Balakrishna: తమిళ హీరో విజయ్ తో తెలంగాణ యాస తో పోటీకి దిగుతున్న బాలయ్య.. దసరా బుల్లోడు ఎవరౌతారు ?
దసరా అంటే సరదాల పండగ అని అందరికి తెలుసు. దసరా సెలవులను కాష్ చేసుకోడానికి చాలానే సినిమాలు రిలీజ్ అవుతుంటాయి.

Balakrishna with Tamil hero Vijay and Bhagwant Kesari in Telangana dialect will come before the audience for Dussehra festival
ఈ సారి దసరాకి కూడా పోటీ బాగానే ఉంది. అందులో అందరి దృష్టిని ఆకర్షిస్తోన్న సినిమా.. భగవత్ కేసరి బాలయ్య న్యూ లుక్ , తెలంగాణా యాస ప్లస్ పాయింట్స్ గా రెడీ అవుతున్న ఈ చిత్రానికి అనిల్ రావిపూడి డైరెక్టర్ బాలయ్య మార్క్ ఆక్షన్ కి అనిల్ మార్క్ కామెడీ ఫ్లేవర్ ఆడ్ చేసి రూపొందిస్తోన్న పక్కా మాస్ అండ్ కమర్షియల్ ఎంటర్టైనర్ అఖండ , వీరసింహా రెడ్డి హిట్లతో సూపర్ ఫార్మ్ లో ఉన్న బాలయ్య కి మరో బంపర్ హిట్ ఇవ్వడానికి రెడీ అవుతున్నాడు.
అనిల్ రావిపూడి ఇప్పటి దాకా ఒక్క ప్లాప్ కూడా లేకుండా సక్సెస్ జర్నీ చేస్తున్న అయన ఈ భగవత్ కేసరి తో ఆ ఇమేజ్ ని మరింత పెంచుకునే ప్రయత్నమే చేస్తున్నాడు. అయితే ఈ సినిమా విడుదల తేదీ విషయంలో చాలా రకాలుగా వార్తలు వైరల్ అవుతున్న టైం లో చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చింది. ఈ సినిమాను విజయదశమి కి విడుదల చేస్తున్నట్లుగా ముందుగానే ఒక పోస్టర్ వదిలారు. అయితే ఇప్పుడు అధికారికంగా మరొక అద్భుతమైన పోస్టర్తో రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 19వ తేదీన గ్రాండ్ గా విడుదల చేయబోతున్నట్లు ఒక హై వోల్టేజ్ మాస్ పోస్టర్ను కూడా వదిలారు.
ఇక అక్టోబర్ 19వ తేదీన తమిళ హీరో విజయ్ లియో సినిమా కూడా తెలుగు రాష్ట్రాల్లో విడుదల కాబోతోంది. ఆ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణలో డోస్ట్రిబ్యూట్ చేస్తున్న విషయం తెలిసిందే. కాస్త థియేటర్లో విషయంలో అయితే పోటీ నెలకొనే అవకాశం ఉంది. ఎందుకంటే విక్రమ్ సినిమా తర్వాత లోకేష్ కనగరాజుకు తెలుగులో కూడా మంచి డిమాండ్ అయితే పెరుగుతుంది.. కాబట్టి ఈ దసరాకి లియో అండ్ భగవంత్ కేసరి సినిమాల మధ్య బాక్సాఫీస్ ఫైట్ ఈసారి ఆసక్తికరంగా కొనసాగే అవకాశం ఉంది. సో ఫ్యాన్స్ జస్ట్ వెయిట్ ఫర్ దసరా.