్..
మొత్తంగా నార్త్ ఇండియాలోనే కాదు, పాన్ ఇండియా లెవల్లో బాబాయ్ ని మించిపోయాడు అబ్బాయి.. ఐతే బాలయ్య తక్కువేం కాదు, తనెప్పుడు పాన్ ఇండియా ప్రయత్నాలు చేయలేదు. గౌతమీ పుత్ర శాతకర్ణి గతంలో వర్కవుట్ అయినా, లేదంటే అఖండ ని నార్త్లో ఇన్ టైం లోనే హిందీ వర్షన్ రిలీజ్ చేసినా, ఆ లెక్కే వేరుండేది.
విచిత్రం ఏంటంటే తెలుగు అర్ధం కాకున్నా అఖండని నార్త్ ఇండియన్స్ చూశారు. లేటుగా అఖండ హిందీ వర్షన్ రావటంతో, పూనకాలు తెప్పించే రేంజ్ల ో వసూళ్లు నార్త్ లో వచ్చే ఛాన్స్ మిస్ అయ్యింది
కాబట్టి ఇప్పుడు డాకూ మహరాజా తో పాన్ ఇండియా ని షేక్ చేసేందుకు బాలయ్య వస్తున్నాడు.ఆతర్వాత అఖండ 2 తో పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేశాడు. సో టాలీవుడ్ లోనే కాదు, పాన్ ఇండియా లో కూడా అబ్బాయి అబ్బాయే, బాబాయ్ బాబాయే అనిపించేందుకు బాలయ్య దూసుకొస్తున్నాడు. కాకపోతే ఎంతైనా అబ్బాయ్ తో బాబాయ్ పోటీ పడే పరిస్థితి మాత్రం వచ్చిందంటే, అంతా పాన్ ఇండియా మార్కెట్ మహిమే.. ఆవిషయంలో ఎన్టీఆర్ నిజంగా మ్యాన్ ఆఫ్ మాసెసే..