సంక్రాంతి వచ్చిందంటే చాలు మెగా నందమూరి ఫ్యామిలీల సినిమాలతో థియేటర్లు సందడి సందడిగా ఉంటాయి. భారీ అంచనాలతో వీళ్ళ సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. దాదాపు 30 ఏళ్ల నుంచి మెగా నందమూరి ఫ్యామిలీల మధ్య సంక్రాంతి యుద్ధం జరుగుతూనే ఉంది. చిరంజీవి బాలకృష్ణ సినిమాలు ఎక్కువగా రిలీజ్ అయ్యేవి. పోటాపోటీగా సినిమాలను ప్లాన్ చేసేవారు. మాస్ ఎలిమెంట్స్ తో వచ్చే ఆ సినిమాలకు మంచి క్రేజ్ ఉండేది. మాస్ ఆడియన్స్ కు సంక్రాంతి అంటే వీళ్ళ సినిమాలే అన్నట్లు వాతావరణం ఉండేది. అయితే ఈసారి సంక్రాంతి బరిలో బాలకృష్ణకు పోటీగా రామ్ చరణ్ నిలిచాడు. గేమ్ చేంజర్ సినిమాతో బాలయ్యకు సవాల్ చేశాడు రామ్ చరణ్. సినిమా ప్రమోషనల్ ఈవెంట్స్ లో బాలకృష్ణ హెల్ప్ కూడా తీసుకోవడం ఈసారి హైలెట్. అయితే సినిమా మాత్రం ఆశించిన స్థాయిలో లేదు అనే టాక్ వస్తుంది. భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమాను.. దిల్ రాజు ప్రొడ్యూస్ చేశారు. భారీ లాభాలు వస్తాయని కూడా ప్లాన్ చేసుకున్నారు. కానీ అనుకున్న రేంజ్ లో సినిమా ఆడక పోవడంతో ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఇక మరో రెండు రోజుల్లో నందమూరి బాలకృష్ణ సినిమా రిలీజ్ అవుతుంది. దీనితో ఆ సినిమాకు కూడా భారీగానే థియేటర్లను కేటాయించారు. కచ్చితంగా ఆ సినిమా హిట్ అవుతుందనే కాన్ఫిడెన్స్ లో నందమూరి ఫ్యాన్స్ ఉన్నారు. దీనితో ఈసారి సంక్రాంతి విన్నర్ బాలకృష్ణ అంటూ కాలర్ ఎగరేస్తున్నారు ఫ్యాన్స్. డాకు మహారాజ్ విషయంలో బాలకృష్ణ కూడా చాలా కాన్ఫిడెన్స్ గా ఉన్నారు. సినిమా రిలీజ్ విషయంలో ఎక్కడా తొందరపడకుండా సంక్రాంతికి పక్కాగా ప్లాన్ చేసుకునే రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా కచ్చితంగా గేమ్ చేంజర్ వసూళ్లపై దెబ్బ కొట్టే ఛాన్స్ కూడా ఉంది అనే టాక్ వస్తుంది. గేమ్స్ చేంజర్ డీలా పడటంతో.. వెంకటేష్ హీరోగా వస్తున్న సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాకు కూడా ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంది అనే టాక్ వస్తుంది. వెంకటేష్ కూడా తన సినిమాకు భారీగానే ప్రమోషన్స్ చేస్తున్నారు. గతంలో ఎప్పుడూ లేనివిధంగా ప్రమోషన్స్ కు వెంకటేష్ అటెండ్ అవుతున్నారు. దీనితో ఆ సినిమా కూడా హిట్ కొట్టడం ఖాయం అనేది ఒపినియన్ లో ఆడియన్స్ ఉన్నారు. ఈవెంట్స్ కూడా గట్టిగానే జరుగుతున్నాయి. డాకు మహారాజ్ సినిమా ఈవెంట్స్ కూడా బాలకృష్ణ గట్టిగానే ప్లాన్ చేశారు. అయితే అనంతపురంలో ప్లాన్ చేసిన ప్రీ రిలీజ్ ఈవెంట్ మాత్రం వాయిదా పడింది. ఏది ఎలా ఉన్నా ఈసారి సంక్రాంతికి మాత్రం కచ్చితంగా మెగా ఫ్యామిలీ రేసులో ఓడిపోయినట్టే కనబడుతోంది. భారీ అంచనాలతో థియేటర్లో అడుగుపెట్టిన గేమ్ చేంజర్ సినిమా చూస్తున్న ఆడియన్స్ మధ్యలోనే బయటికి వచ్చేసిన పరిస్థితి. అటు సోషల్ మీడియాలో కూడా నెగిటివ్ టాక్ గట్టిగానే వస్తుంది.[embed]https://www.youtube.com/watch?v=IOzsk3FbHlc[/embed]