నటసింహం బాలయ్య ఫ్యాన్స్ కి, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ అభిమానులకి మధ్య సోషల్ మీడియా వార్ జరుగుతోందంన్నారు. కాకపోతే మొన్నటి వరకు బాబాయ్ కి దగ్గరౌతున్న అబ్బాయ్ అంటూ చాలా వరకు సిగ్నల్స్ వచ్చాయి. ఇంతలో బాలయ్య ఫ్యాన్స్ కి, ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి మధ్య సోషల్ మీడియా వార్ కి అన్ స్టాపబుల్ షోనే కారణమైందన్నారు. సీన్ లోకి వచ్చిన నాగవంశీ సింపుల్ ఆన్సర్ తో మొత్తం వార్ కే డోర్ క్లోజ్ చేశాడు. అబ్బాయ్ మీద బాబాయ్ బాలయ్యకి ఉన్న ప్రేమని సలహా రూపంలో తేల్చాడు. ఈ ఒక్క మాటతో మొత్తం ఫ్యాన్స్ మధ్య మాటల యుద్ధం ఆగిపోయిందని కూడా అంటున్నారు. కాని ఇదంతా ఒకరిద్దరి క్రియేషన్ అని తెలుస్తోంది. ఇంతకి ఈ సడన్ వార్, మధ్యలో నిర్మాత సీన్ లోకి రావటం, తర్వాత సోషల్ మీడియాలో కామెంట్లు తగ్గటమేంటి? ఏం జరుగుతోంది? ఫైనల్ గా ఏం తేలింది? నటిసంహం బాలయ్య, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ మధ్య గ్యాప్ ఉందని కొందరు, లేదు బాబాయ్ కి దగ్గరయ్యే ప్రయత్నల్లో ఎన్టీఆర్ అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ప్రస్థుతానికి ఇండస్ట్రీలో మాత్రం ఈ డిస్కర్షన్ ఉంది. ఐతే అన్ స్టాపబుల్ షోలో డైరెక్టర్ బాబీ జైలవకుశ ప్రస్తావన తెస్తే, బాలయ్య టీం మెంబర్సే ఆ విజువల్స్ ని ఎడిట్ చేశారంటూ ప్రచారం జరిగింది ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా ఈవిషయంలో ఫైర్ అయ్యారని, సోషల్ మీడియాలో పెద్ద రచ్చే జరిగిందన్నారు. ఐతే సీన్ లోకి డాకు మహరాజ్ నిర్మాత నాగవంశీ వచ్చాడు. అస్సలు తమ మధ్య జై లవకుశ మూవీ టాపిక్కే రాలేదన్నాడు. విచిత్రం ఏంటంటే ఎన్టీఆర్ ఎలాంటి పాత్ర చేస్తే బాగుండో బాలయ్యే సలహా కూడా ఇచ్చాడని తానే అన్నాడు దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూల్ అయ్యారనే ప్రచారం జరుగుతోంది. కాని ఇదంతా కవరప్ స్టోరీ అనే కామెంట్లు కూడా వచ్చాయి. అయితే రియాలిటీ చెక్ చేస్తే బాలకృష్ణ, ఎన్టీఆర్ మధ్య దూరం తగ్గటమే కాదు, అస్ స్టాపబుల్ షోకి తారక్ వచ్చేందుకు సిద్దమనే సిగ్నల్స్ కూడా పంపించాడని తెలుస్తోంది. ఆల్రెడీ షో ప్లాన్ చేశారు. కుదర్లేదు. కొత్త సీజన్ కోసం ఆ షో తాలూకు ప్రశ్న పత్రం అలానే ప్రిజర్వ్ చేశారన్న లీకులు కూడా బయటికి వచ్చాయి సో ఎలా చూసినా బాబాయ్ కి అబ్బాయ్ దగ్గరవుతున్నాడని తెలుస్తోంది. కాని బాలయ్య ఫ్యాన్స్ కి, ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి మాత్రం మిస్ ఇన్ ఫర్ మేషన్ వెళ్లిందని తెలుస్తోంది. ఎక్కువ ఎన్నారైల్లో ఉండే ఈ ఇద్దరి ఫ్యాన్స్ మధ్య మాత్రం కాస్త సోషల్ మీడియా వార్ మాత్రం నడిచినట్టు తెలుస్తోంది ఏదేమైనా నాగవంశీ సీన్ లోకొచ్చాకే కొంతవరకు ఈ ఫ్యాన్స్ వార్ కి బ్రేక్ పడినట్టే కనిపిస్తోంది. నిజానికి నాగ వంశీ ఏకంగా ఎన్టీఆర్ ని బాబాయ్ మూవీ డాకూ మహరాజ్ ఈవెంట్ కి తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేశాడట. ఐతే ప్రమోషన్ కి టైంలేకపోవటం, హర్రీ బర్రీగా ఈవెంట్ ప్లాన్ చేయాల్సి రావటంతో కుదర్లేదని తెలుస్తోంది. ఏదేమైనా బాబాయ్, అబ్బాయ్ ఎపిసోడ్ కి మాత్రం ప్రజెంట్ ఫుల్ స్టాప్ పడినట్టే కనిపిస్తోంది. సోషల్ మీడియాలో వార్ డోర్స్ క్లోజ్ అవటంతో కాస్త పరిస్థితులు కూల్ అయినట్టే కనిపిస్తున్నాయి. [embed]https://www.youtube.com/watch?v=63L8SsPa9Nk[/embed]