Balakrishna: బాలయ్య కూడా భయపడాల్సిందే.. తమిళ సినిమాల హవా మొదలైందా..?
ఒకప్పుడు తమిళ్ మూవీ వస్తోందంటే తెలుగు మార్కెట్ ఊగిపోయేది. ఇప్పుడు మల్లీ ఆ రోజులు వస్తున్నట్టున్నాయి. ఒక్క జైలర్ హిట్ అవటం వల్లే ఈ పరిస్థితి వచ్చిందనుకోలేం. కమల్ విక్రమ్‌గా, రజినీ జైలర్‌గా ఇరగదీశారు. అది కూడా.. చిరు భోళా శంకర్ ప్లాప్ అవటం.. జైలర్ హిట్ అవటంతో సీన్ మారిందా అని అనుకోవాల్సి వస్తోంది.
Balakrishna: నిజానికి బాలీవుడ్, కోలీవుడ్, ఇలా అన్ని ఫిల్మ్ ఇండస్ట్రీలు డీలా పడిన టైంలో బాహుబలితో ట్రెండ్ సెట్ చేసింది టాలీవుడ్. తర్వాత వరుస హిట్లతో తెలుగు సినిమా వెలిగింది. మనముందు ఫ్లాపులతో కోలీవుడ్ నలిగింది. కట్ చేస్తే జైలర్ హిట్ తర్వాత సీన్ రివర్స్ అయినట్టుంది. ఒకప్పుడు తమిళ్ మూవీ వస్తోందంటే తెలుగు మార్కెట్ ఊగిపోయేది. ఇప్పుడు మల్లీ ఆ రోజులు వస్తున్నట్టున్నాయి.
ఒక్క జైలర్ హిట్ అవటం వల్లే ఈ పరిస్థితి వచ్చిందనుకోలేం. కమల్ విక్రమ్‌గా, రజినీ జైలర్‌గా ఇరగదీశారు. అది కూడా.. చిరు భోళా శంకర్ ప్లాప్ అవటం.. జైలర్ హిట్ అవటంతో సీన్ మారిందా అని అనుకోవాల్సి వస్తోంది. ఇలాంటి టైంలో విక్రమ్ లాంటి హిట్ ఇచ్చిన లోకేష్ కనకరాజ్ మేకింగ్‌లో లియో వస్తోంది. ఎగ్జాక్ట్‌గా బాలయ్య భగవంత్ కేసరి వచ్చే రోజే లియో రాబోతోంది. దీంతో హిట్లు తప్ప ఫెల్యూర్స్ తెలియని అనిల్ రావిపుడి కూడా రిలీజ్ డేట్ మారుస్తామా అనేంతవరకు సీన్ మారింది. తమిళ దళపతి విజయ్.. మాస్టర్, తుపాకి వంటి సినిమాలతో ఇక్కడ హిట్లు పట్టినా.. తన మార్కెట్ ఎప్పుడు స్టేబుల్ గా ఉంటుందనుకోలేం. కాని కంటెంట్ ఉన్న మూవీ పడితే తన జోరు ఊహించలేం.
అలాంటిది ఖైదీ, విక్రమ్ లాంటి ట్రెండ్ సెట్టర్ మూవీలు తీసిన లోకేష్ మేకింగ్‌లో లియో వస్తోంది. సో ఒకప్పటిలా మళ్లీ తమిళ మూవీల డామినేషన్ షురూ అయ్యిందనుకోవాలా..? విక్రమ్, జైలర్ హిట్లని చూసి లియోకి, భగవంత్ కేసరి లాంటి మూవీ భయపడాలా..? ఈ డౌట్లకి భోళాశంకరే బెటర్ ఎగ్జాంపుల్. జైలర్ రిలీజ్ టైంలో వచ్చి బొక్కబోర్లా పడాల్సి వచ్చింది. సో చిరు తర్వాత బాలయ్యకి తమిళ హీరో మూవీ గండంగా మారుతోంది.